. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, February 15, 2014

ఒక హృదయం ఇలా నిదీస్తోంది. ( నిజాలను దాచుకోలేక )

               అదేమిటో గానీ, తాను ప్రేమించిన, తన ప్రాణంలో ప్రాణమైన హృదయాన్ని కలవాలనే కోరిక కొందరికి ఒక పట్టాన తీరదు. జీవన వనిలో ప్రేమ పుష్పాలు వికసించాలనే ఆశ ఏ తీరాన్నీ చేరదు. ఊహకైనా అందదు. లోకానికి అంత కఠినమైన మనసుందన్న ఆలోచనైనా రాదు. ఎన్నెన్నో అవరోధాలు అడ్డుపడతాయి? ఎన్నెన్ని సుడిగుండాలు నీ హృదయ నావను నిలువునా ముంచే ప్రయత్నం చేస్తాయి? ఎన్నో అవస్థలు పడి, అన్నీ చేధించుకుని ఎలాగోలా తీరా వచ్చేశామే అనుకుంటే, తాను చేరుకోవలసిన లోకాన్ని అప్పటికే ఎవరో ధ్వంసం చేసి దాన్నో స్మశానంగా మార్చి వదిలేస్తారు. ఒక వాడ కూలి పోతే మరో వాడకు వెళ్లొచ్చు. ఒక ఊరు కాలిపోతే మరో ఊరు చేరుకోవచ్చు. అదేమీ కాకుండా, ఏకంగా నీ లోకాన్నే సమాధి చేస్తే ఆ మనసేమైపోవాలి? ఆ ఆత్మ ఏమైపోవాలి? మొత్తం తన ప్రపంచాన్నే శిధిలం చేసే విధితత్వం మీద, జీవన విధ్వంస కారకుల మీద ఎవరికైనా ఆగ్రహం పుట్టక ఏం చేస్తుంది? గుండెల్లోంచి అగ్ని సరస్సులు పెల్లుబికి రాక ఏం చేస్తాయి?       
                                                                జీవితం అంటే ఎవరైనా ఆకాశంలో మెరిసే నక్షత్రంలా, న ందనవనంలో పరిమళాలు వెదజల్లే పువ్వులా ఉంటుందనుకుంటారు గానీ, ఒక శిధిల సౌథ«ంలా, స్మశానపు బూడిదలా ఉంటుందనుకోరు కదా! చుట్టూ స్మశానం అయిపోవడమే కాదు. తానే ఒక బూడిద కుప్పలో కలిసిపోవడం, తన మంటల్లో తానే కాలిపోవడం ఏమిటిదంతా? ఏ గ్రీష్మమో వచ్చి ఆకులూ, పూలు రాలిపోతుంటే ఎవరూ అంతగా కుమిలిపోరు. ఏముందిలే మళ్లీ వసంతం వస్తుంది. మళ్లీ చెట్టు చిగురిస్తుంది. ఆకులు పుట్టుకొస్తాయి? పూలు వికసిస్తాయి అనుకుంటారు.కానీ ఏ ఉప్పెనో వచ్చి మొత్తం వృక్షాన్నే కూకటి వేళ్లతో పెకిలించి వేస్తుంటే ఇంక ఆశలేముంటాయి ....ఆకాశం శత్రువై అగ్ని వర్షం కురిపిస్తే భూమ్మీద ఎక్కడో తల దాచుకునే ప్రయత్నం చేయవచ్చు. సరిగ్గా అదే సమయంలో భూమి కూడా నీ శత్రువైపోతే అప్పుడేం చేస్తావు? నవ్వు నివసించే నేల, నువ్వు చరించే నేలం, నీ శ్వాస సాగే నేల, నీ ధ్యాస నిలిచే నేల ఇదే నీ శత్రుభూమి అయిపోయాక ఇంక నీ మనుగడెక్కడ? నీ గమనం ఎక్కడికి? నీ ఆరాటం దేనికి, నీ పోరాటం దేని మీద? నీ ఆశల గుడారం, నా ఆరాటాల వేదిక, నీ పోరాటాల క్షేత్రం అదే నీతో వైరం పెంచుకుంటే, నీ మీదికే యుద్ధానికి తలపడుతుంటే ఇంక ఎవరినైనా ఎలా అర్థం చేసుకుంటావు? నీ వాళ్లెవరో, పరాయిలెవరో తేల్చుకోలేక తల వ్రక్కలైపోవడమేగా తరువాయి ఘట్టం. ఈ మాత్రం దానికి ఇక్కడే నీ స్వర్గం, నీ ఆనంద దుర్గం అంటూ మనిషిని ఈ భూమ్మీదికి ఎందుకు పంపించిన ట్లు? భూమ్యాకాశాలను శత్రువులుగా నిలబెట్టి ఇంకా అతిధి ఆహ్వానాలెందుకు? తన ప్రేమ సామ్రాజ్యం తన చేతికి అందినట్లే అంది హఠాత్తుగా దూరమైపోతే ఈ ప్రపంచం ఉత్త శూన్యంలా కాక మరేమనిపిస్తుంది? ఇన్ని వైరుధ్యాలు చూశాక, ఇన్ని విషపరిణామాలు చవిచూశాక ఇంకా ఈ జీవితం మీద ఎవరికైనా ఆసక్తి ఏముంటుంది? జీవితం కన్నా మరణించడమే మేలనే భావన కలగక ఇంకేమనిపిస్తుంది? ఒక బహదూరపు బాటసారిని మార్గ మధ్యంలోనే ఆపడంలోని మర్మం ఏమిటి? భగవంతుడు అనుసరిస్తున్న ఆ ధర్మం ఏమిటి? ఏం చేసినా దానికో ఫలితం ఉండాలని ఎవరనైనా కోరుకుంటారు? సేధ్యం చేసిన వాడు ధాన్యం పండాలనుకుంటాడు. కలం పట్టిన వాడు తన కావ్యం పూర్తి కావాలనుకుంటాడు. ప్రయాణం చేసిన వాడు తన తీరం చేరాలనుకుంటాడు. ఏదీ ఆశించకుండా ఎవరైనా ఏ కార్యమైనా ఎందుకు చేపడతారు? కానీ, అదేపనిగా హృదయాల్ని గాయం చేస్తూ వె ళ్లే వారికి ఏ లక్ష్యం ఉందనుకోవాలి. దాని వల్ల వారికి ఒరిగేదేమిటి? ఎదుటి వారు కన్నీరు మున్నీరయ్యేలా చేసి ఎవరైనా ఏం బాపుకుంటారు? ఆశే కదా మనిషినైనా లోకాన్నయినా నిలబెట్టేది? ఆ ఆశా సౌధానికే ఎవ రైనా నిప్పంటిస్తే ఏమవుతుంది? హృదయాలు అగ్ని గుండాలవుతాయి. ఆ ఆక్రోశంలోనే ఏమాశించి ఇలా చేశావ ని ఒక హృదయం ఇలా నిదీస్తోంది.