ఏంటో ఏమో
ఎటుపోతున్నాయో
నా ఆలోచనలు
నా తలపుల రహదారులు
నాకు నేను దిక్కు తెలియక
దారి తెన్నులు లేక
గమ్యం లేక గండి
పడ్డ హృదయాన్నై
చిరు గాలికెగురుతూ...
తుఫానులకు క్రుంగిపోతూ
అంతులేనిఈ స్నేహమనే వింత ఆటలో
గెలవలేక ఓడిపోయాను
నాకు నేను
సమాదానం చెప్పుకోలేక
ఒక్కోసారి సమిధనై..
సమాదానం లేని ప్రశ్ననై
అనునిత్యం జ్వలించే జ్వాలనై
ప్రేమనే చెట్టుకు కాసిన మొగ్గనై
వర్షపు తుంపరలతో
నిండిన వర్షపు చెమ్మనై
ఏ క్షణాని కాక్షణం
ఒక్కడినే ఏకాకి గా మిగిలిపోతూ
నాకు నేను ఓడిపోతూ
గెలవలేని రేపటిలొ గతంగా
మిగిలిన నిన్నటిలో
ఒంటరి గా మిగిలిపోయాను
ఎందుకో చెప్పవూ ....?
ఎటుపోతున్నాయో
నా ఆలోచనలు
నా తలపుల రహదారులు
నాకు నేను దిక్కు తెలియక
దారి తెన్నులు లేక
గమ్యం లేక గండి
పడ్డ హృదయాన్నై
చిరు గాలికెగురుతూ...
తుఫానులకు క్రుంగిపోతూ
అంతులేనిఈ స్నేహమనే వింత ఆటలో
గెలవలేక ఓడిపోయాను
నాకు నేను
సమాదానం చెప్పుకోలేక
ఒక్కోసారి సమిధనై..
సమాదానం లేని ప్రశ్ననై
అనునిత్యం జ్వలించే జ్వాలనై
ప్రేమనే చెట్టుకు కాసిన మొగ్గనై
వర్షపు తుంపరలతో
నిండిన వర్షపు చెమ్మనై
ఏ క్షణాని కాక్షణం
ఒక్కడినే ఏకాకి గా మిగిలిపోతూ
నాకు నేను ఓడిపోతూ
గెలవలేని రేపటిలొ గతంగా
మిగిలిన నిన్నటిలో
ఒంటరి గా మిగిలిపోయాను
ఎందుకో చెప్పవూ ....?