ఏంటి ఈ ముళ్ళు
నా మదినిండానిండా
కలలో కన్నీరై
కంటినుడి కారిన
కన్నీటి జ్ఞాపకలేనా ?
ఏంటి ఇంతగా గుచ్చుకుంటున్నాయి
నన్నుఇంత భాదపెడుతున్నాయి
నీవిచ్చినవేగా ప్రియా
మనసును మాయచేసి
మదిని గాయం చేసి
నీవదిలిన జ్ఞాపకాలే ఇవి?
ఏంటి చిందర వందరగా
పడి వున్న వస్తువులు
వెళుతూ వెళుతూ
నీ జ్ఞాపకాలను
చెరిపేసే ప్రయత్నమేనా ?
నాతో చెప్పిఉండొచ్చుగా ..
కలలో కుడా నీ జ్ఞాపకాన్ని
హత్తుకొని ఉండి
నన్నోదిలేసే క్షణం నీకు
వీడుకోలు కుడా చెప్పలేకపోయా
మళ్ళీ వస్తావని తెలుసు
నా హృదయం ప్రేమ తీపి
నిను మళ్ళీ నా వైపు
లాక్కోస్తుందని తెలుసు
అప్పటివరకు
నీ జ్ఞాపకాలను వాడిపోనివ్వను
నా కన్నీటి సాక్షిగా ప్రియా
నా మదినిండానిండా
కలలో కన్నీరై
కంటినుడి కారిన
కన్నీటి జ్ఞాపకలేనా ?
ఏంటి ఇంతగా గుచ్చుకుంటున్నాయి
నన్నుఇంత భాదపెడుతున్నాయి
నీవిచ్చినవేగా ప్రియా
మనసును మాయచేసి
మదిని గాయం చేసి
నీవదిలిన జ్ఞాపకాలే ఇవి?
ఏంటి చిందర వందరగా
పడి వున్న వస్తువులు
వెళుతూ వెళుతూ
నీ జ్ఞాపకాలను
చెరిపేసే ప్రయత్నమేనా ?
నాతో చెప్పిఉండొచ్చుగా ..
కలలో కుడా నీ జ్ఞాపకాన్ని
హత్తుకొని ఉండి
నన్నోదిలేసే క్షణం నీకు
వీడుకోలు కుడా చెప్పలేకపోయా
మళ్ళీ వస్తావని తెలుసు
నా హృదయం ప్రేమ తీపి
నిను మళ్ళీ నా వైపు
లాక్కోస్తుందని తెలుసు
అప్పటివరకు
నీ జ్ఞాపకాలను వాడిపోనివ్వను
నా కన్నీటి సాక్షిగా ప్రియా