రెక్కలొచ్చిన పక్షిలా ఎగరాలని ఎంత ఆపేక్షగా ఎదురుచూస్తుందో గాని, ఈ మనసు కాస్త సందు చిక్కితే చాలు చంటి పిల్లాడిలా నీకోసం ఒక చోట నిలువకుండా పరుగెడుతూనే ఉంటుంది.దాని నీకోసం ఎదురు చూసిన కళ్ళు ఏర్రబడ్డాయి కాని నీ జాడకనుచూపుమేరలో లేదు కళ్ళ నిండా ఆనందం నింపుకుని ఎన్నాళ్ళయిందో గానీ అవి ఇంకా కాస్సేపు నిద్రపోమ్మంటున్నాయి.కనీసం కలలోనైనా సేద తీరుదామని ఆశ కాబోలు. ఒక్కోసారి నేను చివరిసారిగా ఎప్పుడు నవ్వుకున్నానా అని ఆలోచిస్తాను.భయమేస్తుంది.! మర్చిపోయానేమో అని మనసు నిండిపోయేలా నవ్వుకుంటే కంటి కుండలు ఒలిగిపోయి ఊళ్ళకి వరదలు వచ్చినట్లు కన్నీరోస్తుందం! నా కళ్ళ లోగిళ్ళు మరి మెట్ట ప్రాంతాలేమో చినుకే లేదు.ఇంక వరద ఎక్కడిది ? ఎందుకిలా అని ఎవరినన్నా అడుగుదామని కలియజూస్తాను.నాలా వెతుక్కునే మనసు జాడే కనిపించదు! కానీ ఏదో మైకం కమ్మినట్లు, ఎవరో వెన్నపూత పూసినట్లు నా పక్కన వాళ్ళు నవ్వుకుంటున్నారు! కానీ వెలుగుజిలుగుల విరి వసంతాలు నిండిన సుందర దరహాస సుమ హారాలు ఎవ్వరి మెడలోనూ కనిపించలేదు. విసుగు పెరిగి ఎవర్నీ కసురుకోలేక కాళ్ళతో తలుపుని, చేతులతో గాలిని, ఈ తలతో గోడు వింటోన్న గోడని అడిగిచూస్తే చిత్రం! నా ప్రశ్నలు నాకే వినిపిస్తున్నాయి! ఎవరూ వాటికి జవాబు ఇచ్చేలా లేరు నాలో నేను ఇలా చస్తూ బ్రకడం చాలా కష్టంగా ఉంది ...కొందరి పై పెంచుకున్న ఇష్టానికి నాకు నేను వేసుకున్న శిక్షలా అనిపిస్తుంది..
నిశ్శబ్దంగా కురుస్తోన్న ఈ సాయంత్రపు చిమ్మచీకట్లోనేను ఏడుస్తున్నాను. కానీ కన్నీరే లేదు! కొందరు గతం అనేది పూర్తిగా మర్చిపోయి తనను ఏమార్చుకొని ఆనందాన్ని అరువుతెచ్చుకొని... మరికరి మనసులో కత్తులు దూర్చి.. తన సంతోషం మాత్రమే వెతుక్కొని నమ్మిన వాని గొందు నిలువునా కొసి ఏంసాదించిందో తెలీయదు గదులు మేడలు పేర్చేసుకుని ఎవరికీ కనిపించకుండా, నల్లని నవ్వుల దుప్పటి మొత్తంగా కప్పేసుకుని జీవితాన్ని గడిపేస్తున్నారు. ఒంటరితనం పోరాడి గెలవాల్సిన యుద్ధం కాదు. అది మనల్ని మనకు పరిచయం చేసే ఒక ప్రపంచం. మనసులోతుల్లోని ఒక అరుదైన సంభవం పారిపోతే వెంబడించి మనసుని కబళిస్తుంది. ధైర్యంతో ఆహ్వానిస్తే మనల్ని మనకే ఇంకొంచెం అందంగా , ఆహ్లాదంగా చూపిస్తుంది. మనమూ, ఈ ప్రకృతి వేరు వేరు కాదని, దూరంగా కనిపించే కొండలు, వాగులు, పక్షుల కిల కిల రావాల లో ఉన్నంత సౌందర్యం మనలోనూ ఉన్నదని తెలుసుకునేలా చేసేది ఈ ఒంటరితనం అన్నీ తెల్సిన ఆరిందిలా నీవు నాతో మాట్లాడిన ప్రతిమాటలో నిజాన్ని వెతుక్కున్నా అప్పుడు ఇప్పుడూ కళ్ళముందు జరుగుతున్న నిజాని కాదనలేక...కసుక్కున నాలో నేను అవమానపు కత్తులు దూచుకొని రోదిస్తున్నా.. నాకు చేతనైంది నేను చేయగలిగింది అదొక్కటేనేమో
ఈ నిజాన్ని అందరూ తెల్సుకొంది ..జరిగేవన్నీ నిజాలు కావు బ్రమలు ..వాళ్ళు నటిస్తున్నారు అచ్చం నిజం అనేలా ఎదోరోజు మనసుమార్చుకొని .. మరొకరి వంచన చేరి .. మనల్ని అవమానిస్తారు నిలువునా క్రుంగిపోతున్నా .. ఆ భాదను చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటారు ..అప్పుడూ టైంపాస్ కోసం ఏదో నటించా అన్ని నిజం అనుకొమ్మన్నానా . అది నీకర్మ అంటూ మరొకరి వంచన చేరి ఆవమానిస్తున్నా చూస్తు ఏడుస్తూ ఎర్రబడిన కళ్ళతొ కన్నీరు కార్చడం తప్ప ఏం చేయలేం మనకు మనస్సుంది...వాళ్ళకు లేదు ..అదో బండరాయి కాని అన్ని నిజాలనే నమ్మించి ఎంచక్కా మోసం చేసి తన దారిన తను వెల్లి పోతుంది దేవుడూ లేదు దెయ్యంలేదు ...విలువలను వలువల్లా ఊడ్చి వెల్లిపోతుంది వయ్యారాల సుందరి నా మదిని దోచిన మంజరి ..దేవుడు ఉంటే నాకెపుడైనా కనిపిస్తే, ఓ పెద్ద కొరడా అడుగుతాను. ఓ మనిషిని నాకంటే ఎక్కువ ప్రేమించి మోసపోయినందుకు నన్నూ నేను కొట్టుకొని .. నా వంటిపై ఎర్రగా వాచి రక్తం ఓడుతున్న దెబ్బల సాక్షిగా అవే నిజాలై నన్ను వేదిస్తున్నాయని నా మనసుకు నచ్చజెప్పుకునేందుకు అసలు గడిపింది కాస్సేపు ఒంటరిగా, నిశ్చలంగా అని తెలియాలంటే ఇలాంటి కసాయి సాహితీ కొరడాలు కావాలి. దీన్ని ఝుళిపించుకుంటూ దూరంగా వదిలేసుకున్న ఆ ఒంటరి అడవికి అందరినీ తోలుకుపోతాను. నడిరేతిరి నిశ్శబ్దంలో అడవి వల్లించే వేద ఘోష లో చీకటి కట్లు విప్పుకుని ఈ మనిషి కళ్ళు తెరుస్తాడు. తానూ ప్రకృతే అని గ్రహిస్తాడు ! బావుకోడానికి,బావురుమనడానికి తనకేదిలేదని, తనదేది కాదని గ్రహిస్తాడు. తనకంటూ రోజులో కొన్ని ఒంటరి క్షణాలు లేని రోజున, ఏదో ఒక చిన్న తాపత్రయంతో నేను రాసిన ఈ రాతలు నాలో నేను గడిపిన ఒంటరి క్షణాలు. చదివినపుడు అవి తియ్యగా, ఆర్ధ్రతగా అనిపిస్తే ఆ చిన్ని అనుభూతే ఆ భాదను ఒక్కసారి తరచిచూస్తే నిద్రలేని రాత్రులు ... మనసుపడేవేదన ఎవరికి కావాలి స్వార్దం మనిషిని ఉచ్చనీచాలు మర్చేలా చేస్తున్న క్షనాల్లొనేను చెప్పేది నా మనసు చేప్పే వేదన నీకెందుకు .. నీ ఆనందంకోసం ఏలాగైనా ఉండగలవు అది నీకొక్కదానికే సాద్యిమేమో