Saturday, November 30, 2013
స్వాతి 24 గంటల న్యూస్ చానల్ డిసెంబర్లో మీముందుకు వచ్చేందుకు సిద్దం అయింది.
Tuesday, November 26, 2013
Monday, November 25, 2013
నా నీడే నన్ను వెక్కిరిస్తే? ( Real story )
మీరు తెలివైన ఆశా జీవులా? అయితే ప్రేమకు బద్ధశత్రువులు...ఆ మనిషిమీద నమ్మకం
మిమ్మల్ని ఓ వ్యక్తికి దగ్గర చేసిందా? అయితే మీది ప్రేమ కానేకాదు... నమ్మకం అనే గుమ్మం దాటారా? అయితే మీ ప్రేమకు మీరే పెద్ద ప్రమాదం! అదంతా మోసం నిజమని నమ్మితే మిగిలేది దుక్కమే ..?
ఫ్రెండ్స్.. పైన చెప్పినవి సుత్తికాదు. పరిచయం ప్రేమగా మారి, వైఫల్యం కత్తిలా గాయం చేస్తే నెత్తుటి మరకలతో బయటపడ్డ అభాగ్య ప్రేమికుడిని. అనుభవంతో చెబుతున్న మాటలివి.అందరిలా నేనూ చదువుకున్నా. ఉద్యోగం చేస్తున్నా. రోజులు రోజుల్లాగే గడిచేవి. ఆమె రాక నా జీవిత గడియారంలో గంటల ముల్లుని సెకన్ల ముల్లులా మార్చేసింది. అయినా నేను కలలు కనలేదు. వూహా లోకంలో విహరించనూ లేదు. ఎందుకంటే అప్పటికి నేను కవిని కాదు. కల్మషం లేని మనిషినంతే! ప్రేమంటే తెలియదు. ప్రేమని వెతికే ప్రయత్నమూ చేయలేదు. అందుకేనేమో గుడ్డిగా ప్రేమలో పడ్డా. నేను పడ్డాడని తెలిసి కొందరు మిత్రులు పడి'పోతున్నావ్' అని చేయందించారు. నేను తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికీ నేను తెలివైన ఆశాజీవిని కాదు.
నెలల సమయంలో తనే నా శ్వాస అయ్యింది. తను వదిలే ఉచ్ఛ్వాసం కోసం వేచివేచి కొన్నిసార్లు వూపిరాడేది కాదు. తను ముందుండి దారి చూపేది. నేను వెనకే వెళ్తూ అనుచరుడిగా మారేవాణ్ని. తన మాటలకు తలాడించే పక్క వాయిద్యకారుడిగా మిగిలేవాణ్ని. కానీ ఆ మాటల్లో నేనున్నానో లేదో గమనించలేదు. ఎందుకంటే ఆ అవసరం నాకు రాలేదు. ప్రేమించానంతే. నమ్మానంతే!
ఇప్పుడు తను నా ముందు లేదు, నేను తన వెనకాల లేను. ఆ మాటకొస్తే తను నా దరిదాపుల్లోకే రావడం లేదు. నన్నంతా 'నువ్వు మోసపోయావ్' అంటున్నారు. అది వింటుంటే నవ్వొస్తోంది. తన అందం చూసి ప్రేమించలేదు. ప్రేమించడానికి తనే ఓ కారణం అని నమ్మి ప్రేమించాను. ఆశించడం తెలియని నమ్మకాన్ని ఎవరు మోసం చేయగలరు చెప్పండి! అది అసాధ్యం కూడా. అందుకు ఉదాహరణ అమ్మ ప్రేమే. తనే అమ్మ అనుకున్నాను. కానీ నన్ను బొమ్మలా ఆడిచింది. నేను కలిసి బతకాలని కలలు కంటుంటే తను విడిపోవడానికి కారణాలు వెతికింది. నా చిన్ని ప్రపంచాన్ని ఆమె ముందుంచితే అరక్షణం ఆలోచించకుండా అల్లుకుపోయింది. అందమైన ప్రపంచం సొంతం కాబోతుందని మురిసిపోయా. కానీ నాదైన లోకానికి నేనో జాలి చూపించే జోకర్‌లా మారతానని అస్సలు వూహించలేదు. ఒకప్పుడు నావాళ్ల సందేహాలకు నేను సమాధానాణ్ని. ఇప్పుడు నేనే ఒక జవాబు లేని ప్రశ్నని.
చివరగా ఒక్కమాట. తెలివైన ప్రేమికులారా.. మీ నమ్మకాలు, భ్రమలు శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు అవి మంచు పరదాల్లా తొలగిపోతాయి. అప్పుడు మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించిన మనుషులుండరు. మీ నీడతో సహా అన్నీ మిమ్మల్ని చూసి నవ్వుతాయి. ఆ నవ్వుకి మీ సమాధానం అసహాయంగా మీ మొహంపై కదలాడే ఓ నిర్జీవమైన నవ్వు. అందుకే జాగ్రత్తగా ఉండండి. జతను ఎంచుకోవడంలో జాగరూకత వహించండి.
నా వ్యధ మీ మనసుకి హత్తుకునేలా చెప్పకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నేను త్యాగాలు చేసి ఓడిన ప్రేమికుడిని కాదు. కాలం కాటుకి బలైన ప్రియుడ్నీ కాదు. ఓ తెలివైన అమ్మాయి మోజులో నా 29 ఏళ్ల వ్యక్తిత్వాన్ని, ఆశల్ని, కలల్ని, కోరికల్ని బలిపెట్టిన బలహీనుడిని. నా నీడకు జాడ కూడా కరువైన నిశిరాత్రిలో ఒంటరిని. పేరు చెప్పుకోలేని నా ప్రియమైన ప్రేమకి శత్రువుని.
కేశవ రెడ్డి గారి "చివరి గుడిసె "
కేశవ రెడ్డి గారి "చివరి గుడిసె "..............
జంతువుల్ని వేటాడి తింటూ బ్రతుకుతారు వాళ్ళు . ఆస్తి పాస్తుల మాట అటుంచి భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకోవడం కూడా తెలియదు వాళ్ళకి . కొండల్ని పిండి చేసే శారీరక బలం ఉన్నా ,దాని సాయంతో తమకి జరిగే అన్యాయాన్ని ఎదుర్కోవాలనే ఆలోచన కూడా లేకుండా బాధల్ని అమాయకంగా ఆహ్వానించే ఓ అట్టడుగు వర్గం వాళ్ళు యానాది వాళ్ళు ( నాకు ఆర్ధమైనంత వరకు ) .
వాళ్ళ వర్గీయులంతా ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి (మణియం ) చేతిలో మోసపోయి గ్రామం వదిలిపోతే మిగిలిపోయిన ఒకే ఒక్క కుటుంబం మన్నుగాడిది . ఆ పేటలో అతనిదే మిగిలి ఉన్నచిట్ట చివరి గుడిసె . అతని జీవితం, ఆ గుడిసె కూడా ఆఖరికి ఎలా అంతమై పోయాయి అన్నది కథాంశం .
అసలు అది కథ కాదు జీవితం . అవి అక్షరాలు కాదు సజీవంగా తిరుగాడే ఆత్మలు . అవి అసలు రాతలు కాదు .మనసు కళ్ళతో చూడగలిగే అద్భుతమైన భావ చిత్రాలు.
అందులో విషాదం పరుచుకుని ఉంటుంది . పేజీల్లోని స్థలం సరిపోక మన మనసుల్లోకి కూడా చేరిపోయి కళ్ళలోకి ప్రవహిస్తూ ఉంటుంది . అక్కడ కాసేపు మనం మన అస్తిత్వాన్నికోల్పోతాం. ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి వాళ్ళ లాగే ఆలోచిస్తాం . వాళ్ళు నవ్వితే నవ్వుతాం . ఏడిస్తే ఏడుస్తాం . చిందులేస్తే చిందులేస్తాం . కర్కశమైన విధి రాతలకి, సాటి మనుషుల చేతలకి బలవుతున్న ఆ బడుగు ప్రాణులపై విపరీతమైన జాలి పొంగుకొస్తున్నా , మనసుని మెలి తిప్పేటంత భాధ గా అనిపిస్తోన్నా కథ కి ముగింపు మాత్రం మరోలా కోరుకోము . అది అలాగే జరిగి ఉంటుంది అనుకుంటాం. చెయ్యని దొంగతనం నేరాన్ని మోపి మణియం, మన్నుగాడిని కొట్టి కొట్టి చంపేస్తాడు . పిరికివాడు అయిన మన్నుగాడి కొడుకు చిన్నోడు భయంతో ఉరి వేసుకుని మరణిస్తాడు. చివరికి వాళ్ళ పెంపుడు కుక్క రాజీ కూడా బెంగతో రోగాల పాలై ఊరి వాళ్ళ చేత కొట్టి చంపబడుతుంది
మామూలు పరిస్థితుల్లో ఇబ్బందికరంగా అనిపించే కొన్ని విషయాలు కూడా ఇక్కడ మనకి చాలా సహజంగా అనిపిస్తాయి . ఉదాహరణకి మన్నుగాడు రాత్రంతా చేలో ఎలుకల్ని పట్టి , అవి తమ కలుగుల్లో దాచుకున్న వరికంకుల్తో అన్నం వండుకుని, అ ఎలుకల కూరతో పాటుగా తింటూ , కావలివాడు ఇచ్చిన కల్లుని పట్టిస్తూ ,నోటికొచ్చిన పాటల్ని పాడుకుంటూ చిందులేస్తుంటే మనం నిజంగానే ఎంతో ముచ్చట పడతాం . అక్కడ వాడు చేస్తున్న పని ఏమిటి,ఎటువంటిది అని మనం లేశ మాత్రం కూడా ఆలోచించం . అ పని చేస్తూ వాడు పొందే ఆనందాన్ని మాత్రమే మనం కూడా పరిపూర్ణంగా అనుభవిస్తాం .
పాత్ర కొద్దీ పదార్ధం అన్నట్టు, మనిషి కి ఉన్న పరిజ్ఞానం కొద్దీ వాళ్ళ ఆశలు కలలూ ఉంటాయి . మన్నుగాడికి అమాయకుడైన తన కొడుకు చిన్నోడు , పొలం దున్నడం,ధాన్యం పండించడం , పెళ్లి చేసుకుని పూరింట్లో ( గుడిసె కాదు) కాపురముండటం అనేవి అత్యద్భుతమైన కలలు . ఆ కలల గురించి కావలి వాడితో చెప్పి మళ్ళీ దిష్టి తగులుతుందేమో అని కలవర పడతాడు. ఆ పేద మనసు కనే కలల్లో మనకి ఎంతో కళాత్మకత కనిపిస్తుంది .
కథ లోని ముఖ్యమైన మూడో పాత్ర బైరాగిది . ఆ బైరాగి జీవిత సత్యాన్ని ఒక పాట రూపం లో చెప్తాడు ఆత్మని చేనుతో పోలుస్తాడు
భార్యా పిల్లల్ని ఆ చేను మీద వాలి గింజలు కొల్లగొట్టే పిచుకలతోనూ, చిలుకల తోనూ పోలుస్తాడు . అలాగే కామ క్రోధాలని నాశనం చేసే ఎలుకలు, ఏదు పందులతోనూ,మోహాన్నీ , భ్రాంతి నీ చేమ కమ్మే పొగమంచు తోనూ , సిరి సంపదలను కొరికి పాడు చేసే కీటకాలతోనూ పోలిక చెబుతాడు
తన ఆత్మ సంపదని కేవలం భగవంతునికే సమర్పించాలనే కోరికని వెలిబుచ్చే ఆ పాట ఎంతో వేదాంత ధోరణిలో ఉంటుంది .ఆ విధంగా భవ బంధాల్ని తెంచుకుని , రాగ ద్వేషాలకి అతీతంగా బ్రతికే ఆ బైరాగి , ఒకే ఒక్క రోజు పరిచయంతో మన్నుగాడితో అనుబంధం పెంచుకుని, అతనికి జరిగిన అన్యాయాన్ని చూసి తట్టుకోలేక మణియం మీదకి మన్నుగాడి పెంపుడు కుక్కని ఉసిగొల్పి చంపిస్తాడు.
చివరికి మణియం దురాగతాలకి బలై పోయిన మన్నుగాడు , చిన్నోడి లాగే వారి చిన్ని చివరి గుడిసె కూడా గబ్బిలాలకీ పాములకీ నిలయంగా మారి , గాలివానకి చిన్నాభిన్నమై, మిగిలిఉన్న వెదురు బొంగులు సైతం దురాశ గల మనుషుల చేత తస్కరింపబడి కేశవరెడ్డి గారి భాషలో తమై(హతమై),అంతమై పోతుంది.
నిజంగా మనసుని కదిలించి కలచివేసే కథ. చివరి పేజీ వరకు విడవకుండా చదివించే అరుదైన అత్యంత విషాదభరితమైన రచన
- భవాని

Sunday, November 24, 2013
ఒంటరి జ్ఞాపకాలు వేదిస్తున్నాయి
ఒక్కొసారి కొన్ని జ్ఞాపకాలు
నన్ను ప్రశ్నిస్తాయి
నా అసహాయతని నిలదీస్తాయి
ఈప్రపంచంలో నేనేమిటి అంటూ
నా అంతరంగాన్ని ఆరాతీస్తాయి
కొన్ని జ్ఞాపకాలు
నేనేంటో తెలియని నన్ను
నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తాయి
గుండెలోని ప్రతి అరలో
ఒరుసుకుపోతున్న
జ్ఞాపకాల రాపిడికి
గాయాలు అవుతూనే ఉన్నాయి
కారనాలు వందలున్నా
వద్దనలేని వాస్తవాలు
ఒంటర్ని చేసి వేదిస్తూనే ఉన్నాయి
నివురుగప్పిన నిజం
కానరాకుండా
కాల్చేస్తూనే ఉంది
నిజాలను నమ్మలేక
అబద్దాలేమో అని
సర్దిచెప్పుకోలేక
తడబడుతూ ..
తపనపడుతూ ఎన్నాళ్ళొ ఇలా
నన్ను ప్రశ్నిస్తాయి
నా అసహాయతని నిలదీస్తాయి
ఈప్రపంచంలో నేనేమిటి అంటూ
నా అంతరంగాన్ని ఆరాతీస్తాయి
కొన్ని జ్ఞాపకాలు
నేనేంటో తెలియని నన్ను
నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తాయి
గుండెలోని ప్రతి అరలో
ఒరుసుకుపోతున్న
జ్ఞాపకాల రాపిడికి
గాయాలు అవుతూనే ఉన్నాయి
కారనాలు వందలున్నా
వద్దనలేని వాస్తవాలు
ఒంటర్ని చేసి వేదిస్తూనే ఉన్నాయి
నివురుగప్పిన నిజం
కానరాకుండా
కాల్చేస్తూనే ఉంది
నిజాలను నమ్మలేక
అబద్దాలేమో అని
సర్దిచెప్పుకోలేక
తడబడుతూ ..
తపనపడుతూ ఎన్నాళ్ళొ ఇలా
Friday, November 22, 2013
నన్ను నాకు ప్రాణాలతో ఇవ్వవా ప్లీజ్
చీకటి రాత్రి నీఆలోచనలతో
స్వేదబిందువులు
రక్తపు వర్నంగా
మారుతున్నాయి
రక్త చరిత్రలు రాస్తున్నాను
నాకోసం నేను
అక్షరాలతో కాదు
హాహాకారాలతో,
శ్వాసించలేని
మనిషినైనా ఇప్పుడు
నన్ను నాకు ప్రాణాలతో
ఇవ్వవా ప్లీజ్
ఎందుకిలా నాప్రాణాలు
తోడేస్తువో తెలీదు
ఇదీ అని అడగలేని నిస్సహాయత..
నేనేంటొ తెలియని స్థితి..
శిలగా మారానెప్పుడో
నన్ను నేనుగా మర్చిపోకముందే
ఏ మలుపు మొదట్లోనో
వదిలేసిన ఆశయాల్ని
మరో మజిలీగా
మొదలుపెడుతున్నా.
ఏదొక మజిలీలో నీవు
కనిపిస్తావేమోఅని వెర్రి ఆశ
నే వెళుతున్నా ఆదారిలో
నీవుంటావు కాని
నన్ను చూసి కూడా
ఎవరొ తెలియనట్టు
ఎప్పుడూ చూడనట్టు
నీ చుట్టు చేరిన
ఈగల్లాంటి వాళ్ళ కోసం
కావాలని నన్ను దూరం చేశావు
నీకిది న్యాయమా అంటూ
నిన్ను ఏదో అడగాలనుకుంటా
కానీ ఏమీ అడుగలేను
అడిగే సమయం నాకివ్వవు
"ఒయ్" నేనెవరో నీకు తెలీదు కదూ
అయినా తెల్సుకోవాల్సిన అవసరం
గుర్తుంచుకోవాల్సిన సమయం నీకెక్కడిది లే కదా
ఎందుకో ఒకప్పుడు ఎక్కడ నీవు
కనిపిస్తావోఅని ఆశగా ఎదురు చూసేవాడిని
కాని ఇప్పుడు ఎక్కడ కనిపిస్తావో ..
ఎవరితో కనిపిస్తావో ...కనిపించి
నా మనస్సుపై ఎదురు దాడి చేస్తావో
అని భయపడుతున్నా..
నేను ఎవ్వరో జాలిపడతారనో
భాదపడటంలేదు
ఎవరో జాలి చూపాలని
బాదపడటంలేదు
నటించడంలేదు ..
నిజం తెల్సుకో
అర్దం చేసుకోకపోయినా పర్లేదు..
అపార్దం చేసుకోకు నీఇష్టం నీది కాదనను

Wednesday, November 20, 2013
నాలో నేను ,..నాకు నేను అనుభవిస్తున్న భాద ( ఎవరికి చెప్పుకోలేక )
ఇప్పుడేదో అంతా
మాయగా ఉంది
నా చుట్టూ
ఎడారి పరుచుకున్నట్లు
నా పాదాలు ఎర్రని ఎండలో
కూరుకుపోతున్నట్లు
అరచేతులలో రంగుమారి
రక్తవర్నమైపోతున్నట్టు
చెమటలు పడుతున్నా దేహంలో
వేడి ఆవిర్లు చిమ్ముతున్నాయి
ఎక్కడ తాకినా
ఏదో రబ్బరు తొడుగు
దేహమంతా
కప్పబడినట్లు
స్పర్శ కోల్పోయినతనం..
ఎవరో నాచర్మాన్ని
చీలుస్తున్నట్టు
తట్టుకోలేని భాద
గుండేలొంచి తన్నుకొస్తుంది
అంతా రంగు రుచి
లేని ఓ విషమేదో
కషాయంలా గొంతులో
మండె అగ్నిగోళాలై జారి
ఏదో విషం గొంతులోకి బలవంతంగా
దిగుతున్నట్టు తట్టుకోలేని
బాధ తెలియని చెప్పుకోలేని వేదన
ఒంటరితనంవైపు పరుగులు
పెడుతున్న ఏకాంతం
నీషారాత్రి చిమ్మచీకట్లో లీలగా
వినిపిస్తున్న విషాదగీతాలు
గుండెను కెలికేస్తున్నాయి ఘోరంగా
నన్నేవరో ఊపిరాడకుండా
గొంతు నులిపేస్తున్నారు
లీలగా చూస్తే అక్కడ
నీవే కనిపిస్తున్నావేంటో..నీవే కదూ
చుట్టూరా కమ్ముకున్న
చిమ్మచీకటి రాత్రుల్లలో
ఈ సమ్మె వాతావరణంలాంటి నిశ్శబ్దంలో
గుండే చప్పుడే బయంకరంగా వినిపిస్తోంది
నాలుక పిడచకట్టి గొంతెండిన
వేసవితనం వెంటాడుతోంది…
నాకేదో జరుగుతోంది నన్నేదో చేసేస్తున్నారు

మాకూ కలలున్నాయి (మగాళ్ళ దినోత్సవం సందర్బంగా )
మీకొక్కరికేనా
మనసున్నది ..?
మేమూ మీతో పాటే
పెరిగాం..మీ దేహాలను చూసి
మీ కాటేసే వాలు చూపుల్లోంచి
బయటపడి ..మళ్ళీ బతుకు దారుల్లో
సంచిరిస్తూనే వున్నాం
ఏళ్ళకు ఏళ్ళు గడిచి పోయినవి
కానీ జ్ఞాపకాలు మాత్రం
ఇంకా ఆరి పోకుండా
హృదయాన్ని కాపలా కాస్తున్నాయి ..!!
దిగంతాలకు ఏగినా
దేశాలు దాటి
ప్రయాణం చేసినా
మీ తలపుల్లోనే కదా
మేం తడిసి ముద్దై పోయింది
అవును ..మీ అందాల మకరందం కోసం
మీ వంపు సొంపుల్లో
ఆనందం నింపే ఒడిలో
వాలి పోయేందుకే కదూ
మేం ఇంకా బతికే వున్నది ..?
మీతో పాటే మేం
ఎన్ని రాత్రుల్లో నిదుర లేకుండా
గడిపామో ..తలచుకుంటే
కళ్ళు సముద్రాలవుతాయి
ఆశలు కాలువలై పారుతాయి
కాలపు ప్రవాహంలో
మేం ఆకలి కేకల్లో
అలరారిపోతున్నా
మీరంతా బాగుండాలనే కదా
ఇంకా ఇంకా
శ్రమిస్తూనే వున్నాం
విరామం ఎరుగక
రాలి పోతూనే వున్నాం ..!!
దేహాలు ఒకరి కోసం
మరొకరం కొట్టుకు చస్తున్నప్పుడు
మేం మేముగా
ఎలా ఉండగలం ..?
అవును ..మాకూ కలలున్నవి
అవి తీరకుండానే
తనువులు చాలించిన రోజులు ఎన్నో
మీకు వీడు ... వీడు కాకపోతే మరోకడు
ఎవరో ఒకరు మీకు కావాలి ఆసరాగా
నిన్నే నమ్ముకున్న మాకు మాత్రం
మీ జ్ఞాపకాలే ఆశరా...
మీరు ఓరగా చూస్తే పడని మగాడెవ్వరు
ఊరించి ఉడికించి మాయచేయడం
మీకు సరదా "గేం"
ఆ "గేం" లో మేమంతా పావులం
ఆడుకుంటారు మాతో
మీ వయ్యారాల సుడి గుండాల్లో
మీ లేలేత పెదవుల తలపుల్లో
బతుకులు పారేసుకున్న మగాల్లెందరో ..?
మేమూ మనుషులమే
అన్నీ కోల్పోయి
కుటుంబం కోసం
సభ్య సమాజం కోసం
నిత్యం కోల్పోతూనే వున్నాం
స్వేచ్ఛను ..ఆత్మను ..గౌరవాన్ని
అన్నిటినీ కొవ్వొత్తుల్లా
వెలుగులు పంచుతూనే
మాడిపోతున్నాం..చిరునామా
లేకుండానే నిష్క్రమిస్తున్నం..!!
అవసరమై నప్పుడు
మేం మీకో చేతికర్ర
అన్నీ తీరాక ..రాలిన పువ్వులం
మీ కోసం వేచి వేచి
గుర్తింపునకు నోచుకోని
మానవ మాత్రులం ..మగాళ్ళం
గుప్పెడు గుండెను
ఆడిస్తున్నది ఎవ్వరు
మీరే కదా ..ఇప్పటికైనా
మమ్మల్ని మనుషులుగా
చూస్తే చాలు ..!!
మనసున్నది ..?
మేమూ మీతో పాటే
పెరిగాం..మీ దేహాలను చూసి
మీ కాటేసే వాలు చూపుల్లోంచి
బయటపడి ..మళ్ళీ బతుకు దారుల్లో
సంచిరిస్తూనే వున్నాం
ఏళ్ళకు ఏళ్ళు గడిచి పోయినవి
కానీ జ్ఞాపకాలు మాత్రం
ఇంకా ఆరి పోకుండా
హృదయాన్ని కాపలా కాస్తున్నాయి ..!!
దిగంతాలకు ఏగినా
దేశాలు దాటి
ప్రయాణం చేసినా
మీ తలపుల్లోనే కదా
మేం తడిసి ముద్దై పోయింది
అవును ..మీ అందాల మకరందం కోసం
మీ వంపు సొంపుల్లో
ఆనందం నింపే ఒడిలో
వాలి పోయేందుకే కదూ
మేం ఇంకా బతికే వున్నది ..?
మీతో పాటే మేం
ఎన్ని రాత్రుల్లో నిదుర లేకుండా
గడిపామో ..తలచుకుంటే
కళ్ళు సముద్రాలవుతాయి
ఆశలు కాలువలై పారుతాయి
కాలపు ప్రవాహంలో
మేం ఆకలి కేకల్లో
అలరారిపోతున్నా
మీరంతా బాగుండాలనే కదా
ఇంకా ఇంకా
శ్రమిస్తూనే వున్నాం
విరామం ఎరుగక
రాలి పోతూనే వున్నాం ..!!
దేహాలు ఒకరి కోసం
మరొకరం కొట్టుకు చస్తున్నప్పుడు
మేం మేముగా
ఎలా ఉండగలం ..?
అవును ..మాకూ కలలున్నవి
అవి తీరకుండానే
తనువులు చాలించిన రోజులు ఎన్నో
మీకు వీడు ... వీడు కాకపోతే మరోకడు
ఎవరో ఒకరు మీకు కావాలి ఆసరాగా
నిన్నే నమ్ముకున్న మాకు మాత్రం
మీ జ్ఞాపకాలే ఆశరా...
మీరు ఓరగా చూస్తే పడని మగాడెవ్వరు
ఊరించి ఉడికించి మాయచేయడం
మీకు సరదా "గేం"
ఆ "గేం" లో మేమంతా పావులం
ఆడుకుంటారు మాతో
మీ వయ్యారాల సుడి గుండాల్లో
మీ లేలేత పెదవుల తలపుల్లో
బతుకులు పారేసుకున్న మగాల్లెందరో ..?
మేమూ మనుషులమే
అన్నీ కోల్పోయి
కుటుంబం కోసం
సభ్య సమాజం కోసం
నిత్యం కోల్పోతూనే వున్నాం
స్వేచ్ఛను ..ఆత్మను ..గౌరవాన్ని
అన్నిటినీ కొవ్వొత్తుల్లా
వెలుగులు పంచుతూనే
మాడిపోతున్నాం..చిరునామా
లేకుండానే నిష్క్రమిస్తున్నం..!!
అవసరమై నప్పుడు
మేం మీకో చేతికర్ర
అన్నీ తీరాక ..రాలిన పువ్వులం
మీ కోసం వేచి వేచి
గుర్తింపునకు నోచుకోని
మానవ మాత్రులం ..మగాళ్ళం
గుప్పెడు గుండెను
ఆడిస్తున్నది ఎవ్వరు
మీరే కదా ..ఇప్పటికైనా
మమ్మల్ని మనుషులుగా
చూస్తే చాలు ..!!
Monday, November 18, 2013
చలం - అమీనా పై ( మధుమాసం బ్లాగర్ అభిప్రాయం )
చలం రచనలెటువంటివైనా, వాటిలోని తీవ్రతను మాత్రం అందరూ ఒప్పుకునే తీరాలి.
అతని భావాలను, బాధలను, గుండెల్లోని అలజడినీ, ఆ మర్యాదపు ముసుగుల్లో మనిషి
పడే సంఘర్షణనీ, చలాన్ని చదివే వాళ్ళు తప్పించుకుందామనుకుంటే, సాధ్యపడదు.
లాగేస్తాడు..లోపల్లోపలికి... అతని అక్షరాల్లోకి.
ఆహ్వానిస్తాడు..చేతులు విశాలంగా చాచి అతని అంతరంగపు లోతుల్లోకి. ఒక తొంభైఆరు పేజీల నవల, తొంభై నిముషాల లోపే పూర్తి చేసెయ్యడానికి అనువుగా
ఉండే నవల, మనకి మునుపెన్నడూ పరిచయం లేని ఒక ముసల్‌మాన్ బాలిక పట్ల ఎంత
అనురాగాన్ని, జాలినీ, ఆత్మీయ అనుబంధాన్ని పెంచగలదో తెలుసుకోవాలంటే "అమీనా"
చదవాలి. అమీనా ప్రారంభమే ఒక అద్భుతం. "ముందుమాట" నుండే మనం చదవడం
మొదలెట్టాలి. రచనను అనుభవించడాన్ని, ఇక్కడి నుండే అలవాటు చేసుకోవాలి.
"ఏళ్ళల్లో ఒదిగి
వాకిట్లో నుంచుని, ఒచ్చానంటే,
చిన్నప్పటి నీ ఒంటి బురదని
కావలించుకున్నా,
పెద్దైన నీ మనసు మీద
లోకం చిమ్మిన మాలిన్యాన్ని అంగీకరించలేని
చలం
అవమానానికీ
లోకపరత్వానికీ
పరిహారంగా
నీకు, అమీనా ఈ పుస్తకం."
అమీనా చదవడంతో చాలా చిక్కులున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా
చెప్పుకోవలసింది, ఏ పాత్ర గురించి ఏ విధమైన వివరణా లేకపోవడం. యండమూరి,
సూర్యదేవర, యద్ధనపూడి తదితరుల నవలలన్నీ చదివే అలవాటు ఉన్న నాలాంటి వాళ్ళకి,
నవలలో పాత్రలంటే - వాటి పరిచయాలంటే ఒక అంచనా ఉంటుంది. చలం వాటిని
బద్దలుకొట్టాడు. బద్ధకాన్ని వదుల్చుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని
చదువుకుని, అర్థమైనంత అర్థం చేసుకోమంటాడు; అర్థం కాని వాటిని వదిలేసి
ముందుకు సాగి, అతన్ని అనుభవాలు పంచుకోమంటాడు. అతని మాటలు వినడం వినా వేరు
దారి లేకుండా చేస్తాడు.
నేనెలాగో తిప్పలు పడ్డా కనుక, మీకు కొన్ని వివరాలిస్తాను. కథలో చలంతో పాటు,
అతని స్నేహితులు కొందరు అతనితో కలిసి ఒకే ఇంట్లో ఉంటూంటారు. ఆ సమయంలో అతని
భార్య ఊరెళ్ళి ఉంటుంది. కథ దాదాపు ముగిసే సమయానికి తిరిగి వస్తుంది. ఈ
మధ్యలో ఎదురయ్యే పాత్రలన్నింటి ఆలోచనల్లోనూ కొన్ని సారూప్యాలుంటాయి. ఇదీ
అని తేల్చలేని నిర్లక్ష్యం, అందరికీ మనసో దేహమో పంచుకునే వారి కోసం
ప్రాకులాడే మనస్తత్వం, విడీపోయిన ప్రేమ కథలు, చలం పాత ప్రేయసి (విమల)
ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రియుడితో ముందుకు రావడం, ఆమె ఏడుపులు, అర్థం లేని
బాధలు, టీలు, కిళ్ళీలతో, కబుర్లతో, పాటలతో, కొన్ని నవ్వులతో, కొన్ని
బాధలతో, కొన్ని అసంతృప్తులతో సాగే జీవితాలతో....వాళ్ళంతా కలిసి కాలక్షేపం
చేస్తూంటారు. వీరే చలం 'అమీనా'లో పాత్రధారులు.
ఈ కథ కాస్త కల్పితమూ, కాస్త చలం స్వీయానుభవమూ అని విని ఉన్నాను. కథలో చాలా
చోట్ల ఎంకి పాటల సుబారావుగారి ప్రస్తావన వస్తుంది. ఏలురులో కథ నడిచిన
కాలంలో వారిరువురూ స్నేహితులు కాబోలు. అసలు అమీనా చలానికి మొదటిసారి
తారసపడింది కూడా, సుబ్బారావుని ఏటి ఒడ్డున కలుసుకోవాలని నడుస్తున్నప్పుడే!
అప్పటికే అతనికి అతని జీవితం పట్ల తెలియని విముఖత ఉన్నట్లు తోస్తుంది ఆ
సంభాషణలు చదివితే.
చూసీ చూడగానే స్నేహాన్ని కోరాలనిపింపజేసిన ఆ చిన్న పిల్ల అమీనాతో చలం పలికిన తొలి మాటలివీ...
"ఎక్కడ ఇల్లు?"
"అక్కడ, కాలువగట్టున. మీ ఇల్లు?"
"మొండి గోడల మధ్య."
"అంటే?"
"నీకెందుకు"
"వస్తాను."
"వొస్తావా?"
"మీతోనే ఉంటా"
అమీనా కళ్ళు
నమ్మించాయి. ఆ "మీతోనే ఉంటా"నన్న మాటని మీరలేదు అమీనా నవ్వు. నిర్భాగ్యపు
నా అదృష్టమే, నా అధైర్యమే, నా సందేహమే, నా లోకపరత్వమే, నా లాభనష్ట గణితమే
నిన్ను తరిమి మాయం చేసాయి.
ఇది మొదలుకుని చలంలో అమీనా పసితనమంటే ఆకర్షణా, ఆమెలోని స్వచ్చత పట్ల ప్రేమ,
నిష్కామ స్నేహం కోసం తపన మొదలవుతాయి. తన చుట్టూ ఉన్న ప్రపంచానికి
అతీతమైనదేదో అమీనాలో చూస్తాడు చలం. మనసులో ఉన్నది కళ్ళల్లో చూపెట్టే ఆమెని
ఆరాధిస్తాడు. ఆమె అమాయకత్వపు ప్రవర్తనలో, ప్రేమలో, జీవితం
పునర్నిర్మితమవుతున్నట్టు భావిస్తాడు. అందుకే ఆమెకు దగ్గర్లో ఉండాలనీ,
దగ్గరగా ఉండాలనీ ఆత్రపడతాడు. ఆమె తన పూరి గుడిసెకు, తల్లి కాని తల్లి
దగ్గరకు వెళ్ళినప్పుడు బెంగపడతాడు. తినడానికేమీ లేక చేపలు పట్టుకు వండుకునే
ఆ ముసల్‌మాన్ అమ్మాయి కాసేపు కనపడకపోతే విలవిలలాడతాడు. ఇది చలం అంతరంగం.
బాహ్య ప్రపంచానికి చలం ఒక మర్యాదస్తుడు. ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న సభ్య
సమాజ పౌరుడు. భార్యా, కుటుంబమూ ఉన్న సగటు సంసారి. అమీనాతో స్నేహం ఈ
లోకానికి అర్థం కాదని చలానికి బాగా తెలుసు. ఆమెను ఒక స్నేహితురాలిగా
అందరికీ పరిచయం చేయలేడనీ తెలుసు. అమీనా మాదిరిగా స్వచ్ఛమైన స్నేహాన్ని,
ఆమెకు బదులివ్వలేని అశక్తుడనీ, నిస్సహాయుడనీ, అతని మాటల్లో అతనే
ఒప్పుకుంటాడు కూడా.
కొన్ని రోజులు ఆ మొండి గోడల మధ్య అమీనా అందరితోనూ కలిసి చెప్పిన
కబుర్లతోనూ, ఆమె చేసిన అమృతతుల్యమైన కాఫీ టీలు తాగుతూ , ఆమె అడవిలో నెగళ్ళ
దగ్గర చలి కాచుకుంటూ విని నేర్చుకున్న పాటలు వినడంతోనూ, సాఫీగా రోజులు
దొర్లిపోతుంటాయి. అమీనాకి, ఆ ఇంట్లో తన స్థానమేమిటో తెలీదు. ఆమె అసలు దాని
గురించి ఏనాడూ అలోచించినట్టు కనపడదు. తన పూరి గుడిశలో తనకేనాడూ దక్కని
సంతోషమేదో ఈ మనుష్యుల దగ్గర దొరికిందన్న సంతోష మొక్కటే ఆ లేత గుండెలో. చలం
ఆమె పట్ల చూపించే ప్రత్యేకమైన ప్రేమ, ఆప్యాయతా - ఆ చిట్టితల్లికి అవే
సకలైశ్వర్యాలూ!
ఊరెళ్ళిన భార్య శ్యామల తిరిగి రాకుంటే, ఈ కథకు అడ్డేమీ ఉండేది కాదేమో! అహాల
మధ్య యుద్ధాలను రాజేసిన సంఘటనలంటూ జరగకపోతే, అమీనా పసి మనసు గాయపడేదే
కాదేమో. ఈ భయం చలానికి లేకపోలేదు. అమీనాని అసలు ఏమని పరిచయం చేయాలన్న
మీమంసతో అతను కొట్టుకుపోలేదని, అస్సలు అనుకోలేం.
"బడికి వెళ్ళాక
జ్ఞాపకం వచ్చింది - అమీనా స్వేచ్ఛగా హార్మోనియం వాయించడం, కుర్చీలలో
నిద్రపోవడం, పుస్తకాలలో ఎదో భాష గీకడం, నా బట్టలు సర్దడం తొడుక్కోవడం
సహిస్తుందా శ్యామల ? ముందు చెప్పి రావలసింది...
ఏమనీ ?
అమీనా నౌకరు కాదని..!
నౌకరు కాకపోతే..ఎవరు ?
అవును. అమీనా, ఎవరు ? ఎవరు ?"
మొదట్లోనే చెప్పినట్టు, అంతః సంఘర్షణను, అలజడినీ మనలోకెక్కించేందుకు చలం
అద్భుతమైన భాషను, శైలినీ వాడుకున్నాడు. అమీనా కోసం పడే తపనను అక్షరాల్లో
పెట్టడంలో నూటికి నూరు శాతం సఫలీకృతుడయ్యాడు. అర్థరాత్రి అందరినీ విడిచి,
అన్నింటినీ విడిచి, మనసు పిలుపు విని, గుమ్మం దాటిన క్షణాల్లో చలం మనసిది :
"మెట్లు దిగాను. తలుపు తీశాను.
రోడ్డు. ప్రశాంతమైన కంకరరోడ్డు, చీకటి.
నా సిగ్గుని దాచండి, అడుగుల శబ్దాలూ!
నా మొహాన్ని చూడకండి, నక్షత్రాలూ!
అమీనా. అమీనా - మరచిపోయినాను నిన్ను.!
కాని, కనపడదు. నాకు ముందు తెలుసు.
దురదృష్టం ప్రారంభించిందా...ఇంక అంతు లేదు.
ఇంకేం కాబోతూంది?
రాత్రీ, ఏం చేయబోతున్నావు నన్ను!
అమీనా!! "
వెతికి వెతికి అలసి, తన పనులను తనే తఱచి చూసుకుని చలించీ, స్పష్టాస్పష్ట
భావాల మధ్య ఊగిసలాడి, వెనక్కి వచ్చిన చలం, ఇంటి గుమ్మం ముందు కాళ్ళకి
వెచ్చగా ఏదో తగలడంతో ఉలిక్కిపడతాడు. అతని కాళ్ళ కింద అమీనా!
"అమీనా!"
చీకట్లో - మెట్ల మీద - దుమ్ములో-
ప్రేమలోకంలో దిక్కుమాలిన బిచ్చగాళ్ళం-
దెబ్బతిన్న గుడ్డీవాళ్ళం -అనాధలం- అంధకారులం-ప్రేమని నిరసించే నేను
ప్రేమను ఆశించే అమీనా.
ఇద్దరం-ఇద్దరం- పొడుగై పాకే నీడలో- పెళ్ళలు రాలే గోడలో.
కన్నీళ్ళు -ఎక్కిళ్ళు వేళ్ళు -ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళ వేళ్ళు -వేళ్ళ మధ్య వేళ్ళు -పెదమల మధ్య జుట్టు -రెప్పల మధ్య నీళ్ళు. "
నిజంగా ఈ సంఘటన చదువుతున్నప్పుడు, పసిపిల్లను పొదుముకున్న చలం కనిపిస్తాడు.
ఆకుపచ్చ రిబ్బన్లు జుట్టుకు కట్టుకున్న పిచ్చి అమీనా కన్నీళ్ళతో
కనిపిస్తుంది. ఆ బాధలో ఆ రాత్రి కరిగిపోవడమూ, చీకటి వీడ్కోలిస్తూ
వెళ్ళిపోతుంటే ఉషోదయం వారిని పలకరించడమూ - మనకీ తెలుస్తాయి, మనం మౌన
ప్రేక్షకులమై చూస్తూంటామంతే!
అప్పుడప్పుడూ అతనిలో అంతరాత్మకు వ్యతిరేకం(?)గా చెలరేగే భావాలను స్పష్టపరచడానికా అన్నట్లు, “అమీనా నువ్వూ స్త్రీవేనా ? ” “బలి కోరుతున్న విధి వెయ్యినాల్కలలో ఒకదానివి” అని వగచే చలమూ కనపడతాడు. భయపెడతాడు. అమీనాకి మాత్రం ఈ ఆలోచనలు లేవు. ఏ భయాలూ లేవు. సంబంధాలకు నిర్వచనాలు వెదుక్కోకుండా నిజాయితీగా నిలబడడం మాత్రమే తెలిసిన మేలిమి ముత్యం అమీనా.
శ్యామల తిరిగి వచ్చి, అమీనాని వాలకం నచ్చట్లేదన్న వంక పెట్టి ఇంట్లో నుండి
గెంటేసిన కొన్నాళ్ళకి, అమీనాకు ఒక ముసలి మనిషితో పెళ్ళి కుదురుతుంది.
చలానికిది మింగుడుపడదు.
ఆ పైన ఒక ఆదివారం, అమీనా ఎప్పటిలాగే ఇంట్లోకి దూసుకొస్తుంది. నేరుగా చలం
ఒళ్ళోకి వెళ్ళిపోయి ఏడుపు మొదలెడుతుంది. ఇవి చలంలోని మర్యాదస్తుడీకీ,
అమీనాని అభిమానించే ప్రేమించే ఆరాధించే చలానికీ వైరం మొదలయ్యే క్షణాలు.
చలంలోని స్వార్థం, అమీనా మనసుని తునాతునకలు చేసిన క్షణాలు. చలం జీవితంలో
తర్వాత్తర్వాత ఘోరమైన పశ్చాత్తాపానికి లోనయ్యేట్టు చేసిన ఆలోచనలు, మాటలు -
అతని మాటల్లో ఇవిగో :
"వొద్దు. రాకు. నీకు నాకు అందరికీ తిట్లు.
మర్యాద తెలీదు -అంటారు.
రాకు. లోపలికి రాకు.
నన్ను కావలించుకుని. ఒకటే ఏదుస్తోంది. అమీనా, ఎందుకు ? ఏం జరిగింది ? రా, నాతో చెప్పు ?
తొరగా. తొరగా. అట్లా చప్పుడు చెయ్యకు వొస్తారు. నీ ఏడుపు విననీరు. మనకి స్థలం లేదు. తొరగా అమీనా, ఏమిటి నా అమీనా?
"నాకో చీర కావాలి. కొనిపెట్టండి"
ఏమిటి! చీర! కొనాలా!
ఉండు, అమీనా. ఆలోచించనీ. చీరె ఏమిటీ?
"ఎందుకు నీకు?"
అమీనాకి నేనెందుకు చీరె ఇవ్వాలి? నా చెల్లెలా! నా కూతురా? నా బోగందా? నా అధికారి భార్యా? ఎవరు అమీనా? నేనెందుకు చీరె ఇవ్వాలి.
ఎదగని నౌకరు కన్య, అమీనాకి!
"ఇవ్వరా? నేనడుగుతున్నాను. నాకు అవసరం ఇవ్వరా?"
నా నడుం చుట్టూ లేత వేళ్ళు.
నా పొట్ట తడుపుతూ కన్నీళ్ళు.
చలం తన సంసారాన్నీ, తన జీవితాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆమెకు ఇవ్వడం వల్ల
తను మాటలు పడవలసిన అగత్యమే తప్ప, మరే ఉపయోగమూ కనపడదు. తర్జనభర్జనలూ,
లెక్కలూ పూర్తయ్యాక :
"ఏమిటి అమీనా! ఎందుకు ఇస్తాను నీకు చీరె? ఎందుకు ఇయాలి ?"
నా మొహంలోకి ఒక్క చూపు.
నా నడుంలో నుండి ఒక్క తోపు.
గుమ్మంలో అమీనా! కంఠం ఒణుకుతూ, కాళ్ళు ఎండవేడిలో ఊగుతో -
మనుష్యుల్లో, మంచితనంలో, ఔదార్యంలో, కుంగి, నలిగి, విశ్వాసం నశించి, చాలా సిగ్గుతో -
"పోనీ..పోనీ..నా జీతం..ఇవ్వండి.."
ముక్కలైన మనసు, ముక్కలు ముక్కలుగా మాటల రూపంలో బయటకు వచ్చినా, చలం కదలడు.
చలించడు. డబ్బులకేనాడూ ఆశ పడని పసి అమీనా, అతని అర్థం లేని భయాన్ని చూసి
ఈసడించుకుని, తన ప్రేమను, సంతోషంగా చేసిన పనులనూ, ఈ రోజు పేరు మార్చి జీతం
కోసం అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు ఎంత క్షోభ పడి ఉంటుందో ఆ క్షణంలో అర్థం
చేసుకోలేకపోతాడు.
జీతం రాళ్ళు పడేశాక, మారుమాట్లాడకుండా వెళ్ళిపోయిన ఆమెను చూస్తూ " అమ్మా,
వెళ్ళింది. తిట్టకుండా పోయింది. ఎంతైనా తురక వాళ్ళను నమ్మడానికి వీల్లేదు"
అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తాడు. అక్కడితో అయిపోలేదు, అమీనా అతనికి మళ్ళీ
కనపడుతుంది.
మళ్ళీ అమీనా.అబ్బ!వొదలవా! ఇంకా జీతమా!
ఏమిటి అట్లా చూస్తుంది. ఎండలో వెలవెలపోయే చందమామ లాగు!
సాయంత్రం చీకట్లో చెంగల్వలాగు!
పాపం, అమీనాకి వేరే ఉద్దేశ్యమేదీ ఉండదు; అతనిచ్చిన డబ్బులతో కొనుక్కున్న
చాలీ చాలని ఓణీ చూపించి, తాను వెళ్ళిపోతున్నానంటూ వెను తిరుగుతుంది.
"వెళ్ళకు అమీనా! ఆగు."
"ఆగు. అమీనా! ఆగు."
గడ్డిబండీ అడ్డం - మర్యాద కట్టుకున్న నా కాళ్ళే అడ్డం.
చదివి చదివి గుడ్డివైన నా కళ్ళేఅడ్డం. సబ్బుతో కడుక్కున్న నా చేతులే అడ్డం.
అమీనా! అమీనా!
రోడ్డి మలుపు..సైడు కాలువ. బురద.
అస్తమించే సూర్యుడు -కళ్ళల్లో చీకటి.
అంతే అమీనా!
జన్మానికి ఆఖరు నా చిన్న అమీనా!
ఎరగని పువ్వు నా అమీనా!
అంటూ చలం ఆగిపోవడంతో కథ ముగుస్తుంది.
********************
అమీనాని, చదివే అవకాశం ఉంటే తప్పక చదవండి. జీవితాన్ని చలం కళ్ళతో చూసేందుకు
కాదు. జీవిత సత్యాలేవో తెలుసుకునేందుకు కాదు. మనుష్యులలోని చపల బుద్ధినీ,
చంచల మనస్తత్వాన్నీ గ్రహించి నిరసించేందుకు కాదు. మర్యాదల ముసుగులు తీసుకు
మనసుని స్వచ్ఛంగా మెరిపించుకుందుకూ కాదు. తప్పొప్పులు తూకాలు వేసి, మీ
అభిప్రాయలు బలపరుచుకోవడానికి వాదులాడే అవకాశం కోసం అస్సలు కాదు.
ఒక రచన ఎంత శక్తివంతంగా మలచబడిందో తెలుసుకోవడం కోసం. చలం చేతుల్లో ఒక
మామూలు సంఘటన, ఒక మరపురాని జ్ఞాపకం, ఎంత అపురూపంగా అక్షరాల్లోకి తర్జమా
చేయబడిందో కళ్ళారా చూడండం కోసం! మనసుతో రాసే రచయితల కలం శక్తి మరో సారి
రుచిచూసేందుకు...తరించేందుకు. అమీనాని ప్రేమించేందుకు. మీ గుండెల్లోనైనా
కాస్త చోటిచ్చేందుకు.
( Note :- చలం గురించి ఓ బ్లాగర్ రాసినది ఇక్కడ్ పేష్టుచేస్తున్నా తన అబిప్రాయం నూటీకి నూరుపాల్లు నచ్చితన అనుమతి లేకుండానే )
నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(30)
1) నేను నేర్చుకున్న భాషలన్నీ మర్చిపోయానిప్పుడు
నీతో మాట్లాడేందుకు ఒక కొత్త భాషని సృష్టించుకున్నా అదే మౌన భాష
2) ఒకప్పుడు మనమాటలు మంచు ముత్యాలై గుండెల్లో జాలువారేయి
ఇప్పుడేంటీ అవి జ్ఞాపకాల్లో చేరి అగ్నిగోలాలుగా మారి గుండెను తగలబెడుతున్నాయి
3) ఎందరి దుఃఖాన్ని మేఘంగా ధరించిందో
ఒక్క ఉరుముతో కన్నీటి జళ్ళు కురిచేస్తుంది మేఘం భాదను తట్టుకోలేక
4) మేఘాల భారాన్ని చినుకుల్లా మర్చే
ఆకాశానికి తెలుసు అసలు రహస్యం....అదేంటో చెప్పవూ...?
5) నల్లటి మబ్బులో పుట్టి మట్టిలో కలిసిపోయే చినుకులు
మధ్యలో కోటానుకోట్ల అస్తిత్వాలుగా విడిపోవడమెందుకో కాస్త చెప్పవూ...?
6) నా గుండెల్లో దిగబడ్డ ప్రశ్నల్ని పెకిలించాలని చూస్తావేం...?
7) నీవు లేని నేను ఎందుకని నన్ను నేను విసిరేసుకున్నా
అవేనేమో ఆకాశంలో చుక్కలై నీకోసం వెతుకుతున్నాయి
8) ఎప్పుడూ నీ పిలుపులా మ్రోగే మొబైల్ ఫోన్
నీ హ్రుదయంలా సైలెంట్ మోడ్ లోకి వెల్లిపోయింది ఎందుకో
9) చుట్టూ చిమ్మచీకటి వెలుతురు అస్సలు లేదు
నా హృదయాన్ని తగలబెడితేగాని వెలుగులో నిన్ను చూడాలేనేమో
10) నా నుదుటి స్వేదం గుండెలపైకి జారి
నిశ్శబ్దాన్ని చిద్రం చేస్తుంది నాగుండెల్లో చేరిన నీజ్ఞాపకాల అలజడికి
11) నీవు దూరమై రోజులైనా నాకు మాత్రం మూడు కాలాలు
ఆరు ఋతువులు చివరగా లక్ష నిస్పృహలు గా మిగిలిపోయానని పిస్తోంది
12) నా చుట్టూ నిశ్శబ్దపు రాజ్యం నా ఆలోచలన్న్నిటిని
పగులగొట్టి నాకు నేను విదించుకున్న శిక్ష మౌనం
13) ఆలోచనల అలల్లో తీరం దాటకుండా
నా మౌన సామ్రాజ్యంలో ఒక్కడిగా మిగిలిపోయా
14) నీవస్తావని ఎదురు చూసి చూసి ఆశ చచ్చిపోయింది
అందుకేగా మౌనమనే చీకటి గుహలో నన్ను నేను కట్టేసుకున్నా
15) నేను నీజ్ఞాపకాలను పలుకరిస్తున్న క్షనాలలో
ఏంటో కాలం నన్ను పట్టించుకోకుండా పరిగెత్తుతూనే ఉంది నీలా
16) రాత్రుల్లు కొన్ని ప్రశ్నలు కౌగిలించుకుంటాయి ఇప్పటికీ
ఉక్కిరిబిక్కిరి చేసి నిద్రను చెడగొట్టి ఉదయం అయ్యేదాకా వదలవు
17) నా గుండెలోపల చీకటిగదిలో నీవేం చేస్తున్నావు
కష్టపడి నీ జ్ఞాపకాల సౌదాలను నీవే కూల్చేస్తున్నావా
18) అమ్మను సైతం అమ్మజుపే నమ్మక ద్రోహులను
నయవంచకులను చుట్టూ పెట్టుకొని మురిసిపోతున్నావు జాగ్రత్త
19) కసాయి స్నేహంలో ఇరుక్కపోయిన నష్ట జాతకున్ని నేను
బైటికి రాలేను ...మోసపు మనసు గదిలో నాకు గాలాడటంలేదు
20) ఆరోజు ఉదయం ఏదో బరువుగా ఉంది
విరిసిన పుష్పాల పై రాత్రి మిగిల్చిన కన్నీటి చుక్కల్లా మంచుముత్యాలు
21) నిశ్శబ్దపు అంచులమీదకు జారిన జ్ఞాపకాలు
నిప్పు కణికలై మనసులో మంటలు రేపుతున్నాయి
22) నా తలపులను తెలుసుకోలేనప్పుడు
నా భాష వెనకన భావం బరించరానిదిగా మారినప్పుడు
ఈ నిఘంటువులెందుకు ? గుండెకోతతో రాసే ఈ రాతలెందుకు..?
23) నా మనస్సును పావురం అంత ప్రేమగా చూసుకొని ఇప్పుడెందుకు
రాళ్ళేస్తున్నావు... గాయాలవ్వలనా తగిలిన గాయాలు సరిపోలేదనా...?
24) మౌన భాషలో..మనసు ఒదిగిపోతుంది..
కళ్ళుమూసుకున్న .. మనసు నీకోసం తడుముతోంది
25) చిన్న శబ్దానికి పెదవులు భయపడి మనసు మూగబోతే
నీజ్ఞాపకాలు చేస్తున్న అలజడులను అస్సలు తట్టుకోలేకపోతోంది నా హృదయం
26) నా కలల్ని ముక్కలు చేసి కవితల్ని చెక్కుతున్నా గాని
ఎందుకో హృదయానికి తగిలిన గాయాలే కనిపిస్తున్నాయి అందులో
27) పగిలిన నా గుండె ముక్కలపై నడుస్తున్న
నీ పాదాలకు ఆ ముక్కలు గుచ్చుకుంటాయేమో అని భయంగా ఉంది
28) నీ కోసం నిరీక్షిస్తూ కలల్ని నెమరువేస్తూ శూన్యం లోకి చూస్తూ,
కర్సైపోతున్న కన్నీటి సాక్షిగా నీకోసం కలల పొలంలో భ్రమల నీడల్లో ఎదురుచూస్తున్నా
29) అక్షరాల బరువుతో అలసిన మనసు పుస్తకంలో
ఎందుకు మనిద్దరం అన్ని ప్రతిపేజీ చించి తగలేశావు
30) నీ మౌనపు తుఫాను తాకిడికి
గుండెనరాలు తెంచుకొన్న భావాలు బలౌతున్నాయి
31) నా హృదయాన్ని పంచనామా చేసి చూడు
నీవు ఇప్పటిదాకా చూడలేని భావాలు తరచి చూడచ్చు
32) నిమిషాలు..క్షణాలు..గోళీల్లా దొర్లిపోతుంటే..
నాలో నేను..నాతో నేను పలుకరించుకోలేక పోతున్నా
33) రెండు శరీరాల మధ్యేకాదు ఒకే ఆత్మకూ
రెండు దారుల మధ్య వంతెన అతి సున్నితమైనది --- ఇక్బాల్ చంద్
34) ఒక ఊహలోంచి యధార్థంలోకి పయనానికి సమాయత్తం
అవుతున్న వేళ ఎన్నెన్ని అవమానాలో... ఎన్నెన్ని అవేదనలో
35) ఒక్క క్షణమైనా నిన్ను
నీవు విడిచిపెట్టు నా జ్ఞాపకాల నదిలోకి..ప్లీజ్
36) పిచ్చి మనస్సాక్షి ఎప్పుడూ
ఓడిపోతూనే ఉంది నన్ను మనిషిగా గెలిపించడానికి..
37) నన్ను నీవు ఓడించానని సంబర పడుతున్నావు
నీచేతిలో ఓడిపోయానన్న సంతోషాన్ని మిగిల్చావని మర్చిపోతున్నావు
38) కన్నీళ్ళు తాగి కొనఊపిరితో ఉన్న జ్ఞాపకాలన్నిటిని
పొలిమేరలో సజీవ సమాధి చేస్తున్నాను నా పార్దీవ దేహం తోపాటు
39) నీ కన్నీటి మంట నా చితికి నిప్పుగా మారి
నన్ను తగలబెడుతోంది మరికాసేపట్లో బూడిదౌతాను
40) నాడేమో తీపికల..నేడేమో పీడకలగా మారిపోయానేంటో
41) కన్నీటి సునామీ కంటి తీరం
దాటి రావాలని పరుగులు పెడుతోంది నీకోసం
42) ఎదమాటున దాగున్న అలజడితో
మూడడుగులు దూరంగా సాగిపోయిన జీవన పయనం
43) గాయమై మిగిలిపోతుంది అనుకున్నప్పుడు
అలాంటి పరిచయం కాకుండా ఉంటే ఎంతో బాగుంటుందికదా...?
44) క్షణం గడిచే సమయంలో
మనసులో యుగం గతంలోకి తిరగబెడుతుంది
45) దగ్గరగా ఉన్న వన్నీ వదులుకొంటూ
దూరంగా ఉన్న దేని కోసమో ప్రయత్నిస్తుంటా రెందుకో
46) నా గుండెల్లో నిశ్శబ్దం అగ్నిపర్వతమై పేలుతుంది
మౌనం మాటున దాగివున్న మాటలు చురకత్తులై గుచ్చుకుంటున్నాయి
47) మన గతకాలపు జ్ఞాపకాలు
మర్రిచెట్టు ఊడల్లా మనసంతా అల్లుకుపోయాయి
48) నీ విరహాన్ని అనుభవించిన అంతరంగం
జ్ఞాపకం గా చేజారి నిస్సహాయతకు అక్షర మై స్పందిస్తూంది
49) నా గుండె చనిపోయి సంత్సరాలు గడుస్తుంది
మళ్ళీ చివురు తొడుగుతుందేమో అని నిత్యం కన్నీరు పోస్తూనే ఉన్నాను
50) గుండె తూట్లుకి మాటలనే వెటకొడవల్లతో దాడి చేశావ్
ప్రేమ రాజ్యానికి ఒంటరిగా మిగిలిన రాజునై గుండెల్లో అగ్గిరాజేసుకున్నా
51) తెల్లారితే నీ వెంట తిరిగే నీడను నేను
చీకటి కమ్ముకుంటే నిద్రమాని చెట్లపైవేలాడే గుడ్లగూబను..
52) నీవు నవ్వుతూ గడిపేస్తున్నప్పుడు
మండుటెండలో మంచులా కరిగే నేను గుర్తుకురానేమో...?
53) నామనస్సిప్పుడు పగిలిన అద్దం
జ్ఞాపకమై గుచ్చుకున్న ప్రతిసారి రక్తమేవస్తుందేంటి ....?
54) నా మనసుపై రక్తపు మరకలా..?
అవి నీ జ్ఞాపకాల ఆనవాళ్ళు కదూ...?
55) చీకటి గతానికి ఓ తీపిగుర్తు
ఉదయం ప్రస్తుతానికి మాయనిమచ్చ..?
56) అందరూ నిద్రలో ఉన్నారు
నేను మాత్రం నీ జ్ఞాపకాలతో మెలుగువగా ఉన్నా...?
57) మనసు మాటలకు ఎర్రటి రక్తాన్ని పులిమి
కార్చే కన్నీరును చూసి నటిస్తున్నంవంటే ఏం సమాదానం చెప్పను
58) చిద్రమైన దేహపు గాయాలన్నిటిలో
మదిలో ఒలకబోసిన యాసిడ్ గామరింది నీ వెక్కిరింఫు
59) ఒయ్ నీవు నన్ను వదలి వచ్చావు
మరి కనీసం నన్ను నాకు ఇవ్వలేదు ఎందుకని
60) నిశబ్దాలను చీల్చుకుని నాలో నేను
చనిపోయి నాలో నేను మళ్ళీ మళ్ళీ పుడుతుంటా
61) శబ్దానికి నిరాశకి నిశ్శబ్దపు ఓదార్పవ్వడంతో
బాధల అగాధాల్ని కప్పేసిన జ్ఞాపకం గుచ్చుకొంటుంది
62) స్వప్నాల పచ్చిక మీద అఘాదాలు
సృష్టిస్తూ సాగుతున్న నిశ్శబ్ద చిత్రకారుడిగా మారాను
63) నా మనస్సులోని ప్రేమను హత్యిచేసి ఎందుకు హంతకురాలైయ్యావు..?
64) ఇద్దరూ మంచిగున్నప్పుడు ఉన్న "రెస్పెక్టు"
విడిపోతే అది వెటకారంగా మారుతుందా ఇదేనా స్నేహం అంటే..?
65) ఏంటో జీవితం నేనిలా ఐపోయాను ఎవరికి ఏం చెప్పాలో తెలీక
నా మాటలను నామీదనే జల్లుకొంటున్నా... ఏంటో గుచ్చుకుంటున్నాయి
66) ఎప్పుడు ఎలా ఉంటుందో కొంత అర్ధం అయ్యీ అవక
మరికొంత అర్ధం కాని రహస్యంలా స్వేచ్ఛకు మరో రూపంలా...మారింది నీజ్ఞాపకం
67) నన్ను నేను వెతుక్కుంటున్నా..ఎవరికైనా కనిపిస్తే కాస్త నాకు చెప్పరూ ..
68) గాయం మానాక మచ్చ కూడా పడుతుందేమో కాని
జ్ఞాపకాన్ని పట్టించుకోకపోతే మాత్రం అది నిలువునా తగలబెడుతుంది..?
69) మనసులో నిర్వేదం నా గుండెని కోస్తుంటే
మౌనంగా ఉండతం తప్ప మరేమీ చేయలేని విచిత్రస్థితి
70) కడదాకా కలిసొస్తానంటూ మాటివ్వు
జీవితాంతం ఎదలో కాస్త చోటివ్వు..ఒయ్ కనిపించవేం..?
71) నిజంకోసం తడుముకుంటున్న నాకు
వెనుదిరిగి చూస్తే ఎక్కడా.. కనిపించవేం? ఏమైపోయావు?
72) నీ గుండె లోతుల్లోని రహస్యాలు విందామని
ఆరాటపడే ఆశతో హృదయం చేసే అలజడే గుండెచప్పుడు
73) ఏమి చేయాలో తెలీక తడబడుతూ
నేను "కల"కి దగ్గరయి "నిజానికి" దూరం అయ్యాను
74) కన్నీళ్ళు కాలువలై పారుతుంటే
ఙ్ఞాపకాలు పడవలుగా తేలుతున్నాయి ఎన్నాళ్ళిలా
75) ఇద్దరు మిత్రులునిజంగా ..విడిపోవడమంటే చనిపోవడమేనేమో..

Subscribe to:
Posts (Atom)