మిగిలిపోయిన గాయాల గురించి
బెంగలేదు..గుండెలో
పగుళ్లిచ్చిన కలల గురించి
పశ్చాత్తాపం అయినా
ఆదరించే వారేడి
ముళ్లను కౌగిలించునున్నా
అదే నీ ప్రేమని తెలీక
కళ్లు నులుముకున్న
ప్రతిసారీ కన్నీళ్ళే వస్తున్నాయి
నిప్పులకుంపట్లు బయటకు
దూకుతున్నాయి నీజ్ఞాపకాలై
తెల్లవారుజాముల్లో
ఎన్నెన్ని మరణాలు
చీకటితెరల్ని చించుకుంటూ..
నాకు నేను మరనిస్తూ
వెలుగుపొరల్ని కౌగిలించుకుంటూ..
నన్ను నేను అసహ్యించుకొంటూ
చచ్చుబడిన క్షనాలను
నిద్రలేపిన నీ తియ్యటి గుర్తులు..
నన్ను వెక్కిరిస్తున్నాయి
అక్షరాలు అలసిపోయేదాకా..
పిచ్చిరాతలు రాస్తూనే ఉన్నా అలుపెరగక
గుండెలమీద రెపరెపలాడే
జ్ఞాపకాల పేజీలు
నేనేంటొ తెల్సి కూడా
నన్ను వెతుక్కుంటూ
చుట్టూ సూర్యకిరణాల
పరిభ్రమణం చేస్తునే ఉన్నాయ్
మైలురాళ్ల వెంట ఆహ్వానతోరణాలు..
నీవనే తియ్యటి జ్ఞాపకాలు
తీరం చేరిన ప్రతిసారీ ఎక్కడో
నేను ఓడిపోయిన నిజం
పరుగెత్తే మోహంలో ..
నన్ను కాటేస్తున్న నిజాలు
ఏమేం పోగొట్టుకున్నానో గుర్తించలేక.
నేనోడిపోయాను
రాలిపడుతున్నగతాన్ని ఏరుకుని
మళ్లీ ఒంటికి అతికించుకోలేక
పిచ్చాడిలా తిరుగుతునే
ఉన్నా గమ్యిం తెలీక నీకోసం
బెంగలేదు..గుండెలో
పగుళ్లిచ్చిన కలల గురించి
పశ్చాత్తాపం అయినా
ఆదరించే వారేడి
ముళ్లను కౌగిలించునున్నా
అదే నీ ప్రేమని తెలీక
కళ్లు నులుముకున్న
ప్రతిసారీ కన్నీళ్ళే వస్తున్నాయి
నిప్పులకుంపట్లు బయటకు
దూకుతున్నాయి నీజ్ఞాపకాలై
తెల్లవారుజాముల్లో
ఎన్నెన్ని మరణాలు
చీకటితెరల్ని చించుకుంటూ..
నాకు నేను మరనిస్తూ
వెలుగుపొరల్ని కౌగిలించుకుంటూ..
నన్ను నేను అసహ్యించుకొంటూ
చచ్చుబడిన క్షనాలను
నిద్రలేపిన నీ తియ్యటి గుర్తులు..
నన్ను వెక్కిరిస్తున్నాయి
అక్షరాలు అలసిపోయేదాకా..
పిచ్చిరాతలు రాస్తూనే ఉన్నా అలుపెరగక
గుండెలమీద రెపరెపలాడే
జ్ఞాపకాల పేజీలు
నేనేంటొ తెల్సి కూడా
నన్ను వెతుక్కుంటూ
చుట్టూ సూర్యకిరణాల
పరిభ్రమణం చేస్తునే ఉన్నాయ్
మైలురాళ్ల వెంట ఆహ్వానతోరణాలు..
నీవనే తియ్యటి జ్ఞాపకాలు
తీరం చేరిన ప్రతిసారీ ఎక్కడో
నేను ఓడిపోయిన నిజం
పరుగెత్తే మోహంలో ..
నన్ను కాటేస్తున్న నిజాలు
ఏమేం పోగొట్టుకున్నానో గుర్తించలేక.
నేనోడిపోయాను
రాలిపడుతున్నగతాన్ని ఏరుకుని
మళ్లీ ఒంటికి అతికించుకోలేక
పిచ్చాడిలా తిరుగుతునే
ఉన్నా గమ్యిం తెలీక నీకోసం