ఒక్కొసారి కొన్ని జ్ఞాపకాలు
నన్ను ప్రశ్నిస్తాయి
నా అసహాయతని నిలదీస్తాయి
ఈప్రపంచంలో నేనేమిటి అంటూ
నా అంతరంగాన్ని ఆరాతీస్తాయి
కొన్ని జ్ఞాపకాలు
నేనేంటో తెలియని నన్ను
నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తాయి
గుండెలోని ప్రతి అరలో
ఒరుసుకుపోతున్న
జ్ఞాపకాల రాపిడికి
గాయాలు అవుతూనే ఉన్నాయి
కారనాలు వందలున్నా
వద్దనలేని వాస్తవాలు
ఒంటర్ని చేసి వేదిస్తూనే ఉన్నాయి
నివురుగప్పిన నిజం
కానరాకుండా
కాల్చేస్తూనే ఉంది
నిజాలను నమ్మలేక
అబద్దాలేమో అని
సర్దిచెప్పుకోలేక
తడబడుతూ ..
తపనపడుతూ ఎన్నాళ్ళొ ఇలా
నన్ను ప్రశ్నిస్తాయి
నా అసహాయతని నిలదీస్తాయి
ఈప్రపంచంలో నేనేమిటి అంటూ
నా అంతరంగాన్ని ఆరాతీస్తాయి
కొన్ని జ్ఞాపకాలు
నేనేంటో తెలియని నన్ను
నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తాయి
గుండెలోని ప్రతి అరలో
ఒరుసుకుపోతున్న
జ్ఞాపకాల రాపిడికి
గాయాలు అవుతూనే ఉన్నాయి
కారనాలు వందలున్నా
వద్దనలేని వాస్తవాలు
ఒంటర్ని చేసి వేదిస్తూనే ఉన్నాయి
నివురుగప్పిన నిజం
కానరాకుండా
కాల్చేస్తూనే ఉంది
నిజాలను నమ్మలేక
అబద్దాలేమో అని
సర్దిచెప్పుకోలేక
తడబడుతూ ..
తపనపడుతూ ఎన్నాళ్ళొ ఇలా