. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, December 6, 2012

ప్రేమకావ్యం కాని సందేశాన్ని నీకు అందించాలని

ప్రేమకావ్యం కాని సందేశాన్ని నీకు అందించాలని
నీ తలపులతో నేను పోరాడి గాయాలతో గెలిచానని
తెలిపే పదాలకూర్పుకై వెతికా ఆశల నిఘంటువుని
వాటినే రాశులుగా పేర్చి ప్రయత్నించా రాయాలని!

తెలుసు నాకు సహనంతో నీవు వాటిని చదవవని

చేసిన బాసలు, చిలిపి చేష్టలు కొన్నేకదా అనుకుని
రాయబోయి చిట్టాల చాంతాడులో చిక్కుకున్నానని!

అలిగితే అది తీర్చ దరిలేని నిన్ను ఊహించుకుని
గడచిన స్మృతులలో కలిసున్నవి కొన్ని ఎంచుకుని
చేసాను ప్రయత్నం పలువిధాలా నీకు పంపాలని!

కానీ......నా నిదురలేని కళ్ళు నీపై నిందవేయాలని
ఊగిసలాడే మదిని రెచ్చగొట్టి నిన్ను కంటపడమని
లేకపోతే నా ఊపిరిలో కలిసిన నిన్ను వేరు చేస్తానని
తెలిపిన బెదిరింపుని బాధగా గొంతులో అణచి వేసుకుని
కన్నీటి కెరటాల్లో కడిగేయ ప్రయత్నించా నీ జ్ఞాపకాలని!

- ..> ఇది  పద్మ గారు రాసిన కవిత నాగుండేళ్ళో బావలు అచ్చుగుద్దినట్టు అనిపిస్తే .. నా బ్లాగ్ లో పోష్టు చేస్తున్నా,,, అమె అనుమతి తీసుకోలేదు.. తరువాత అడుగుతాను తాను వద్దంటే తీసివేస్తాను కాని కవిత చదివాక నా బ్లాగ్ లో పెట్టాలంపించి మంచి బొమ్మ కూడా సెలెక్టు చేసుకున్నా