నేను కవిని కాదు
కాసిని కన్నీళ్ళు మొకాన జల్లుకొని
పైకి నవ్వాలనిచూస్తున్న బైరాగిని
అక్షరాలకు అర్దాలు తెలియవు
అవసరంలేని చోట అక్షరాలను పేర్చి
అద్బుతమైన భావాన్ని
బందించాలనుకున్నా
అక్షరాలను అమర్చి
ఎందుకోఅవిచూసి
గుండెల్లో గుచ్చుకున్నట్టైంది
నా కల్లు చెమర్చాయి..
ఎందుకనో ఆర్దం అర్దగాకేమో
తడి కళ్ళల్లో తేలాడిన
పదాలు, రెప్ప వాలే సరికి
కాగితం పైకి ఉరికాయి
కనిపించీ కనిపించను పదాల అమరిక
గుండె గాయాలకు
అక్షరాలను పేర్చి..
ఆ పేర్చినపదాల గోడలను
కవితలంటున్నాం ..నిజమే కదా
కాదని చెబుతున్నా నేనిప్పుడు
అవునా అన్నట్టు చూస్తావెందుకని
నాకు తెల్సింది రాస్తున్నా
కాలం కాలరాసినా గతన్నీ చెప్పాలన్న ప్రయత్నం
పొగడ్తలకోసంకాదు ...పొరమారిన గొంతులో
మిగిలిపోయిన మౌనాన్నిచెప్పాలన్న
విఫల ప్రయత్నమే ఇది
అందుకే నేను రాసేది కవిత్వంకాదు
అని నికార్సుగా మనస్సులోలోనుంచివచ్చిన
మాట ఇది అదే నేను రాసేది కవిత్వంకాదు అని
కాసిని కన్నీళ్ళు మొకాన జల్లుకొని
పైకి నవ్వాలనిచూస్తున్న బైరాగిని
అక్షరాలకు అర్దాలు తెలియవు
అవసరంలేని చోట అక్షరాలను పేర్చి
అద్బుతమైన భావాన్ని
బందించాలనుకున్నా
అక్షరాలను అమర్చి
ఎందుకోఅవిచూసి
గుండెల్లో గుచ్చుకున్నట్టైంది
నా కల్లు చెమర్చాయి..
ఎందుకనో ఆర్దం అర్దగాకేమో
తడి కళ్ళల్లో తేలాడిన
పదాలు, రెప్ప వాలే సరికి
కాగితం పైకి ఉరికాయి
కనిపించీ కనిపించను పదాల అమరిక
గుండె గాయాలకు
అక్షరాలను పేర్చి..
ఆ పేర్చినపదాల గోడలను
కవితలంటున్నాం ..నిజమే కదా
కాదని చెబుతున్నా నేనిప్పుడు
అవునా అన్నట్టు చూస్తావెందుకని
నాకు తెల్సింది రాస్తున్నా
కాలం కాలరాసినా గతన్నీ చెప్పాలన్న ప్రయత్నం
పొగడ్తలకోసంకాదు ...పొరమారిన గొంతులో
మిగిలిపోయిన మౌనాన్నిచెప్పాలన్న
విఫల ప్రయత్నమే ఇది
అందుకే నేను రాసేది కవిత్వంకాదు
అని నికార్సుగా మనస్సులోలోనుంచివచ్చిన
మాట ఇది అదే నేను రాసేది కవిత్వంకాదు అని