. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, February 24, 2014

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(34)

1) కలానికి కాలానికి కవితకు అందని
శూన్యం లోకి జారిపోతున్నా కాస్త కాపాడవూ.

2) రాలిపోయిన కాలంనన్ను రాయిగా మర్చింది
భ్రతుకు భారంగా నడుస్తున్న జీవితంసాక్షిగా

3) ఓకాలమా కన్నీటి చుక్కల్లే జారికరిగిపోకు,
నాకన్నుల్లో కలలున్నాయి అని మర్చిపోకు

 4) కాలం కరుడుగట్టిన జ్ఞాపకమై వేదిస్తుంది
నీన్ను నన్ను వేరు చేసిఆనందిస్తంది

5) ఎవరేమైతే నీకేం? ఎవరెలాపోతే నీకేం?
నీ సంతోషం కోసం ఎలాగైనా నటీస్తావు ..సావిత్రిని మించిన నటివి

6) బలే తొందరేంటి నీకు,,,కలిసెళ్దాం అన్నావు
తిరిగిచుస్తే ..మరొకళ్ళతొ కల్సి నడిచి వెలుతున్నావ్

7) మదిలో ఏ మూలో.. కదిలాడుతున్న నిశ్శబ్దం
జ్ఞాపకాల దొంతర కదిలిన చప్పుడులో కల్సిపోతోంది మౌనంగా

8) రిక్తహస్తాలతో నీ ఎదుట నిలిచాను
ప్రేమీంచే మనసు తప్ప మరేమీ ఆశించలేని నిర్వేదంలో

9) గులాబీవేకదా అని గుండెలకు దగ్గరగాచేర్చుకున్నా
నమ్మించి నాకుతెలియకుండానే నీముళ్ళుతో గుచ్చేశావుగా

10) నా కన్నులు కంటిపాపైన నీకు అర్పితం.
అందులో కన్నీరు మాత్రం నాకు సొంతం.

11) ఎందరిలో నేనున్నా, నా ఊహలు నీకు అంకితం.
నీ జ్ఞాపకాలతోనే చివరకు అయిపోతానేమో అంతం.

12) కన్నులకు కలలు సహజం.
ఆ కలలు ఏవేవో ఊహల ఫలితం.

13) ఎక్కడికి వెల్లీపోతున్నావ్
నాలో నిశ్శబ్దాన్ని రగిల్చి మౌనంగా

14) ఎన్నో దేహాల్ని అపవిత్రం చేసి
చిలిపిగా నవ్వుతూ కాలాన్ని కాటేసింది.

15) ఎదురుచూసిన రాత్రులన్నీ ఏమరపాటుగా
నిర్జీవమై మనసు పేజీల్లో దాక్కుని బిక్కు బిక్కు మంటున్నాయి

16) ఎవరక్కడ ఎందుకురా నన్ను వెక్కిరిస్తావు
ఓటమిని నా జేబులో పెట్టుకొని తిరుగుతున్నాగా

17) చీకటి మాటున దాగున్న అసలు నిజాలు
చూడాలనుకున్నా చూడలేని మనస్సులేని మనుషులు

18) బిగిసిన గుప్పిట్లో నిన్నటిని దాచాను
రాబోయే రేపటిలో నిన్ను చూసుకోవాలన్న ఆత్రంలో

19) అవసరం అన్నీ నేర్పుతుంది
ఇప్పుడు నీతో యుద్ధం అవసరం అందుకే ఈ మౌనం

20) లోకం ఒక పెద్ద కత్తులబోను
ఒడిసి పట్టుకొనే లోపే గుండెల్లో గుచ్చేస్తారు

21) నీ ఒంటరితనం పొగోట్టుకోడానికి
నన్నొంటరిని చేసి..ఏకాంత మందిరాన్ని సృష్టించావుగా..?

22) జ్ఞాపకాల సంచీలోంచి
కొన్ని క్షణాల వెలికితీసీ చూసుకుంటూనే ఉన్నా

23) కల్లల అలల తెప్ప మీద జ్ఞాపకాన్ని
దాచేస్తూ సూర్యుడు తన వేడి కిరనాలతో వచ్చేశాడు

24) నేనుండాల్సింది నీ లోపల కాదు అనుకున్నావేమో
నన్ను శోధించుకోవాల్సింది లేదని మనసు గది బైట్ పడేశావు

25) మనసులో చేరిన కాసిన్ని అక్షరాలు
పంజరంలో పక్షుల్లా విలవిలలాడుతూనే ఉన్నాయి

26) ఎక్కడో ఏ మూల నుంచో గతం గాయాలై
మనసులో భాదను తిరగబెడుతూ తగలబెడుతూనే ఉంది

27) నీకేం నువ్వు కలగా జ్ఞాపకామై మిగిలిపోతావు
నేను ఇలలో బ్రకాలో లేదో తెలీక భారంగా కాలం వెల్లదీస్తున్నా

28) మనల్ని మనం పోగొట్టుకోవడం చాలా తేలిక
తిరిగి పొందాలంటేనే..ఎన్నీ జీవితకాలాలు పడుతుందే తెలీదు

29) కారుచీకటిని నిలువున చీలుస్తూ
పరుచుకుంటున్న వెలుగుల నాకు నేను కనిపించడంలేదెందుకో..?

30) నా మాటలన్నీ నిశ్శబ్దాన్ని కావలించుకొన్నాయి
గొంతులో ఆగిపోయిన స్వరమేదో రాగంఆలపిస్తూ

31) గుండె చీల్చుకొని నేను పేట్టే ఆక్రందన
నీ శబ్దంలో మౌనంగా రోదిస్తూ కలిసిపొయింది

32) ఉప్పెనలా ముంచే నీ ఙ్ఞాపకాలతో
నా మనసంతా కన్నీటితో తడిచిపోతుంది.

33) నిజానికి మనసెప్పుడూ గాజుపలకే
పగులుతూనే ఉంటుంది..నేవెన్ని సార్లు పగులగొట్టినా...?

34) ఆలోచనల సాయంతో ఆశయాల మెట్లు ,
ఒక్కొక్కటి ఎక్కుతూ గమ్యాన్ని చేరుకోలేక జారిపోతున్నా..?

35) ఏకాంతంలో నీతో ముచ్చట్లు చెపుతూ
ఒంటరితనంలో నిన్ను తలుచుకుని దుఃఖిస్తూ వుంటాను

36) పలకరింపు సమాధానాలన్నీ కుశలాలే
మరి ఇక్కడ కనిపిస్తున్న శకలాల ఆనవాళ్ళేంటో.

37) గుండెలోకిజారే అశ్రువులు గర్భంలోకి చేరితే
మనిద్దరి రహస్యాలను విప్పుతూనే ఉంటుంది

38) కంటతడిని గుండె అడుగున దాచి
గుండె వ్యధను మునిపంటి అంచున మిగిల్చనులే.

39) బాషపై పట్టు లేదు పదాలు తడుముకుంటాను!
భావంనా భాద్యితే అయినా ..గుండె చప్పుల్లే నా అక్షరాలౌతాయి

40) గమ్యాలు వెతుక్కుంటూ సాగుతున్న ప్రయాణంలో
వెనుక్కు తిరిగి చూసుకుంటే అంతా సూన్యిం కనిపిస్తుంది ఎందుకని

41) కొన్ని క్షణాలను దోసిట్లో నింపుకుని
ఎకాంతంగా నన్ను నేను అభిషేకించుకోవాలనిపిస్తుంది

42) నీవు కన్నీరు ని కాలానికొదిలేసి
బాధల బరువులు దించుకుని పారిపోయా వెందుకనో

43) వాడిపోతానని పువ్వుకి తెలుసు
మగువ తలలో చేరి నలిగిపోవడానికే సిద్దపడుతుంది

44) నా లోని అంతర్మధనం లో ఇలా నాలో నేను
నలిగి పోతున్న క్షానాలు ఎన్నని చెప్పుకోను చెప్పు

45) బిగిసిన రక్కసి కాలం కౌగిలిలో
గుంబనంగా ముసురుకున్న నా ఒంటరితనం

46) ఈ కాలచక్రం దయలేని కసాయిలా
నా జ్ఞాపకాలను తొక్కుకుంటూ కదిలిపొతూనే వుంది.

47) నా కలల వనం కన్నీరు పెట్టింది
ఆ వనంలో నెమ్మదిగా నడుస్తున్న నేను ఎటువెళ్ళాలో తెలీక....

48) ఒకరి కలలోకి ఒకరం ప్రతిరాత్రి
నిరాటంకంగా దూరిపోవచ్చు ఎందుకంటే నిజం కాదుగా

49) నిశ్శబ్దంలో మరో నిశ్శభ్దాన్ని మోస్తూ ఓంటరిగా నీకోసం
నడకా సాగిస్తున్నా ఈ చిమ్మచీకట్లో గమ్యిం చేరుకుంటా నన్న ఆశలేదులే..?

50) కొన్ని జ్ఞాపకాలు చిదిమినప్పుడు కలిగే నొప్పిలో
తెలియని ఆలొచనలనుంచి గతాన్ని తవ్వుకుంటున్నాను

51) బాధలో ఒరిగిపోతూ... సంతోషంలో కరిగిపోతూ
మరణం మనకు ఓ జ్ఞాపకంలా మిగులుతుంది కదూ

52) మనిషికి మరణం ఉన్నట్టు...
మనస్సుకు మరణం ఉంటే ఎంతబాగుంటుందో..

53) నిన్ను చూసిన కళ్ళకు కన్నీరు మిగిలింది.
దాచుకున్న జ్ఞాపకాలతో గుండెకు గాయం అయింది

54) అనునిత్యం.. పోరాడుతోన్న ఓ జ్ఞాపకాన్ని నేను
జరుగుతోన్న నిజం లో నేను అబద్దంతో పోటీ పడలేక మౌనంగా ఉన్నాను

55) అబద్దాన్ని.. అబ్బురపరిచే..హంగుల రంగులతో..
అవేనిజాలనుకుంటున్న..నీ మనసుని..నేనెలా మార్చగలను ఏమార్చగలను

56) కరిగి పోయిన కాలంలో నా కన్నీటి సాక్షిగా,
మన గతాన్ని జ్ఞాపకంగా మార్చినా ఎక్కడో ఏదో తెలియని అలజడి

57) ఏ రూపం లేకుండా గతిస్తున్నా అక్షరాలు
కొంత కాలం గా అజ్ఞాతం చేస్తున్నాయి నేనేవరో తెలియనట్టు

58) గుండె పచ్చి పుండుగా మారినప్పుడు
వేదన నిశీదిని ఆక్రమించినప్పుడు నీవే గుర్తుకొస్తావు

59) ఒంటరితనం లో నీజ్ఞాపకాలు
గుండె పచ్చి గాయంలో చేరి బాదిస్తుంటాయ

60) గాయపడ్డ నా మనసు
గతంలోనే నిలిచిపొయింది ముందడుగు వేయలేక

61) ఒక్కొ జ్ఞాపకం గాజుపెంకులా మారి
హృదయాన్నిగుచ్చి గాయాల మయం చేస్తున్నాయి

62) చెంపలపై మౌనంగా జారుతున్న కన్నీరు
గుడెళ్ళో గాయం పైచేరి ఓదారుస్తున్నట్టుంది.

63) రాలిపడుతున్న అనుభూతులు గాయాలైయి
మనసు పొరల్లో జ్ఞాపకాలుగా రోదిస్తున్నాయి.

64) మన ఎడబాటు గాయంమై
మరువలేని గతాన్ని జ్ఞాపకంలో దాచింది

65) ఏడుస్తున్నాను అని తెల్సి మరీ ఏడిపిస్తున్నావు
అందుకే నిన్ను నా మనసు తెల్సిన మనిషి అన్నా తెలుసా..

66) ఇన్నిసార్లు ఓడిపోయాను కాబట్టేమో
నాకు ఇంక అస్సలు గెలవాలనిపించడం లేదు

67) నిశ్శబ్దం అలముకున్నఏకాంతలో
నీతో మాట్లాడుతునే ఉన్నా నామాటలు వినిపిస్తున్నాయా

68) నన్ను నేను ఎప్పటికప్పుడు
ఖాళీ చేసుకుంటున్నా ఎప్పటికైనా నీవొస్తావని

69) మౌనమే భాషై.. అంతరంగంలో ఆలాపనై
వెతుకుతూనే ఉన్నా నా అన్వేషన అగదు వీవు కనిపించే వరకు

70) ఎరుపు జీరలు బారిన నా కళ్ళ లోగిలి,
విశ్రాంతిని కోల్పోయినా...నీకోసం వెతుకుతూనే ఉన్నాయి

71) నా మనస్సాక్షి ఎప్పుడూ ఓడిపోతూనే ఉంది
నీ ఆనందంకోసం..నిన్ను మనిషిగా గెలిపించడానికి

72) జ్ఞాపకాలన్నీ లైబ్రరీగా దాయాలంటే,
గాలి కూడా చొరబడని మరో ప్రపంచాన్ని సృష్టించాలేమో..?

73) అనుభవాల్ని అక్షరాల్లోకి తర్జుమా చేస్తున్నప్పుడు
నేను మళ్ళీ మళ్ళీ పుడుతుంటాను అప్పటికప్పుచు చచ్చిపోతూ ఉంటాను

74) జీవితమనే ప్రోగ్రాం రాసిన దేవుడు
చావనే బగ్‌ని మాత్రం సరిచెయ్యకుండా వదిలేసాడు

75) నీ గుండెకి కళ్ళు లేవు
అందుకే నీ మనసుకు కన్నీటి విలువ తెలియదు...?

76) అణుక్షణం ఆత్ర్రం నాకు
ప్రతి పుటను నీ ప్రేమతో తీర్చిదిద్దాలని.

77) కొన్ని ప్రశ్నలు నన్ను ఎప్పుడూ నిలదిస్తూనే ఉంటాయి
నీకోసం ఎప్పుడూ నా ఆలోచనలు ఎగిసిపడుతూనే ఉంటాయి

78) నాదేంటో పిచ్చి మనసు కదూ
అవును కాదుల నడుమ ఊగిసలాడుతూనే వుంటుంది...?

79) నేను మౌనాన్ని ఆశ్రయించాను
నీతో మాటలతో యుద్ధానికి దిగలేక

80) నువ్వు దోచుకెళ్ళిన నా మనసు గోడల మధ్య...
నీ భావాలను బంధించ లేను..నన్ను నేను దాచుకోలేను నేనంతే మరి

81) అనురాగం అంతరంగాలైన నీ తనువు నీదైందిగా
అయినా కాంక్ష లాసజ్య కౌగిలితో నిండి నీ స్త్రీత్వము నేడు ఏమైందో చెప్పవూ

82) వైరాగ్యిం నిరాశ నిస్పృహల నిర్వేదంతో నిండిన....
ఈ పనికిమాలిన గుండెను ఎవరైనా తీసుకోరూ

83) చావుని దగ్గరగా చూడాలని ఉందా
అయితే నీతో స్నేహం చేయాల్సిందే

84) ఎవ్వరి ముసుగు తీసి చూసినా
ఏడుస్తూనే వున్నారు.. కళ్ళకు చీకటిని చుట్టేసుకుని

85) ఒంటరితనాన్ని నాకు పరిచయం చేసి
పరిచయం చిరునామా మార్చుకుంది ఎందుకో

86)కలయికలూ కన్నీటి వీడ్కోల నడుమ
కాలాన్ని కర్కసంగా ముక్కలు ముక్కలు చేస్తున్నా.

87) కాలం కొలిమిలో క్షణాలు కరిగిపోతున్నాయి
నేను కాలగర్బంలో కల్సేలోపు ఒక్కసారైనా నిన్ను చూడగలనా.

88) మదిరపాత్రకు ఎప్పుడు చిల్లులు పడ్డాయో
జ్ఞాపకాలన్నీ ముత్యాలై దొర్లుతున్నాయో చూడు

89) వదిలించుకుందామంటే వదలనివి..వదల్లేనివీ కొన్నైతే
వదిలించుకోవాలనే కోద్దీ బిగుసుకునేదీ నీతో నా స్నేహమే కదూ..

90) ఆనందాలు అక్రోసిస్తున్నాయి
గుట్టలుగా మారిన నిరాశా శిధిలాల్లో చిక్కిన మనస్సాక్షిగా..

91) చీకటి నిండిన ఏకాంతంలొ
నీకోసం ఎదురు చూడని రోజు క్షనం లేదంటే నమ్ముతావా..?

92) ఎదలో వ్యధగా మసలిన జ్ఞాపకం
రెప్పల మాటున కన్నీరై ఒదిగి౦ది నిన్నే తలస్తూ

93) ఓయ్ నేను కవితలు రాస్తున్నా అంటే
కన్నీళ్ళు చూపించు అంటావేం.. కవితలు రాస్తే అవేవస్తాయా..?

94) నీ ఊహల అలికిడైతే చాలు
గుండె కొట్టుకోవడం మానేసి నీకై ఎదురు చూస్తుంది

95) నన్ను ఊరడిస్తావు అనుకున్నాగాని
నాకళ్ళను కన్నీళ్ళ ఊటబావి గా చేస్తావనుకోలేదు ప్రియా

96) ఎరుపు జీరలు బారినపడ్డ కళ్ళ లోగిలిలో
కనురెప్పల్ని మూయనివ్వనంటూ పంతం పడుతోంది "జ్ఞాపకం

97) నాలో నుంచి నేను బయటకొచ్చాను
నీవు ఇక్కడెక్కడో ఉన్నావని తెల్సి..ఇంతకీ ఉన్నావా ..? లేవా..?

98) మనసును చదును చేసుకొన్నా..
జ్ఞాపకాల విత్తనాలేసి కొత్తవి సృష్టిద్దామని

99) నన్ను ఎప్పుడూ ఓడించడం నీకలవాటు
ఓడిపోతూ నిన్నుఎప్పుడూ గెలిపించడం నాకలవాటు

100) నీ కెంత స్వార్ధం సంతోషాన్నంతా మూటకట్టి అందరికీ ఇచ్చి
విషాదాన్ని మాత్రం నా మనస్సుమీద విరజిమ్మి నవ్వుతున్నావెందుకో

101) కాలంతో పాటు కలసిపోతున్న క్షనాల్లో నీకోసం తపిస్తు
నన్ను పారేసుకున్నా నాకు ప్రతిఫలంగా శవపేటిక ఇచ్చావుగా..?

102) మోయలేని భారంతో...మనసు కృంగిన ఈ రోజు
కొండంత ఓదార్పు ఇచ్చే మనస్సు కాస్త దొరుకుతుందా ఎక్కడైనా..?

103) నామదిలో నిశ్శబ్దపు ఒంటరి రాత్రి నన్ను వెక్కిరిస్తుంది
జ్ఞాపకాల దొంతరలు కదిలిన చప్పుడు బరించలేని భారంగా మారిందీరోజు

104) నీ మౌనం చూసి మౌనం అంటే విసుగొచ్చింది
నేను మౌనానికి చేరువయ్యాను మరణాన్ని చేరుకోలేక..?

105) నా మనస్సాక్షి ఎప్పుడూ ఓడిపోతూనే ఉంది
నిన్ను నిన్ను గా గెలిపించడానికి....నేనేమైపోయినా పర్వాలేదు....?

106) మనసులోంచి అక్షరంగా బైటపడే వరకూ నన్ను
నరక యాతన పెడుతున్నాయి ఈ అక్షరాలు గుచ్చేస్తున్నాయి గుండెల్లో.?

107) నా మనసుకు ఏ దెబ్బ తగిలిందో ఏ నొప్పి కలిగిందో
ఆలోచనే లేదు నీకు నా కంట కన్నీరు తెప్పించాలన్న ఆరాటం ఎందుకు నీకు..?

 108) నీ మనసుకి చదువు రాదనుకుంటా
నా మనసుని చదవటం రావట్లేదు అయినా నామనస్సుతో నీకు పనేంటి..?

109) కన్నీళ్ళు తాగి కొనఊపిరితో ఉన్న జ్ఞాపకాలను
గతం పొలిమేరలో సజీవ సమాధి చేస్తున్నాను ఇంక బ్రతకాలన్న నమ్మకంలేక...?

 110) రోజుకో గాయమవుతోంది నా మదికి
నీకోసం ఎదురు చూసిన ప్రతిసారి ఎదపై గాయాలే మిగులుతున్నాయి..?

111) కంటికి కన్నీటి తెరలు కట్టినా కూడా లోపలి బాధను
కనిపించకుండా చెయ్యలేక పోతున్నాను బ్రతికున్న శవాన్ని కదా ఇప్పుడు...?

 112) అనుభవాల్ని అక్షరాల్లోకి తర్జుమా చేస్తున్నప్పుడు
నేను మళ్ళీ మళ్ళీ పుడుతుంటాను ఎందుకో తెలీదు మళ్ళీ బ్రతకలేక చస్తుంటాను

 113) నా గుండె చనిపోయి వసంతాలు గడుస్తుంది
బ్రతుకుతానని బ్రతికిస్తావని ఆశ ఎప్పుడో చనిపోయింది..?

 114) నీ ప్రేమ నిండిన మాటలకోసం వేచి చూసేప్పుడు
నీలో పలికిన మౌనం నన్ను ఎప్పుడూ నిర్జీవున్నిగా మర్చేస్తూనే ఉంది,...?

 115) కన్నీటిస్నానం చేసొచ్చిన కనులు కళకళలాడుతూ కనిపిస్తాయేమో నీకు
మళ్ళీ మళ్ళీ ఏడిపించడానికి నీవు ఎప్పుడూ సిద్దం అవుతూనే ఉంటావు ఎందుకని..?

 116) నిజాన్ని కూడా అనుమానంగా చూడాలనిపిస్తుంది
కొన్ని స్నేహాలు చేస్తే నమ్మకాన్ని కూడా నిందించాల్సిందే కొన్ని నిజాలు వింటుంటే..?

 117) చలి రాత్రి చెలికాడితో సరసాల్లో ఉన్నట్టుంది
మాట వినే తీరిక లేదు...నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమూ లేదు..?

 118) నీవు కావాలంటూ మనసు తడబడుతుంటే
నను వదిలేపోయీ మరొకరిని చేరాలని నను ఒంటరి చేసావు కదూ ..?

119) నీరాశతో నిండిన నిశ్శబ్దపు శిలగా మారాను
కన్నీటి జలంలో మునిగిపోతున్నా మరిక ఎప్పటికీ తిరిగిరానేమో

 120) గతం జ్ఞాపకాలుగా మట్టిపొరల్లోకి చేరిపోయింది
నీ జ్ఞాపకాల్లో మరొకరు చేరారుకదా అందుకేనేమో  కదూ