ఒంటరి నీజ్ఞాపకాల
మౌనాన్ని ఉపిరి తిత్తుల
లో నింపుకుంటున్నా
గుండె నిండా బలంగా పీల్చుకొని
మనసులోని బాధల సుడుల్లా
బయటకు వదులు తుంటే
నా గతం కాలిపోతూ
ఇప్పుడు రాలిపోతుంది వర్తమానం
నికోటిన్ నరాళ్ళో చేరి
విషాన్ని నింపుతున్నా
విషాదంలో ఏదో తెలీక
పొగ.............
నల్లటి దట్టమైన పొగ
సుడులు తిరుగుతూ
పైకి ఎగురు తుంది ...
ప్రియా వయ్యారంగా ఎగిరే
నీ కురుల ముంగురుల్లా
ఓ చివర
వెలిగే నిప్పు కణిక
మరోవైపు నాపెదాలను చీల్సుకొని
గొంతులోనుంచి ఊపిరితిత్తుల్లో చేరుతున్న
పొగల పొరల మద్యి నీవున్నావు తెలుసా
మౌనాన్ని ఉపిరి తిత్తుల
లో నింపుకుంటున్నా
గుండె నిండా బలంగా పీల్చుకొని
మనసులోని బాధల సుడుల్లా
బయటకు వదులు తుంటే
నా గతం కాలిపోతూ
ఇప్పుడు రాలిపోతుంది వర్తమానం
నికోటిన్ నరాళ్ళో చేరి
విషాన్ని నింపుతున్నా
విషాదంలో ఏదో తెలీక
ప్రమాదం అని తెల్సీ
కోరి తెస్సుకున్న
నిను మరువలేక
కోరి తెస్సుకున్న
నిను మరువలేక
పొగ.............
నల్లటి దట్టమైన పొగ
సుడులు తిరుగుతూ
పైకి ఎగురు తుంది ...
ప్రియా వయ్యారంగా ఎగిరే
నీ కురుల ముంగురుల్లా
ఓ చివర
వెలిగే నిప్పు కణిక
మరోవైపు నాపెదాలను చీల్సుకొని
గొంతులోనుంచి ఊపిరితిత్తుల్లో చేరుతున్న
పొగల పొరల మద్యి నీవున్నావు తెలుసా
నీ అందమైన నవ్వు గుర్తొచ్చిన ప్రతి సారీ
ఇంకా గట్టిగా పొగను పీల్చి
ఇంకా గట్టిగా పొగను పీల్చి
నామీద కసి నేనే తీర్చుకుంటున్నా
వేడి పొగ
వేడి పొగ
నికోటిన్ విషాన్ని
ఊపిరితిత్తుల్లోకి చేరుస్తూ
ప్రియురాలి వెచ్చటి
కౌగిలి సుఖం ఇస్తుందా కాసేపు
తన కౌగిలి నుభవానికి
వస్తుంది ఆఖరి ధమ్ము
ప్రతినిమిషం నీ జ్ఞాపకాల సుడుల్లో
తీరని భాదగుర్తుకొచ్చి..
బలవంతంగా పొగను పీలుస్తూ
వెచ్చని ఆవిర్లు కమ్ముకున్న క్షనాన
కాస్త రిలాక్స్ అనిపించినా
అది సాశ్వితం కాదని తెల్సినా
నన్నాపే వారులేక
నీవు దగ్గరకు రావని తెల్సీ
తన కౌగిలి నుభవానికి
వస్తుంది ఆఖరి ధమ్ము
ప్రతినిమిషం నీ జ్ఞాపకాల సుడుల్లో
తీరని భాదగుర్తుకొచ్చి..
బలవంతంగా పొగను పీలుస్తూ
వెచ్చని ఆవిర్లు కమ్ముకున్న క్షనాన
కాస్త రిలాక్స్ అనిపించినా
అది సాశ్వితం కాదని తెల్సినా
నన్నాపే వారులేక
నీవు దగ్గరకు రావని తెల్సీ
నీవు నన్నోడించిన
క్షనాలను తలచుకొంటూ
నా అన్న నీవు దూరం అయి...
ఇప్పుడీ పొగతో
దేనికి దగ్గరౌతున్నానో తెలుస్తుంది గా ప్రియా
ఓవైపు నీజ్ఞాపకాలు కత్తుల్లా వేటాడుతుంటే
మరోవైపు క్యాన్నర్ పొరలు కమ్ముకుంటున్నాయి
నా అన్న నీవు దూరం అయి...
ఇప్పుడీ పొగతో
దేనికి దగ్గరౌతున్నానో తెలుస్తుంది గా ప్రియా
ఓవైపు నీజ్ఞాపకాలు కత్తుల్లా వేటాడుతుంటే
మరోవైపు క్యాన్నర్ పొరలు కమ్ముకుంటున్నాయి