రాత్రి గడుస్తోందటే చాలు
ఉదయం గురించి భయం
భుజాన పడ్డ బాధ్యతలతో
గతాన్ని గుండెల్లో పెట్టుకొని
చేజారిన జ్ఞాపకాలతో
చెంతలేని నిన్ను తలచుకొంటూ
వేకువకి వేకువకీ చెప్పుకునేందుకు మిగిలిన
మధ్య ఎన్ని నిస్ప్రుహ విరహ వేదనలో
అనుభవంలో ఎదురైనవన్నీ నిరాశలే
గతం లేకుండానే గడుస్తోంది కాలం
నిశ్శబ్దంగా జారుకుంటోంది కాలం
నిన్నకు నేటికి మద్యి నలిగిన నిజాలను
పలుకరించలేని వాస్తవాల సాక్షిగా
ఎదురు చూడని ఘటనలతో
ఆవేదనగా చుస్తూ అక్రోశిస్తొంది మనస్సు
వెలుగుపై చీకటి
దాడి చేస్తున్నా
నిశీధిలో కలలు రెక్కలు
విచ్చుకుంటున్నాయి
అనంత కోటి నక్షత్రాలు
ఆకాశంలో మెరుస్తూ
వెలుగునంతటినీ నీకందించి
కటిక చీకట్లో నిలబడ్డాను ఒంటరిగా
నా గుండెలో నీపై
అనంతమైన ప్రేమ ఉంది
అర్దం చేసుకోవాల్సిన నీవు
లేవన్న దిగులు తప్ప
ఈ ప్రపంచంలో నన్ను నేను
ఎవరితోను పరిచయం చేసుకోలేను
మృదువైన నీ శరీర స్పర్శతో
నీ పక్కనే నేను ఉన్నా
అన్న అనుభూతితో
తక్కినవన్నీ తుచ్చమైపోతున్న
భావన లో నిద్రిస్తున్నా
అంతా కల అని తెల్సీ కలవర పడుతూ
ఉదయం గురించి భయం
భుజాన పడ్డ బాధ్యతలతో
గతాన్ని గుండెల్లో పెట్టుకొని
చేజారిన జ్ఞాపకాలతో
చెంతలేని నిన్ను తలచుకొంటూ
వేకువకి వేకువకీ చెప్పుకునేందుకు మిగిలిన
మధ్య ఎన్ని నిస్ప్రుహ విరహ వేదనలో
అనుభవంలో ఎదురైనవన్నీ నిరాశలే
గతం లేకుండానే గడుస్తోంది కాలం
నిశ్శబ్దంగా జారుకుంటోంది కాలం
నిన్నకు నేటికి మద్యి నలిగిన నిజాలను
పలుకరించలేని వాస్తవాల సాక్షిగా
ఎదురు చూడని ఘటనలతో
ఆవేదనగా చుస్తూ అక్రోశిస్తొంది మనస్సు
వెలుగుపై చీకటి
దాడి చేస్తున్నా
నిశీధిలో కలలు రెక్కలు
విచ్చుకుంటున్నాయి
అనంత కోటి నక్షత్రాలు
ఆకాశంలో మెరుస్తూ
వెలుగునంతటినీ నీకందించి
కటిక చీకట్లో నిలబడ్డాను ఒంటరిగా
నా గుండెలో నీపై
అనంతమైన ప్రేమ ఉంది
అర్దం చేసుకోవాల్సిన నీవు
లేవన్న దిగులు తప్ప
ఈ ప్రపంచంలో నన్ను నేను
ఎవరితోను పరిచయం చేసుకోలేను
మృదువైన నీ శరీర స్పర్శతో
నీ పక్కనే నేను ఉన్నా
అన్న అనుభూతితో
తక్కినవన్నీ తుచ్చమైపోతున్న
భావన లో నిద్రిస్తున్నా
అంతా కల అని తెల్సీ కలవర పడుతూ