. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, November 11, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(29)

1) ఏమి చేయాలో తెలీక తడబడుతూ
నేను "కల"కి దగ్గరయి "నిజానికి" దూరం అయ్యాను


2) కన్నీళ్ళు కాలువలై పారుతుంటే
ఙ్ఞాపకాలు పడవలుగా తేలుతున్నాయి ఎన్నాళ్ళిలా


3) ఇద్దరు మిత్రులునిజంగా
విడిపోవడమంటే చనిపోవడమేనేమో..


4) కళ్ళముందు జరుగుతున్న వాస్తవలను
చూస్తూకూడా ఇంకా బ్రమల్లోబ్రతకడం అవసరంలేదేమో..?


5) పగలు మండే ఎండలో కరిగిపొయే
నా జ్ఞాపకాలకు విలువ కట్టలేక మౌనంగా మిగిపోయా


6) గుండెల్లో చిరిగిన స్వప్నపు సంచుల్నీ
మనసుదారాలతో కుట్టాను నీకవి కనిపిస్తున్నాయా


7)ఆవేదనకు ఆకారం కల్పించలేక పడుతున్న బాద
విషపు చిరునవ్వుతో నిర్లీప్తంగా అవమానించే నీకేం తెలుసు


8) నా మనసు అపార్ధాల అగ్నిలో దగ్ధమవుతుంటే
ఏం తెలియనట్టు అమాయకంగా నటిస్తున్న నిన్ను చూస్తుంటే ....?


9) మరుగుతున్న నా రక్తంలో నిజాలు దాచాను
అవి నీకేలా చూపించాలో అర్దంకావడంలేదు కాస్త చెప్పవూ


10) నా మనసు తలుపులు నేనే మూసేస్తున్నాను
నీకునేను ... నాకు నేను ఎప్పటికీ కనిపించకూడదని


11) రాత్రుల్లో కాలిపోతాను..పగలు పండిపోతాను
నిద్దుర బరువుని నా కనురెప్పలు బరువుగా మోస్తున్నాయి


12) నాలోకి నువ్వు ఇచ్చిన ప్రతీ భావోద్వేగంలో
నీ జ్ఞాపకాల చితి మంటల్లో కాలిపోతున్నా నన్ను కాపాడవూ


13) నువ్వున్నప్పుడు పరుగెట్టిన కాలం
నా దగ్గరలేనప్పుడు స్థంబించిపోయింది ఎందుకని


14) రాత్రి కరిగినా మ౦చు తరగట౦ లేదు
పూలమొక్కల సిగలో ముత్యాలు మెరుస్తున్నాయి నీ తల్లో మళ్ళెల్లా


15) నా కన్నుల్లో నిండుతున్న నీ రూపం అపురూపమై
కనులు తెరవగానే కన్నీళ్ళుగా కారిపోతోంది ఎందుకో చెప్పవూ


16) అక్కడ నీవు నవ్వే చిరునవ్వు
ఇక్క నాకు కన్నీరై మిగిలిపోతుంది ఎందుకని..?


17) గతాన్ని నా పిడికిళ్లలొ దాచుకొని....
వర్తమానం నాది కావలని ఆశగా ఎదురు చూస్తున్నా..?


18) I am not a failure "My success has postpone "

19) నీ కనుపాపలు వెతికే రూపం.. నేను కాదని తెలిసిన మరుక్షణం
దిక్కు తోచని స్థితిలో నాకునేను అర్దంకాక శూన్యంలొ పయనిస్తున్నా....


20) రాలిన ఆకులల్లా కురుస్తున్ననీ జ్ఞాపకాలతొ....
ఊపిరి కరువైన నా హృదయన్ని నీ కాళ్ళదగ్గర వదిలేస్తున్నా నీ ఇష్టం


21) ఎడబాటుతొ కనుమరుగై పొతున్ననా అంతరంగపు అనుభూతిని....
నీర్లిప్తంగా సాగిపొయే నా గమ్యంలొ ప్రతిబింబించె నీ లాస్యాన్ని అస్వాదించ లేకపోతున్నా


22) ఎరుపెక్కిన కనుపాపలొ రక్తఛారని చెరిపేయడానికి
అంతరాలలొ నలిగిపొయే నీ జ్ఞాపకం నా మనస్సును చింద్రం చేస్తుంది


23) గతంలొ నివు పారేసిన మన తలపుల అనుభూతులు.
భవిష్యత్తు లొనైనా దొరుకుతాయని ఆశతొ వెతుకుతున్నాను


24) మదిలో కదులుతున్న అస్ధిత్వమైన అక్షరాలకు
ఏకాంతపు మనసు పొరలలో అల్లుకున్న సాలెగూడ్ల జ్ఞాపకాలు


25) చీకటి మాటున అజ్ఞాతములో
తిరుగుతున్నాయి నీ జ్ఞాపకాలు చూశావా..?


26) నిశ్శబ్దాన్ని చీకటి సంచీలో వేసుకున్నాను
వెలుగు నన్ను వెతుకుతొంది నను కాస్త వెతికి పెట్టవూ


27) భళ్ళని పగిలిన శబ్దానికి
ఉలిక్కిపడి చూస్తే అక్కడ నా మనసు ముక్కలై ఉంది


28) ఈ రాత్రి నాకు తెల్లారిందో నేనే తెల్లారానో
నాకర్దం కాని ప్రశ్న జవాబు దొరకాలంటే 12 గంటలు గడవాల్సిందే


29) చీకట్లో నిశ్శబ్దం నా అంతర్మధనానికి
విరహగీతంలా నా జ్ఞాపకాలను కదిలిస్తున్నాయి


30) ఈ నిశిరాత్రి జ్ఞాపకారణ్యంలో నన్ను నేను
వెతుక్కుంటున్నాను నాకు ఎక్కడన్న దొరుకుతానేమో అని


31) నా గతం నుండి నన్ను నేను పెకిలీంచినా
నిజాలు దొరకడంలేదు అన్నీ నీ జ్ఞాపకాలే నా ప్రతి గుండె అరలో


32) కాలం కాటుకు తలొగ్గి చీకటి మాటున అజ్ఞాతములో ఉన్నానిప్పుడు

33) నా గొంతులొ నరాలు పగిలే దాకా
పిలిచి పిలిచి అలిసిపోయా మరిప్పుడు ఏం చేయాలి


34) ఏదేమైనా నేను నాకు జ్ఞాపక మై నాకు నేను మాత్రం మిగిలానని తెల్సింది

35) నేనే తెల్లారానో ఈ రాత్రి నాకు తెల్లారిందో తెలీదు
నాకదే తెలియని ప్రశ్న ఎదురుపడి ఎక్కడ అవమానిస్తావో మరి
 
36) చీకట్లో నిశ్శబ్దం నా అంతర్మధనానికి
నేపధ్య గీతంలా విరహగీతాలు పాడుతోంది
 
37) బాగా అలిసిపోయాను ఏంచేయాలో అర్దంకాక
నా జ్ఞాపకారణ్యంలో నన్ను నేను వెతుక్కుంటున్నాను దొరుకుతానేమో అని
 
38) నా కన్ను రెప్పల వెనక నీళ్ళ పొరలా ఆవహించింది
ఆవేదనను ఆశను చెక్కిళ్ళపై జారిపోయే గతంలా మిగిల్చావెందుకో
 
39) మన మన్సులను అల్లుకున్న మనస్పర్ధల సాలె గూళ్ళల్లో
బరువెక్కిన గుండెలు ఎవరికి వారు ఒంటరిగా ఇలా వేలాడాల్సిందేనా
 
40) విధి విసిరిన వేగానికి రెక్కలిరిగిన ముక్కలైన
మనస్సుతో నా పక్కటెముకల పగుళ్ళకు కారణం ఎవరో చెప్పవూ
 
41) "Nobody perfect, because everyone has their different perception of perfection"
 
42) నీ చూపుల తాకిడి ఉప్పెనలా గుండెను తాకింది
వయ్యారాల వలపులు నాలో ఆశల్ని రేకెత్తించి లోయలో పడేస్తున్నాయి
 
43) అందంగా నవ్వుతూ గుండెలో మంట పెడుతూ
మాడిపోయే క్షణాన చిరుజల్లై కురిసే కన్నీరు గుండెకు ఊరట
 
44) వేడి నిట్టూర్పుల సెగలు చుట్టేస్తున్నాయి
నీ వలపు వానలో తడుస్తున్నా కలగా మిగిలిన జ్ఞాపకం అయినా
 
45) నీ చిరునవ్వు నుండి రాలిన పరిమళాల్లో
నేనొక కాలిపోతున్న గతాన్నై ..చివరకు జ్ఞాపకంగా మిగిలిపోయాను
 
46) వెళుతూ వెళుతూ పగలు రాత్రి చీకట్లు గుమ్మరించినట్లు
నువెళ్ళినప్పటి నుండి నా దేహం నిర్జీవంగా మారి సిధిలమైపోయింది మరి..?
 
47) రాత్రంతా నువు నా పక్కనున్నావనే భావాన్ని
మది నిండా పులుముకుని నిద్రపోవాలనే విఫల ప్రయత్నం చేస్తున్నా
 
48) అణగారి పోతున్న నా ఆశలకు జ్ఞాపకాల అజ్యిం పోస్తూ
నిశి రాత్రి లోని జాబిల్లి నీలి మబ్బుల మాటు నుండి తొంగి చూస్తుంది
 
49) నిన్ను చూడని ప్రతిక్షణం నాకో యుగం
ఆ బాధకు కారణమేంటో నీకు తెలుసా నీ ఎడబాటే మరి
 
50) నా హృదయాన్ని గాయపరచకు...నాకు విషాదాన్ని మిగల్చకు
అనుకొంటూ నాకు నేను నామనసుకు గాయం చేసుకుంటున్నా నెందుకో
 
51) మౌనంగా నీకోసం ఎదురు చూస్తున్నప్పుడు
వణికించే శబ్దంతో దూసుకొస్తోంది నా పైకి నీ జ్ఞాపకం
 
52) నేనిలా ఎప్పుడూ నీ కోసం పరితపిస్తూ పరుగులుతీస్తూ
నీవెప్పుడూ వస్తావాని నిర్లిప్తంగా నీకోసం చూస్తూన్న ఇడియట్ ని కదూ
 
53) నీ తలపులతో తపిస్తూ చూస్తున్నాను
రెప్ప పాటులో తలుపు తెరుచుకుని నీవొస్తావేమో అని
 
54) యముడు ఆడుతున్న చదరంగంలో
రాత్రులు పగళ్ళు నలుపు తెలుపులైతే..మనుషులే పావులేమో...?
 
55) తెచ్చిపెట్టుకున్న సమస్యల పరంపరలో
మనసంతా గాయాలతో నిరీక్షిస్తున్న క్షతగాత్రడిని
 
56) ఏకాంతంగా ఉన్ననాకు ఎదురుపడి తగిలించుకున్న గాయాన్ని
భరించలేకపోయాను ఆ నొప్పి ఒక జ్ఞాపకం మై నన్ను వేదిస్తూనే ఉంది
 
57) నా చూపులను చీకట్లో కలిపేస్తున్నా
అమె కళ్ళతో నన్ను లోతెంతో తెలియని ప్రశ్నలు సంధిస్తున్నాయి..?
 
58) ఏకాంతరంగాల్లో అలజడి తీవ్రమవుతుంది
మదిలో చెలరేగుతున్న తుఫాను లో కొట్టుకపోతున్నా..?
 
59) ఆకాశానికి దూరంగా ఉంటూనే నీరు ఆవిరై
ఆకాశం కడిలికి దూరంగా ఉంటూ వాన జల్లై నీపై వాలిపోతుంది
 
60) ఒకో క్షణం..ఒక్కో నిమిషం నీ జ్ఞాపకాలు
నన్ను ప్రశ్నిస్తాయి నా అసహాయతని నిలదీస్తాయి
 
61) ఎక్కదో మసక మసకగా వినిపిస్తున్ననవ్వులు
ఏదో తెలియని భావం కన్నుల్లో ముసురుకుంది గుండెను కమ్మేసింది
 
62) మౌనంగా ఉండలేని క్షణాలలో మాటల్లో మౌనాన్ని నింపే ప్రయత్నంలో
నీ జ్ఞాపకాలతో జారిపడ్డ కన్నీటి చుక్కలు అక్షరాలై రాలుతున్నాయి కాస్త చదవవూ
 
63) చిద్రమైన నా అందమైన జ్ఞాపకాల సాక్షిగా
ప్రతీ అనుభవానికీ నెత్తుటి మూల్యం చెల్లించుకొంటూనే ఉన్నా
 
64) ఒంటరితనం సర్రున నాగుండెల్లో కత్తిలా దిగబడి
నన్ను నేను పరిచయం చేసుకునేంతగా నన్ను ఏమార్చింది మరి
 
65) వెలితి లేని వెన్నెల జాబిల్లిని చూస్తున్నా ఆకాశంలో
జ్ఞాపకపు దుప్పటి కప్పుకొని చూస్తే గుండె పై రక్తపు మరకలే నీజ్ఞాపకాలు
 
66) ఆలోచనలు నిద్రిస్తున్న వేళ ఒక వెలితి పలకరించింది
కలలను ఖాళీ చేసిన జ్ఞాపకం పై అలిగిన మౌనం అగ్గిలా రాసుకుంది
 
67) నా గుండెల్లో గుచ్చిమరీ అక్షరాల కోసం తడుముకున్నాను
రక్తం తో తడిసిన అక్షరాలను అన్నిటిని వేళ్లతో పట్టుకుని బయటికి తీసాను
 
68) నీకోసం కలల విశ్వమంతా చుట్టి వస్తున్నా
చేజారిన ఎన్నో క్షనాలు నీ జ్ఞాపకాల్లొ చిక్కుకొని పోయాయి
 
69) ఆకొసచిరకోసం మళ్ళి పయనం మొదలు పెట్టా
నీమీద కోపంతో కాదు నామీదనాకు చిరాకుతో వెనక్కు మళ్ళీ రాకూడదని
 
70) దొంతర దొంతరలుగా జ్ణాపకాలు ఒకదానితో ఒకతి పోటీ పడుతూ...
నా తరువాతే నువ్వంటూ ఒక దానిలో ఒకటి మిళితమవుతూ వాటికవే కలబడుతూ
 
71) నాతో ఉన్న నీవు ఇప్పుడు లేవన్న ఊహ
ఈ ఊహ కన్నా ఊపిరాగిపోయినా బాగుండు అనిపిస్తుంది
 
72) మనదైన మరువలేని ఏకాంతం లో
నీ చుట్టూ నేను రాలేని నిలువెత్తైన అవమానపు అడ్డు గోడలు
 
73) ఒక నిజం తగాలబడుతుంటే నడిరాతిరి మొదలైన కన్నీటి జల్లు
తెలవారే దాకా.... కురుస్తూనే ఉంది ఇప్పుడవిలేవు సాక్ష్యాలుగా ఏర్పడ్డ చారికలు తప్ప
 
74) ఈ చేదునిజమేంటి స్వప్నమై నిలిచింది.
నా శ్వాస నా గుండె లయ శబ్దం మారిదెందుకనో..?
 
75) అంత ఓర్చలేని కష్టంలోనూ నా కవితను అక్షరాలుగా చుట్టుకుని
తనివితీరా ప్రతి అక్షరాన్ని నా చూపులతో తడిమి తుడిచిన క్షణం ఎందుకు ఏడ్చానో
 
76) రెండు గుండెల ఏకాంతాల మద్యి నలిగిన నా జ్ఞాపకం
అన్ని నిజాలకు తలొంచి మౌనంమద్యి ముక్కలైపోతోందిలే..?
 
77) కాలమంతా గడిచిపోయినా తిరిగిరాని క్షణాలు
అంతమెపుడో తెలియని నా ఈ నిరీక్షణలు నలిగి మిగిలిపోయాయి
 
78) నాలో నేను ఎంత తవ్వుకున్నా
నీవే కనిపిస్తున్నావెందుకని నాలు నేను లేనా...?
 
79) గంపెడాశలతో కన్నా ఏం చేయలేక
గుప్పెడు ఆమె జ్ఞాపకాలతో బ్రతుకునీడుస్తున్నా
 
80) మిణుకు మిణుకుమంటోన్న జ్ఞాపకాల చుక్కల మధ్య
నిశ్శబ్దంగా ఎగురుతున్న ఆలోచనల దోమలు కుట్టి రక్తం చిందేలా చేస్తున్నాయి
 
81) గదిలో ..ఒంటరిగా చిమ్మచీకట్లో నేను అమె జ్ఞాపకాలు
 
82) మడతలు మడతలుగా పేరుకొంటూన్న అనుభూతి దొంతరలు
చిలికే కొద్దీ చిక్కబడుతున్న కవిత్వం విరహగీతాలే పాడుతున్నయేంటో మరి
 
83) నులి వెచ్చని కౌగిళ్ళతో అధరామృతాలతో నిన్ను గుర్తుచేస్తూ
ఓ క్రొత్త ప్రపంచం కనిపిస్తున్నా ఎవరో నన్ను దారుణంగా చంపేస్తున్నారు
 
84) హృదయాన్ని మెలిపెట్టే బాధలో నిన్ను నాకు చూపిస్తున్నా
నీ జ్ఞాపకాలు నన్ను కాదన్నా కల్లెఎదురుగా కనిపిస్తున్న అవమానాలు చంపేస్తున్నాయి
 
85) విషాదానుభవాల మధ్య ఒంటరినై పిచ్చాడిలా తిరుగుతున్న
నాకు నేను ప్రశ్ననైనప్పుడు జవాబులా నువ్వొచ్చావు నను ఎవరని ప్రస్నిస్తున్నావు ..?
 
86) జ్ఞాపకం పొరలు చీల్చుకొని వస్తున్న
నిజాలకు మసిపూయడంలోనే నీ జీవితం గడచిపోతుంది
 
87) నిరాశకి నిశ్శబ్దపు ఓదార్పవ్వడం
బాధల అగాధాల్ని తవ్వుకుంటూ పోతూనే ఉన్నా..?
 
88) నాపిచ్చిగానీ అక్షరాల్లో నిన్నుబంధించాలనుకోవడం
ఆకాశాన్ని అందుకోవాలనుకోవడం నిజంగా ఎలా సాద్యం చెప్పు
 
89) నామనసు ప్రతిబింబంలో నీవు వేయి సార్లు జవున్మిస్తావు
నను కాదని నీ చూపు మరిలిన అనుక్షణం నేను లక్షసార్లు మరణిస్తూనే ఉన్నాను
 
90) పగిలిన గుండెను ఓదార్చే నేస్తమా...
నాకోసం చూసిన ఎదురుచూపులను తిరిగి నా కివ్వవా