నా చుట్టూ నిశ్శబ్దపు రాజ్యం
నా ఆలోచలన్న్నిటిని పగులగొట్టి
నాకు నేను విదించుకున్న శిక్ష మౌనం
ఆలోచనల అలల్లో తీరం దాటకుండా
నా మౌన సామ్రాజ్యంలో ఒక్కడిగా మిగిలిపోయా
ఆశల వలలో చిక్కుకుపోయిన నా ఆశలన్నిటిని
ముక్కలు గా చేసి తగులబెట్టాను
నీవస్తావని ఎదురు చూసి చూసి
ఆశ చచ్చిపోయింది
అందుకేగా మౌనమనే చీకటి
గుహలో నన్ను నేను కట్టేసుకున్నా
నీకోసం ఆలోచిస్తు
ఆవేశపడిపోతుంటా
అప్పుడు నా నుదుటి స్వేదం
గుండెలపైకి జారి
నిశ్శబ్దాన్ని చిద్రం చేస్తుంది
నాగుండెల్లో చేరిన
నీజ్ఞాపకాల అలజడికి
అవును కాదుల నడుమ
ఊపిరి సలపనంత ఊగిసలాట…
ఊపిరి ఆడటంలేదు
గుండె చప్పుడు కూడా
భరించలేక పోతున్నా
నా ఒంటరి తనపు
నిస్తేజమైన నిశ్శబ్దంలో
నాగొంతును నేనే కోసేసుకున్నా
నాస్వరపేటికలో పదునైన
నీ అవమానపు మాటల కత్తి దిగింది
ఇక మౌనంగానే మిగిలి పోతానేమో
నా ఆలోచలన్న్నిటిని పగులగొట్టి
నాకు నేను విదించుకున్న శిక్ష మౌనం
ఆలోచనల అలల్లో తీరం దాటకుండా
నా మౌన సామ్రాజ్యంలో ఒక్కడిగా మిగిలిపోయా
ఆశల వలలో చిక్కుకుపోయిన నా ఆశలన్నిటిని
ముక్కలు గా చేసి తగులబెట్టాను
నీవస్తావని ఎదురు చూసి చూసి
ఆశ చచ్చిపోయింది
అందుకేగా మౌనమనే చీకటి
గుహలో నన్ను నేను కట్టేసుకున్నా
నీకోసం ఆలోచిస్తు
ఆవేశపడిపోతుంటా
అప్పుడు నా నుదుటి స్వేదం
గుండెలపైకి జారి
నిశ్శబ్దాన్ని చిద్రం చేస్తుంది
నాగుండెల్లో చేరిన
నీజ్ఞాపకాల అలజడికి
అవును కాదుల నడుమ
ఊపిరి సలపనంత ఊగిసలాట…
ఊపిరి ఆడటంలేదు
గుండె చప్పుడు కూడా
భరించలేక పోతున్నా
నా ఒంటరి తనపు
నిస్తేజమైన నిశ్శబ్దంలో
నాగొంతును నేనే కోసేసుకున్నా
నాస్వరపేటికలో పదునైన
నీ అవమానపు మాటల కత్తి దిగింది
ఇక మౌనంగానే మిగిలి పోతానేమో