నీవాడినే నేను
మనం అన్నది గతం
నా అన్న పదంలోంచి
నన్ను తరిమేశావుగా
అయినా నా మనస్సులో
నీవదిలిన
ఆ స్నేహకుసుమాల
వాసనలు నను వీడలేదులే ...?
నాలో కనిపించని
ఆనందం నీలో నైనా
మిగిలిపోయిందన్న
ఆనందంలో
అప్పుడప్పుడూ
ఏడుస్తూ నటిస్తుంటా
అందరూ
నవ్వుతున్నారనుకుంటారు
అవి ఆనంద భాష్పాలని
బ్రమ పడతారు
అసలు నిజం తెల్సిన
గుండె నీదొక్కటే
నాదన్నది నీదగ్గర వదలి
నేనున్నది నీకోసమే కదా
మనసున్నోడీని
కాబట్టే నన్ను మాయచేశావు
పిచ్చాడీని చేసి ఇంకా
నీకోసం నీవు వదలిన
జ్ఞాఫకాళ్లో నే తచ్చాడుతున్నా
దొరకవని తెల్సీ కుడా