మతాబాల విరి జల్లులా దీపావళి,
ఎన్నెన్నో మధురోహలు
గిర్రున తిరిగే భూచక్రపు టిరుసులా దీపావళి,
చిమ్మ చీకటిన సూన్యంలో
నర్తించే విష్ణు చక్రపు విన్యాసంలా
నయగారాల మయూరిలా,
ఆకాశానికి ఎగసి జారే కాంతిపూలు,
నయాగరా జలపాతంలా
చిచ్చుబుడ్లు వెదజల్లిన జల్లులు
కాకరపూవొత్తుల మాలికలో
పూల పరిమలాలను విరజిమ్మిన
కాంతుల రవ్వలలో,
దీపావళి రోలు రోకళ్ళు సృష్టించే
శబ్దతరంగాలలో,
దీవిటీల సయ్యాటల విన్యాసాలో,
లక్ష్మీ బాంబుల విస్ఫోటాలలో,
అమావాస్య నిశిలో ఆకశాన
రాకెట్లు సృష్టించే హరివిల్లులో,
ప్రమిదల వెలుగుల్లో,
ప్రమదల ప్రమోదాల పరవశాలో,
పట్టు పరికిణీల రెపరెపల కాంతుల్లో,
కన్నెల కేరింతల రవళులో,
చిమ్మ చీకటిన విరిసిన కాంతులు,
విరజిమ్మిన దృశ్య కావ్యమో,
ప్రమోదాల హేళి దీపావళి
ప్రమాదాల సహేలి దీపావళి....
ఎన్నెన్నో మధురోహలు
గిర్రున తిరిగే భూచక్రపు టిరుసులా దీపావళి,
చిమ్మ చీకటిన సూన్యంలో
నర్తించే విష్ణు చక్రపు విన్యాసంలా
నయగారాల మయూరిలా,
ఆకాశానికి ఎగసి జారే కాంతిపూలు,
నయాగరా జలపాతంలా
చిచ్చుబుడ్లు వెదజల్లిన జల్లులు
కాకరపూవొత్తుల మాలికలో
పూల పరిమలాలను విరజిమ్మిన
కాంతుల రవ్వలలో,
దీపావళి రోలు రోకళ్ళు సృష్టించే
శబ్దతరంగాలలో,
దీవిటీల సయ్యాటల విన్యాసాలో,
లక్ష్మీ బాంబుల విస్ఫోటాలలో,
అమావాస్య నిశిలో ఆకశాన
రాకెట్లు సృష్టించే హరివిల్లులో,
ప్రమిదల వెలుగుల్లో,
ప్రమదల ప్రమోదాల పరవశాలో,
పట్టు పరికిణీల రెపరెపల కాంతుల్లో,
కన్నెల కేరింతల రవళులో,
చిమ్మ చీకటిన విరిసిన కాంతులు,
విరజిమ్మిన దృశ్య కావ్యమో,
ప్రమోదాల హేళి దీపావళి
ప్రమాదాల సహేలి దీపావళి....