కల్మషం లేని మనసుని చూసా తొలిసారిగా
నను కనుపాపలా వెంటాడే ఆ స్నేహం
కలత చెంద కూడదని
దేవుణ్ణి వెడుకుంటున్నాను ప్రతి క్షణం
నే కళ్ళు మూసుకుంటే అమ్మ లా
నా బాదలొ ఓదార్పులా
నా సంతోషం లో నవ్వులా
తన ప్రేమలో జీవంలా
చూసుకొనే ఆ స్నేహం గురించి
వర్ణించటానికి పదాలు లేవు
ఆ స్నేహం కోసం ఎన్ని
జన్మలైనా పుట్టాలని ఉంది
చెరగని మమకారం ఈ జన్మలో
ఆ దేవుడు నాకిచ్చిన వరం నీ స్నేహం ప్రియా
అలాంటి అందమైన అద్బుత మైన స్నేహం
ఏక్కడుందో.. తన మనస్సులో లేనెందుకో నేనిప్పుడు
ఏమైందో ఏమో .. చెప్పుడు మాటలు విని
నాకు దూరం అయింది...
నన్ను మనసు కష్టపడే మాటలు అని
ఏవరికోసమో నామనసెరిగిన
మనిషి నన్ను దోషిని చేసి ఏడుస్తుంటే
ఏం జరుగుతుందో అర్దం కాక పిచ్చాడి నయ్యా అయినా
ఆమనిషికి జాలి లేదు జాలీగా
నన్ను మర్చి నాతో తప్ప అందరితో స్నేహంగా ఉంది
నేనెందుకు అంత చేదు అయ్యానో అని అడుగలేను
నన్నూ ఒక్కసారి పలకరించవాని అడుగుతున్నా
నామాటలు విలనేనంత దూరం అయింది
మరి నా హృదయ వేదన తనకు చేర్చేదేలాగో
తెలియక నాలో నేను కుమిలి పోతున్న ప్రియా
ఏమౌతానో ఏమౌతుందో తేలీక ప్రియా