కాలం పరుగెడుతూనే
గడియారం ముల్లు
ఆపినంత మాత్రాన
కాలం ఆగమంటే ఆగుతుందా
నీవు వస్తాను
అంటే కాలాని ఆపేస్తా
ఎందుకంటే ఆక్షనంలో
వుంటావని
చిన్న ఆశ..
ప్లీజ్ ఒక్కసారి రావూ
కాసేపు…కాసేపంటే కాసేపే
అందుకే అన్ని
పనులు పక్కన పెట్టి
నీకోసం ఎదురు చూస్తుంటా
మనం కలిసే ఆ రోజును
నా కోసమై జన్మించనీ
కొన్ని క్షణాలను
దోసిట్లో నింపుకుని
నీకోసం ఎదురు చూస్తున్నా
గుండేభారంగా మారింది
అందుకే కొద్దిసేపైనా
నన్ను నేను అభిషేకించుకోనీ….
కొద్ది క్షనాలైనా ఆనంద పడనీ
అయినా జరగని సమయం కోసం
ఆగని గడియారం కోసం
ఆశగా ఎదురు చూడటం పిచ్చేమో
నిన్నటి రోజున జనించిన
ఆ రాగం సృతి తప్పుతోంది
నా గుండె గదిలో
ధ్వనిస్తూనే ఉంటుంది
తరిగి పోయిన గతం
నన్ను వెక్కిరిస్తుంది
మనసు పొరలలో జ్ఞాపకాలు
రెపరెపలాడుతూనే వుంటాయి
మరో రోజూ అలసటతో
విశ్రమించే వరకు….
నాలో నీ జ్ఞాపకాలు
చేరి చింద్రం చేస్తుంటాయి
తెగని ఆలోచనల దారానికి
ఎగురుతున్న
జీవితపు గాలిపటం
గడియారం ముల్లుల
మధ్య చిక్కుకుపోయింది
ఈ నిశ్శబ్దంలో నా శబ్దం ఆలకిస్తూ
నిశ్శబ్దంగా న్స్తేజంగా
మల్లీ మల్లీ జ్ఞాపకాలి
పుడుతూనే ఉన్నాయి
గడియారం ముల్లు
ఆపినంత మాత్రాన
కాలం ఆగమంటే ఆగుతుందా
నీవు వస్తాను
అంటే కాలాని ఆపేస్తా
ఎందుకంటే ఆక్షనంలో
వుంటావని
చిన్న ఆశ..
ప్లీజ్ ఒక్కసారి రావూ
కాసేపు…కాసేపంటే కాసేపే
అందుకే అన్ని
పనులు పక్కన పెట్టి
నీకోసం ఎదురు చూస్తుంటా
మనం కలిసే ఆ రోజును
నా కోసమై జన్మించనీ
కొన్ని క్షణాలను
దోసిట్లో నింపుకుని
నీకోసం ఎదురు చూస్తున్నా
గుండేభారంగా మారింది
అందుకే కొద్దిసేపైనా
నన్ను నేను అభిషేకించుకోనీ….
కొద్ది క్షనాలైనా ఆనంద పడనీ
అయినా జరగని సమయం కోసం
ఆగని గడియారం కోసం
ఆశగా ఎదురు చూడటం పిచ్చేమో
నిన్నటి రోజున జనించిన
ఆ రాగం సృతి తప్పుతోంది
నా గుండె గదిలో
ధ్వనిస్తూనే ఉంటుంది
తరిగి పోయిన గతం
నన్ను వెక్కిరిస్తుంది
మనసు పొరలలో జ్ఞాపకాలు
రెపరెపలాడుతూనే వుంటాయి
మరో రోజూ అలసటతో
విశ్రమించే వరకు….
నాలో నీ జ్ఞాపకాలు
చేరి చింద్రం చేస్తుంటాయి
తెగని ఆలోచనల దారానికి
ఎగురుతున్న
జీవితపు గాలిపటం
గడియారం ముల్లుల
మధ్య చిక్కుకుపోయింది
ఈ నిశ్శబ్దంలో నా శబ్దం ఆలకిస్తూ
నిశ్శబ్దంగా న్స్తేజంగా
మల్లీ మల్లీ జ్ఞాపకాలి
పుడుతూనే ఉన్నాయి