దాచలని చూసినా
దాగలేనిది
మది ఊసుల ఊయలలు
అనగారిన మురిపాలు
అందిపుచ్చుకునే
సమయం దగ్గరై
మనసు గిలిగింతలు
పెడుతున్నాయి...
మది అళ్ళ కళ్ళోలం సాక్షిగా
మదిసరాగాలు గిచ్చి
గిలిగింతలు పెడుతున్నా..
మనం ఏకమై
మమేకమై ఇద్దరం ఒక్కటై
ఆసరాగాలు
పాడుకునే వేలాయనా...?
ఎవరన్నారు మన ప్రేమకు
ఎటువంటి అడ్డుగోడలు ఉన్నాయని
మనమధ్య ఏ విధమైన పొరపొచ్చాలు
కావవి దూరంగా ఉండి దగ్గరవ్వడమే కదూ
నీలోని సొగసుల సోయగాలు
నాలో రేపెను వలపుల తరంగాలు
మనసైన వాడిని కాబట్టేనేమో
ప్రతి హృదయ
స్పందన తెలుసుకున్నా
తలచుకున్న క్షనానే
గుండెలదరగా కవ్విస్తున్నావు
మూసిన కనురెప్పల
వెనుక చిలిపిగ నవ్వుతూనీవు