. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, December 1, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(31)

1)  పెదవిపై ఉండాల్సిన నీ నవ్వు..కన్నీరుగామారి
చెక్కిలిపైకి జారి గుండె లో ఏదో భారం దిగినట్టుందేంటో..?
 

2) నువ్వు నేనుల మధ్య
నీ మనసు చేసిన గారడీలో నేను గాయపడ్డాను


3) నన్ను కాదని బయటకెల్లింది నీ జ్ఞాపకం
ఏకాంతాన్ని కప్పుకుని నాలోనేనే దూరిపోయాను..నాకు నేను కనిపిస్తానేమో అని


4)  నా గుండెలోతుల్లోకి గతం తొంగిచూస్తూ
చేజారిన క్షణాలేరుకుంటూ జ్ఞాపకాల అరల్లో గాయం అయి మిగిలిపోయింది


5) చేజారిన దాని కోసం బాధ పడుతూ..ఆవేశపడుతూ
అందని దానికై ఆరాటపడుతూ...అందోళన పడితే గతంతిరిగి వస్తుందా


6) నిన్న కోసం మొన్న...నేటి కోసం నిన్న
రేపటి కోసం నేడు..బాధ పడుతూ జాలి పడుతూ..పరిగెత్తుతున్నా...?


7) అదేంటి నిజాలని నాకు చెప్పి
అబద్దాల రక్తపు మరకలను నాకంటించి పోతున్నావు


8) నీవు పారేసిన అక్షరాలను ఏరుకుంటున్నా
అవన్నాజ్ఞపకాలై నన్ను ఓదారుస్తాయేమో నని చిన్నిఆశ....?


9) ఆనందంగా నవ్వాలనుకున్న ప్రతిసారి
ఎదురు పడి ..ఎదురు దాడిచేస్తుంటే..నవ్వాలా .ఏడ్వాలా....?


10) అంతరంగంలో నిరాశనే సముద్రంలో మునిగిపోతున్నా
నీజ్ఞాపకాలు నన్ను కాపాడతాయన్న నమ్మకం సన్నగిల్లుతొంది


11) ఇప్పటిదాకా ఎక్కడో దాక్కున్న చీకటికి దైర్యిం వచ్చింది
అబ్దద్దాలకు వేలాయగదా....ఎంచక్కా కాంతిని తొక్కేసి చికటిదుప్పటి కప్పేసింది


12) నీ సమక్షంలో నా జ్ఞాపకాలను పోగుచేసుకొని
అన్నీ నిజాలు చెప్పాలని ఉన్నా చెప్పలేని మూగవాన్నైయ్యానెందుకో


13) పరిచయం ప్రేమగా మారి వైఫల్యం కత్తిలా గాయం చేస్తే
నెత్తుటి మరకలతో బయటపడ్డ అభాగ్య ప్రేమికులు ఎంతమందో కదా..?


14) నా జ్ఞాపకాల అర..నేడు ఊహల తెర గామారి
గుండెల అరల్లోని జ్ఞాపకాలు ... కన్నీటి పొరలై మిగిలాయి ఎందుకో....?


15) నిదురలో తన జ్ఞాపకాలు నను తాకితే ఉలిక్కిపడి లేస్తా
ఏంటో మరి అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న రాత్రులు అలా జారిపోతున్నాయి?


16) ఎక్కడో నీవున్నావు ... ఇక్కడ నేనున్నాను
మరి మనజ్ఞాపకాలు మాట్లాడుకుంటూన్నాయేంటో కదా...?


17) ఏంటో జ్ఞాపకాన్ని అమాంతంగా నాలోకి లాక్కొని
మనసులోకి ఒంపుకొని తాగాలాని చూస్తే .. మత్తెక్కుతోంది ఏంటో


18) దట్టమైన ఆలోచన మేఘాలు కన్నీటితో అల్లుకున్నాయేమో
ఆలోచనల ఆవిరి కళ్ళలో కమ్ముకొని ముసురుకొని ఈరోజు కూరుస్తున్నాయి


19) ఏంటీ శూన్యతలోకి తదేకంగా చూస్తున్నావు
సుదూరాన ఆ తీరం లో కనిపించేది నేను కాదులే భయపడకు


20) నేనేంటో తెలియని నన్ను నిర్దాక్షిణ్యంగా
ఒంటరిని చేస్తాయి నీ జ్ఞాపకాలు.... పట్టుకుందామంటే దొరకవేం..?


21) అలంకారాలూ, అతిశయాలు లేని కవితను
నేను అన్ని కాలాల్లో ఆస్వాదించలేను కాలాన్ని బట్టి భావం మారిపోతుంది


22) ఊహలు.. ఆశలు.. గత కాలపు
కర్కసపు జ్ఞాపకాల కౌగిలిలో నలుగుతున్నాయి


23) అందరి కన్నీళ్ళు తుడిచేద్దామని చూస్తావు
నీవు చేసిన అవమానాలకు రక్తశిక్తమైన నీచేతుల్ని ఓసారి చూసుకో


24) హ్రుదయ సవ్వడి విన్పించే క్షనాల్లో
నిశ్శబ్దం మౌనమై నిర్జీవంగా చీకట్లోదాగింది


25) మాటలు రాయలేని నా మౌనంలో
మనసులోనే దాచిపెట్టి అక్షరాల గుట్టలను పేరుస్తున్నా


26) నీవు చేస్తున్న అవమానం..నాలోని సున్నితత్వాన్ని గేలిచేస్తుంది.


27) నీ విసిరేసిన ప్రతి జ్ఞాపకంలోంచి నేను తొంగి చూస్తుంటాను
నీ ప్రతి జ్ఞాపకంలో నేనే ఉన్నానన్న గ్యారెంటీలేక..నిరాశగా స్తేజంగా నేను


28) వర్షం కురుస్తున్న ఈ చల్లని ఉదయంలో
నను తాకిన చిరుజల్లుల సందడి మనసు ఉరకలెత్తిస్తోంది


29) నీవు పదాలను పేర్చి ఆయుదంగా మార్చావు
మనసుని పేల్చటానికి మాటల సూలాలతో గుచ్చేశావు..


30) మాటల కొరడాలతో గాట్లుపడిన మబ్బుతునకలై
కార్చేకన్నీరు చిరుజల్లై...హాయిగొలుపుతూనే బురదనీరైపోతుంది మరి


31) నల్లని మేఘాల చిరు సందడిలో చినుకుల జడి
మేరు గర్జనల అలజడిలో మెరుపుల ఒరవడి నీ మాటల్లా


32) చినుకు చక్కిలిగింతలతో కులుకు హొయలలో తృళ్ళింతలు
మనసు జల్లింతల్లో..మదిమాటున దాగిఉన్న మరువలేని జ్ఞాపకాలు నిద్రలేచాయి


33)  ఏంటో సమయం జారిపోతుంది....అప్పుడే పడ్డ వాన చినుకులా నాకందకుండా


34)  నేను నేర్చుకున్న భాషలన్నీ మర్చిపోయానిప్పుడు
నీతో మాట్లాడేందుకు ఒక కొత్త భాషని సృష్టించుకున్నా అదే మౌన భాష


35) క్షణాలని కాపలాగా పెట్టి నీ రాక కోసం
అందరినీ అడిగి అడిగి నోరెండిపోయిన ప్రేమ నది ని నేనే మరి


36) ఆలోచన మందగించింది కలం కదలనంటుంది
మది అలజడి గుండెళ్ళో దడ..మౌనంలో కదిలాడుతున్న మాటలు


37) ఏ అక్షరం సరిగ్గా నిలవడం లేదు ఎక్కడ మొదలు పెట్టానో
ఎక్కడ అంతం చేయాలో తెలియని వింత పరిస్థితి ఎందుకనో చెప్పవూ..?


38) నా జీవితమనే "జావా"ప్రోగ్రాం రాసిన దేవుడు,
ఓటమనే "వైరెస్" తొలగించలేకపోతున్నాడెందుకో...కాస్తచెప్పవూ?


39) నీ నిశబ్దాన్ని పోగొట్టడానికే నేను శబ్దంలా మారాను.
అయినా నీలో మార్పులేదు ఇకవస్తుందన్న ఆశకూడా జారిపోయింది..?


40) కన్నీటిస్నానం చేసొచ్చిన కనులు అంటే నీకిష్టమా..?
మళ్ళీ మళ్ళీ ఏడిపించడానికి సిద్దమవుతూ కారనాలు వెతుకుతావెందుకో..?


41) నీవు మనసులో జ్ఞాపకాలను ఎన్నిసార్లు హత్య చేసినా మళ్ళీ
గెలవాలనే ఆశతో బతికొస్తున్నా ఆశతీరునా నీమనసు మరునా..చెప్పవా?


42) నీకోసం ఎప్పుడు ఎదురు చూసినా ఫలితం ఎప్పుడూ అపజయమే.
ఎందుకిలా... అపజయం నా ఇంటి పేరేం కాదుగా..నీవేమన్నా మార్చావేమో కదూ..?


43) కనురెప్పల్లో ఇరుక్కున్న జ్ఞాపకాల నలుసు
ఒకేసారి కన్నీటిలో కొట్టుకుపోతే ఎంత బాగుండో కదా....?


44) నేనున్నానంటూ తట్టిలేపుతున్న ఆ తలపులు
పాతుకుపోయిన ఆ గురుతులు గుండెల్లో గుచ్చుతూనే ఉన్నాయి


45) గుండెల్లో వేలాడుతున్న ఆ జ్ఞాపకాలు
పగిలిపోతే ఎంత బాగుండు...ఆముక్కలు నన్నేం చేయలేవుగా..?


46) నిన్ను తలవకుండ నిమిషమైన ఉండగలనా
నువ్వు వదిలి వెళ్ళిన నా మనసు నాకన్న నిన్నే కోరుకుంటుంది మరి


47) నీవు నా మనసును గాయపరిచావు
అది పూడ్చలేని గాయంగా మారి మనసును తొలిచేస్తుంది


48) ఏంటో కొన్ని క్షనాలకు కదలికలు లేకుండా పోయాయి
నిదుర లేనిరాత్రులు కన్నీటి సంద్రాన మిగిలిన కొన్ని వేదనా తరంగాల సాక్షిగా


49) నీకూ నాకూ మద్య ఆ అడ్డు గోడ ఏంటో
మనిద్దరి మద్యా చేరిన మరోమనిషి ఆనందమా...?


50) నిన్ను పలకరించి పరుగులు పెడదామంటే
వెన్నెల ముక్కలుగా విరిగిపోయి వీడిన మబ్బల్లే కనిపిస్తావు


51) ఒక అందమైన అభద్దం తో నిన్ను నీవు మొసం చేసుకొని
అందరిని కూడా నమ్మారనే ఎంతెలియనట్టు నమ్మకంగా తిరుగుతున్నావా ప్రియా


52) హృదయ ఫలకం మీద నీ జ్ఞాపకాలు
మాయని లోతైన గుర్తులుగా మిగిలిపోయా ఎందుకో..?


53)  అప్పటిదాకా మంచిగా నటించి అన్ని నిజమనే బ్రమలో పెట్టి
ఎప్పుడు ఎవరు ఎందుకు ఎదురు తిరుగి కత్తులు దూసి మనను ముక్కలు చేస్తారో తెలీదు


54)  చుట్టూరా కమ్ముకున్న
చిమ్మచీకటి రాత్రుల్లలో ఈ సమ్మె వాతావరణంలాంటి నిశ్శబ్దంలో      


55)  గుండే చప్పుడే బయంకరంగా వినిపిస్తోంది
నాలుక పిడచకట్టి గొంతెండిన వేసవితనం వెంటాడుతోంది…          


56)  రాత్రుల్లు నాకలలు ధ్వంసాలై కూలిపోడానికి,
నిజాలని పగిలి రగిలి తగలబడడానికి సిద్దమై పోయాయి ఎందుకో


57) నీ జ్ఞాపకాలు తడి చూపులలో నన్ను తడిపేస్తున్నాయి
వెక్కిరిస్తూ సాగనంపుతుంది వెనిక్కి తిరిగి చూడకుండా పారిపొమ్మని


58) గతమెరిగిన జీవితం 'నేను 'ని శాసిస్తుంది
నీవు అనే గతం ప్రస్తుతాన్ని మింగేసి ఒంటర్ని చేసింది


59) ఎద్దేవా చేయడానికో... ఓడావని ఎగతాళిచేయడానికో
మరొకరి వంచన చేరి మదిని చిత్తడి చేస్తున్నావు నీకిది న్యాయమా...?


60) ఒంటరి గుండెల తంత్రులు మీటి
స్వార్దంకోసం మాటలు మార్చిన నిన్నేమనాలో....?


61) అందరూ చేరే చివరి గమ్యం మృత్యువు
ఎప్పుడు ఎటువైపునుంచి నిన్ను కౌగలించుకుంటుందో తెలీదు


62) నిన్నకి నేటికి మధ్య సన్నని పగుల్లలో
తొంగి చూస్తున్న జ్ఞాపకాల వెలుగులు నిన్ను చేరేదెలా...?


63)  నీ జ్ఞాపకాలను నా ఊహల్లో నింపుకుంటూ..
గుండె గాయాలు పూడ్చుకుంటూ పయనిస్తూనే ఉన్నా నీకోసం


64) కోయిలా ఇవాళ పాడోడ్డు వెన్నెల ఈ రాత్రికి రావద్దు
ప్రపంచం బద్దలైనా సరే ఈ ఒక్కసారి నా మనవిని మన్నించండి               


65) నిశబ్దపు నిశిలో నన్ను ఒంటరిగా వదిలేయండి
చీకటి గదిలో మౌనపు ముసుగు కప్పుకొని కాసేపు మనిషినన్న సంగతి మరచిపోయి గడిపేస్తాను          


66) నన్ను నేను మర్చిపోదామనుకున్న క్షనాల్లో
జీవితపు మలుపు మొదట్లో తచ్చాడుతున్న నీజ్ఞాపకాలు మరువనివ్వడంలేదు


67) మన జ్ఞాపకాలు నిజాలని ఒప్పుకోవా
అందుకేనేమో అవి అబద్దాలని తప్పుకుంటున్నాయి


68) చీకటి రాత్రి ఎర్ర సిరా వొలికించి నిజాలు రాస్తున్నా మౌనంగా
అక్షరాలు హాహాకారాలు చేస్తూ నా మనసుమీద దాడి చేస్తున్నాయి


69) అందమైన రాత్రిలాంటి కలలో కరిగిపోతున్నా
మొన్న ఒక పీడ కల నేడు జ్ఞాపకమై తెల్లారితే కన్నీటి చారికలవుతున్నాయి


70) "ంయ్ పైన్ మయ్ బె థె రేసొన్ ఫొర్ సొమెబొద్య్'స్ లౌఘ్..
బుత్ మ్య్ లౌఘ్ ముస్త్ నెవెర్ బె థె రేసొన్ ఫొర్ సొమెబొద్య్'స్ పైన్..!!"



71) ఒరేయి నేను కలాన్నిరా..ప్లీజ్ వదలరా
ఎందుకలా నాగొంతు నొక్కి అక్షరాలకు కక్కిస్తుంటావు


72) నా ప్రేమకు నీవు ఒయాసిస్ అనుకొని ఎంత పయనించినా
నిన్ను చేరలేక పొయాను ఇప్పడే తెలిసింది ఇదంతా భ్రమ అని అదొక ఎండమావి అని


73) అప్పుడు నా ధమనుల్లొ సిరల్లొ నీ ప్రేమను నింపి
ఇప్పుడు నరాలు కోసి రక్తాన్ని బైటికి తోడుతున్నావేంటో


74) సముద్రంతో మన ప్రేమ విషయం చెప్పేశా
అందుకేనేమో కలలాంటి అల నా కాళ్ళ దగ్గరకు వచ్చిమళ్ళీ వెళ్ళిపోయింది


75) నా హ్రుదయం లో నీ జ్ఞాపకాన్ని
నా కలం లో సిరా గా నింపుకొని రాసుకొంటున్నా


76) నీవునాకు దూరమైన క్షనాలను తలచుకొన్ని వేల చావుకి చేరువకావాలనిపిస్తుంది


77) తనువంతా నీ ఆలోచనలతో భారంతో వేడెక్కే నాహృదయం
నీ వెటకారపు మాటలు అవమానాలు నా గుండెను మండిస్తున్నాయి


78) నీవు ఆనందంగా ఉన్నప్పుడు నేను గుర్తుకురాను
నువ్వు భాధల్లో బందీవైనప్పుడే నీ మది తలపుల తలుపులు తడతాను


79) కంటికి కనపడని జ్ఞాపకాలు అడుగడుక్కీ అడ్డు పడుతున్నప్పుడు
తపించే వెర్రి హృదయం బెంగ బాధగా భారంగా మారినపుడు నా తపన నీకేం తెల్సు


80) ఎప్పుడు కరుగుతాయో కలలు..ఎప్పుడు కలవరపెడతాయో
నీజ్ఞాపకాలు ఎప్పుడు మురిపిస్తాయో..ఎప్పుడూ కరిచేస్తాయో తెలీదు


81) మనసుకు ఎక్కడ దెబ్బ తగిలిందో ఏ నొప్పి కలిగిందో
తెలియడంలేదు కంట కన్నీరు ఆపాలన్న ఆరాటం లో ఎదో కోల్పోతున్నా


82) నాడు ఒట్టి ఒంటర్ని..మొన్నటి నీ పరిచయానికి అపరిచితుడ్ని
నేటి ఏకాంతానికి చిరకాల ఆప్తమిత్రుడిగా మారిపోయా తప్పదుగా మరి


83) నా మాటలకి మౌనం నేర్పాను నీ మాటలే కత్తులౌతాయని
ఆ నిమిషం తెలియలేదు గొంతులొ గుచ్చుకున్న జ్ఞాపకాల సాక్షిగా


84)  మనస్సు నవ్విందో మరిచి పొమ్మందో
వెళ్ళలేక వదిలెళ్ళిందో కాదనలేక అవుననలేక తల్లడిల్లిందో తెలీదు..?


85) ఒరేయ్ ఏడవకురా కన్నీల్లొస్తాయి
మరీ అతిగా నవ్వకు కన్నీళ్ళే వస్తాయి .. దీనమ్మ జీవితం అన్నీటికీ కన్నీళ్ళేనా..?


86) నేను నేర్చుకున్న భాషలన్నీ మర్చిపోయానిప్పుడు
నీతో మాట్లాడేందుకు ఒక కొత్త భాషని సృష్టించుకున్నా అదే మౌన భాష


87) ఒకప్పుడు మనమాటలు మంచు ముత్యాలై గుండెల్లో జాలువారేయి
ఇప్పుడేంటీ అవి జ్ఞాపకాల్లో చేరి అగ్నిగోలాలుగా మారి గుండెను తగలబెడుతున్నాయి


88) ఎందరి దుఃఖాన్ని మేఘంగా ధరించిందో
ఒక్క ఉరుముతో కన్నీటి జళ్ళు కురిచేస్తుంది మేఘం భాదను తట్టుకోలేక


89) మేఘాల భారాన్ని చినుకుల్లా మర్చే
ఆకాశానికి తెలుసు అసలు రహస్యం....అదేంటో చెప్పవూ...?


90) నల్లటి మబ్బులో పుట్టి మట్టిలో కలిసిపోయే చినుకులు
మధ్యలో కోటానుకోట్ల అస్తిత్వాలుగా విడిపోవడమెందుకో కాస్త చెప్పవూ...?


91) నా గుండెల్లో దిగబడ్డ ప్రశ్నల్ని పెకిలించాలని చూస్తావేం...?


92) నీవు లేని నేను ఎందుకని నన్ను నేను విసిరేసుకున్నా
అవేనేమో ఆకాశంలో చుక్కలై నీకోసం వెతుకుతున్నాయి


93)  ఎప్పుడూ నీ పిలుపులా మ్రోగే మొబైల్ ఫోన్
నీ హ్రుదయంలా సైలెంట్ మోడ్ లోకి వెల్లిపోయింది ఎందుకో


94) చుట్టూ చిమ్మచీకటి వెలుతురు అస్సలు లేదు
నా హృదయాన్ని తగలబెడితేగాని వెలుగులో నిన్ను చూడాలేనేమో


95)  నీవు దూరమై రోజులైనా నాకు మాత్రం మూడు కాలాలు
ఆరు ఋతువులు చివరగా లక్ష నిస్పృహలు గా మిగిలిపోయానని పిస్తోంది


96) నా చుట్టూ నిశ్శబ్దపు రాజ్యం
నా ఆలోచలన్న్నిటిని పగులగొట్టి నాకు నేను విదించుకున్న శిక్ష మౌనం                       



97) నా మౌన సామ్రాజ్యంలో  ఒక్కడిగా మిగిలిపోయా
ఆశల వలలో చిక్కుకుపోయిన నా ఆశలన్నిటిని ముక్కలు గా చేసి తగులబెట్టాను


98) నీవస్తావని ఎదురు చూసి చూసి  ఆశ చచ్చిపోయింది
అందుకేగా మౌనమనే చీకటి గుహలో నన్ను నేను కట్టేసుకున్నా


99)  నీకోసం ఆలోచిస్తు ఆవేశపడిపోతుంటా అప్పుడు నా నుదుటి స్వేదం
నాగుండెల్లో చేరిన నీజ్ఞాపకాల అలజడికి   గుండెలపైకి జారి నిశ్శబ్దాన్ని చిద్రం చేస్తుంది


100) అవును కాదుల నడుమ ఊపిరి సలపనంత ఊగిసలాట…
ఊపిరి ఆడటంలేదు గుండె చప్పుడు కూడా భరించలేక పోతున్నా


101) నేను నీజ్ఞాపకాలను పలుకరిస్తున్న క్షనాలలో
ఏంటో కాలం నన్ను పట్టించుకోకుండా పరిగెత్తుతూనే ఉంది నీలా


102) రాత్రుల్లు కొన్ని ప్రశ్నలు కౌగిలించుకుంటాయి ఇప్పటికీ
ఉక్కిరిబిక్కిరి చేసి నిద్రను చెడగొట్టి ఉదయం అయ్యేదాకా వదలవు


103) నా గుండెలోపల చీకటిగదిలో నీవేం చేస్తున్నావు
కష్టపడి నీ జ్ఞాపకాల సౌదాలను నీవే కూల్చేస్తున్నావా


104) అమ్మను సైతం అమ్మజుపే నమ్మక ద్రోహులను
నయవంచకులను చుట్టూ పెట్టుకొని మురిసిపోతున్నావు జాగ్రత్త


105) కసాయి స్నేహంలో ఇరుక్కపోయిన నష్ట జాతకున్ని నేను
బైటికి రాలేను ...మోసపు మనసు గదిలో నాకు గాలాడటంలేదు


106) ఆరోజు ఉదయం ఏదో బరువుగా ఉంది
విరిసిన పుష్పాల పై రాత్రి మిగిల్చిన కన్నీటి చుక్కల్లా మంచుముత్యాలు


107) నిశ్శబ్దపు అంచులమీదకు జారిన జ్ఞాపకాలు
నిప్పు కణికలై మనసులో మంటలు రేపుతున్నాయి


108) నా తలపులను తెలుసుకోలేనప్పుడు
నా భాష వెనకన భావం బరించరానిదిగా మారినప్పుడు
ఈ నిఘంటువులెందుకు ? గుండెకోతతో రాసే ఈ రాతలెందుకు..?


109) నా మనస్సును పావురం అంత ప్రేమగా చూసుకొని ఇప్పుడెందుకు
రాళ్ళేస్తున్నావు... గాయాలవ్వలనా తగిలిన గాయాలు సరిపోలేదనా...?


110) మౌన భాషలో..మనసు ఒదిగిపోతుంది..
కళ్ళుమూసుకున్న .. మనసు నీకోసం తడుముతోంది


111) చిన్న శబ్దానికి పెదవులు భయపడి మనసు మూగబోతే
నీజ్ఞాపకాలు చేస్తున్న అలజడులను అస్సలు తట్టుకోలేకపోతోంది నా హృదయం


112) నా కలల్ని ముక్కలు చేసి కవితల్ని చెక్కుతున్నా గాని
ఎందుకో హృదయానికి తగిలిన గాయాలే కనిపిస్తున్నాయి అందులో


113) పగిలిన నా గుండె ముక్కలపై నడుస్తున్న
నీ పాదాలకు ఆ ముక్కలు గుచ్చుకుంటాయేమో అని భయంగా ఉంది


114) నీ కోసం నిరీక్షిస్తూ కలల్ని నెమరువేస్తూ శూన్యం లోకి చూస్తూ,
కర్సైపోతున్న కన్నీటి సాక్షిగా నీకోసం కలల పొలంలో భ్రమల నీడల్లో ఎదురుచూస్తున్నా


115) అక్షరాల బరువుతో అలసిన మనసు పుస్తకంలో
ఎందుకు మనిద్దరం అన్ని ప్రతిపేజీ చించి తగలేశావు


116)  నీ మౌనపు తుఫాను తాకిడికి
గుండెనరాలు తెంచుకొన్న భావాలు బలౌతున్నాయి


117) నా హృదయాన్ని పంచనామా చేసి చూడు
నీవు ఇప్పటిదాకా చూడలేని భావాలు తరచి చూడచ్చు


 118) నిమిషాలు..క్షణాలు..గోళీల్లా దొర్లిపోతుంటే..
నాలో నేను..నాతో నేను పలుకరించుకోలేక పోతున్నా


119) ఒక ఊహలోంచి యధార్థంలోకి పయనానికి సమాయత్తం
అవుతున్న వేళ ఎన్నెన్ని అవమానాలో... ఎన్నెన్ని అవేదనలో


120) ఒక్క క్షణమైనా నిన్ను నీవు విడిచిపెట్టు నా జ్ఞాపకాల నదిలోకి..ప్లీజ్