. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, December 9, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(32)

1) నీ ప్రతి తలపు రేగుతున్న గాయాలై..గుండె నిండా
భారమైన గాయాలై ఎదురు చూస్తూ నా కన్నీరెక్కడా అని అడుగుతున్నాయి


2) కోపాన్ని దుప్పటిలో కప్పేసి.. కన్నీటితో
నీకై ఎదురు చూస్తున్నాను.. నిద్రలేని ఈ రాత్రిలో


3) ఆనందమో విషాదమో నాకూ తెలీదు
నాకు నేనుగా నీలో సంలీనమై ఏం చేయలేక ఏకాంతంలో మిగిలిపోతాను


4) ఎప్పుడు తెరిస్తేనేం ఆలోచనల తాజాదనాన్ని నింపుతూ
రేపటి ఆలోచనల కిటికీలను తెరుస్తూమదిలో తెలియని గందరగోళం


5) సందేహాల గాలికి మన మనసులు
కొట్టుకుంటూనే ఉన్నాయి నీలోను నాలోను


6) ఒకరికొకరం దూరమౌతున్న క్షనాల్లో
మదితలపుల్లో పలుచని ఆర్ద్రత మండి నన్ను దహించి వేస్తుంది


7) మన మధ్య ఘనీభవించిన మౌనాన్ని
అక్షరాలతో కరిగించి కాలాన్ని శాసించాలని చూస్తున్నా


8) కాలం పేజీలను తిప్పుతుంతే
ప్రతి పేజీలో చిరుగులే కనిపిస్తున్నా ఎందుకనో చెప్పవూ


9) ఏంటో మెలుకువతో ఉన్నప్పుడు బ్రతికుంటూ
నిద్రపోయినప్పుడు చనిపోతున్నా ఏందుకో చెప్పవూ...?


10) ఇంకా నా కళ్ళలో ఏమున్నాయని
కళ్ళను విదిలిస్తున్నావు కన్నీళ్ళన్నీ అయిపోయాయిగా


11) నేను చెప్పాలనుకున్న మాటల్ని మింగేసింది మౌనం
గుండెల్లో అలజడి రేపుతూ నిశ్శబ్దం వేదించి సాదించిదేమిటో..?


12) ఎటునుంచైనా అసలైన రహస్యిం జారిపడీ
గుండెల్లే మంటను చల్లారుస్తుందేమో అని ఎదురు చూస్తున్నా


13) బోర్లించిన మనసు పుస్తకంలోంచి
జ్ఞాపకాలను దొర్లిస్తూ నిశ్శబ్ధం రోదిస్తుంది ఎప్పుడూ


13) బరువైన నీ కను రెప్పల్లో జారే జ్ఞాపకాలను
పదాలుగా చేసి వడిసి పట్టుకొని కవితలుగా రాయాలని ఉంది


14) నిశ్శబాన్ని జాగ్రత్తగా దొర్లిస్తూ
మదిని వడకట్టేస్తూక్షనాలమీద ఇప్పుడేం రాయను


15) అలవాటుగా వెనక్కి తిరిగి చూసుకుంటే
అంతా కలగాపులగంగానే..గదరగోళంగా వుందేమితో


16) అక్షరాలు పదాలుగాపదాలు వాక్యాలుగా
అల్లుకుంటూ అల్లుకుంటూ..పోతుంటే అర్దాలు మరిపోతున్నయేంటో


17) నా గది లోపల.. మౌనంగా రాసుకుంటున్నాను
నన్ను నేను శోధించుకోవడమనే పనిలో నిమగ్నమై ఓడిపోయిన క్షనాల్లో


18) ఒక్కొక్క అక్షరాన్ని రాసుకుంటూ పోతున్నప్పుడు,
ఎవరో నన్ను తడుముతున్నట్లు వింత వింత అనుభూతి


19) లెక్క తేలని నక్షత్రాలలో తప్పిపోయినట్టున్నా ఇప్పుడు
ఈ రాత్రి కొబ్బరాకుల సందు నుంచి నిద్రను వెతుక్కుంటూ
నేను 


20) చీకటి రాత్రుళ్ళు లోలకానికి అతుక్కుపోయినట్టున్నా ఇప్పుడు
అవును కాదుల నడుమ ఊపిరి సలపనంత ఊపిరి ఆగిపోయేంతగా ఊగిసలాట…


21) తడమకపోయినా తట్టిలేపుతున్న ఆ తలపులు
పాతుకుపోయిన నీ జ్ఞాపకాలు వెంటాడి వేదిస్తూనే ఉంటాయి


22) ఎన్నిసార్లు అనుకుంటానో ఆ క్షణాలను తిరిగి
రాయగలిగితే చాలని...కాని అక్షరాలెందుకో సహకరించడంలేదు


23) మనసు ఆల్బం తెరచి చూసి
జ్ఞాపకాలను సుతారంగా మదిలో తలచుకొంటే తెలియని వేదన


24) అపుడో ఇప్పుడో..మనసు భారమైన క్షణానో
కన్నీరు ఉప్పొంగుతున్న నిమిషానో నన్ను మరిపిస్తున్నాయి నీజ్ఞాపకాలు


25) చీకటిలో చూసినా వెలుగులో చూసినా,
నాకు నేనే కానీ నీవు కనిపించవుగా ఎంత వెతికినా


26) మనసు పోటుకీ..గెలుపు బాటకీ..ఒక్క నిర్ణయం ఒంటరి ప్రయానమే

27) పదాలు పేర్చిన మారణాయుదం
ఒక్కటి చాలు మనసుని పేల్చి ముక్కలు చేయడానికి


28) ముసురు కొరడాలతో గాట్లుపడిన మబ్బులు
ఎండవేడికి కరిగిపోతున్నాయి...వాడి వేడికినిలవలేక..?


29) మన జ్ఞాపకాలు కత్తులై మరణంతో జతకట్టమంటున్నాయి
నీవు వదలి వెల్లినవేగా నాకు తప్పేట్టు లేదు నీకేం నీవు బానే ఉన్నావు..?


30) మన జ్ఞాపకాల జన్మదినం దగ్గరలోనే ఉంది
మనసు ఉక్కిరిబిక్కిరి అవుతుంది..ఆరోజొస్తావు కదూ


31) జ్ఞాపకాలు జాతర జరుపుతున్నాయి
మనసు బెంబేలుపడుతుంది నీకోసం ఎక్కడున్నావు నీవు


32) నీ మనసనే ఏడారిలో నా జీవిత జాడలు
నీకోసం మిగిల్చి పోతున్నా నాకోసం వస్తావు కదూ..?


33) మనసనే పూలతోటలో
అనుభూతుల విరులన్నీ ఎండిన ఆకులైయ్యాయి


34) మనిషినే కాబట్టే మనసును చంపుకొని
కాలం కసిగా తొక్కినా.. బొద్దింకలా నీకోసం పరుగెత్తుతున్నా


35) గుండేభారంగా మారింది అందుకే కొద్దిసేపైనా
నన్ను నేను అభిషేకించుకోనీ….కొద్ది క్షనాలైనా ఆనంద పడనీ ప్లీజ్


36) కొన్ని క్షణాలను
దోసిట్లో నింపుకుని నీకోసం ఎదురు చూస్తున్నా


37) ఏకాంతంలో విశ్రమిస్తున్న సమయంలో
నాలోని నీ జ్ఞాపకాలు గుండెల్లో చేరి చింద్రం చేస్తున్నాయి


38) తరిగి పోయిన గతం నన్ను వెక్కిరిస్తూ
మనసు పొరలలో జ్ఞాపకాలు రెపరెపలాడుతూనే వుంటాయి


39) గడియారం ముల్లుల మధ్య చిక్కుకుపోయింది
ఈ నిశ్శబ్దంలో....గుండె చప్పుడునుకూడా భరిచలేకున్నా


40) తెగని ఆలోచనల దారానికి ఆసరా అయిన
ఎగురుతున్న జీవితపు గాలిపటం గమ్యిం ఎటువైపో


41) జ్ఞాపకాల అరలలో పేర్చిన స్మృతుల దొంతరలు
తరచి చూసిన ప్రతిసారి కాలం కరిగిపోతుంది మనసు చలించి గుండె జారిపోతుంది


42) నిన్నటి అనుభవం వెక్కిరించింది
నేటి భావం నేరగాన్ని చేసి నవ్వుకొని మురిసిపోతుంది


43) భద్రంగా దాచేసుకున్నా గడిచిపోయిన గతంలో
నిజాలైన నిట్టూర్పుల సెగలు కన్నీటి దారలలో అలకబడిన అక్షరాలే అన్నీ


44) కరుడు గట్టిన కటినమైన నీమాటలతో
చిల్లులు పడ్డ గుండెలతో చిట్లిన మెదడు నరాలతో నేను..?


45) నగరం నడిబొడ్డున కాంక్రిట్ జనప్రవాహం లో
నువ్వునడుస్తున్న దారి పక్కనే నేనున్నాగుర్తు పట్టవెందుకని...?


46) గతించిన కాలం వెక్కిరిస్తూ గతమెరిగిన జీవితం
'నేను 'ని శాసిస్తుంది..నీవు అనే గతం ప్రస్తుతాన్ని మింగేసి ఒంటర్ని చేసింది


47) మది చెమ్మ గిల్లిన కల్లతో తో చేదు అనుభవాలతో
చావుకు చేరువలో ఉండి చరిత్ర పుటల్లోంచి తప్పుకునేందుకు సిద్దం అయ్యాను


48) వీడు ..వీడుకాకపోతే వాతే వాడు
వాడు కాకపోతే వాడమ్మ మొగుడు.."చీ" దీనమ్మ జీవితం


49) జీవితపుస్తకం లోంచి ఓ పేజీ అర్థాంతరంగా చిరిగిపోయింది
నా హ్రుదయ ఘోష గొంతులోనే మూగబోయి మౌనంగా రోదిస్తుంది


50) నువ్వు లైలావో కావో - నేను మజ్ఞూనే...అనార్కలివో కావో నేను సలీంనే
పార్వతి ఔనో కాదో నేను మాత్రం నీ దాసుడను.. నీకై పరితపించే దేవదాసును


51) తీరం తెలియని ప్రయాణం లో పరుగులు పెడుతూ
అలసట తీరని మజిలీలల దప్పికతో దహించుకుపోతున్నా


52) అసలైన నిజాన్ని గుండెల్లోదాచేసే
నల్లని అఙ్ఞానపు ముసుగులు కప్పుకొన్నావెందుకని


53) నువ్వెలా వెల్లిపోయావు"బుజ్జి" చిటారుకొమ్మన ఙ్ఞాపకాల ముడుపుకట్టి
సుడులు తిరిగే నా కన్నీళ్ళని జాలిగా చూస్తూ.. నేనెవరో తెలియనట్టు వెల్లిపోయావేంటో


54) నీకూ నాకూ మధ్య యుగాల దూరం
మాటలు కరువయ్యి మనుషులు చొరబడ్డారుగా


55) కుట్లుపడ్డ పెదాల మీద రక్తం చిమ్ముతూ గులాబీలా
విచ్చుకుందో వెటకారపు చిరునవ్వు గుండెల్లో దిగిన గునపంలా


56) మన తీపి అనుభూతులు జ్ఞాపకాలుగా మారాయి
మౌనన్ని మంత్రంగా వేసి జ్ఞాపకాలను గుండెలో గుచ్చుతూ తియ్యని గాయం చేస్తున్నావు.


57) తెలియని భారమేదో గుండెను బాధపెడుతుందెందుకో
ఎరుపెక్కిన నా కన్నులలోని రక్తఛార ఇంకా నా కనుపాపల నుండి చెరిగిపోకుంది


58) నీ మనసు ఎడారిలో నా ప్రేమ దాహం తీర్చుకోవాలనుంది
నా మనసు నీ దగ్గర లేదని తెలిసి కూడ ఏదొ గెలవాలని ఆరాటపడుతుంది,


59) నీ ఊహలతో బ్రతికే నాకు తెల్లవారుతుంటే భయం
ఓ నిజానికి సాక్ష్యింగా..చీకటి చీకటి గానే ఉండిపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది


60) ఏడ్చి ఏడ్చి గుండెలో ఇంకిన జ్ఞాపకం నిజం
కన్నీటి లో దాగున్నసాక్ష్యం వెన్నెల రాత్రుల్లలో రాలిపోతుంది బూడిదై


61) గడచిన కాలం అంతా నీతో గడిచిపోతూ..నిన్నే తలస్తూనన్ను నేనే మరిచిపోతూ
కాలం తెలియని సమయం..ఇంకెంత దూరమో తెలియని పయనం ఎప్పుడు ఆగుతుందో..?


62) గతం ఎప్పుడూ నన్ను గద్దిస్తూ...ప్రస్తుతం నన్ను బెదిరించి భయపెడుతుంది

63) గతాన్ని చెరిపేసుకుంటూ భవిష్యత్తుని తనకి తనే రాసుకుంటూ
కాలంపరిగెత్తుతోంది నాకు మాత్రం నీ జ్ఞాపకాల్ని మాత్రమే మిగిల్చి వెక్కిరిస్తోంది


64) నీ స్నేహం కోసం ఎలాగూ పడిచస్తానని పరాచికాలాడుతున్నావో,
నా ఆరాటం చూసి అలుసుగా తీసుకొని ఆడిస్తున్నావో తెలియట్లా మరి...?


65) చల్లని నీ చిరునవ్వులకోసం నేను తడుముకొంటూ
ఎన్ని సంధి ప్రయత్నాలు చేసాను..అన్నీ ఎండిపోయిన ఆకులైయ్యాయి ఏంటో


66) నువ్వు కావాలని నన్ను దాటిపోయిన క్షనాల్లో
నీ చల్లని పిలుపు కోసం ఎన్నిసార్లు మరణిస్తానో నీకు తెలుసా..?


67) నీవు విసిరేసిన ప్రతి జ్ఞాపకంలోంచి నేను మొలకెత్తాలి అనుకొంటాను
నీవు నా ప్రతి జ్ఞాపకాన్ని తుంచేస్తుంటే రక్తం ఓడుతున్న జ్ఞాపకాలకేమని చెప్పను


68) రాత్రి మబ్బుల దాచిపెట్టిన నక్షత్రాలన్నిటినీ,
పగలు దోచుకెళ్ళి ఇప్పుడూ చీకట్లొకి విసిరేశావు ఎందుకని


69) నా రక్తాక్షరాల ఉత్తరాన్నందిస్తే నీతో నాకేం పోవోయ్ 
పిచ్చోడా అన్నావు నీవేదైనా అనగలవు..నీకేదైనా సాద్యమే కదా 

70) అటు ఇటు చూసి ఎవ్వలేనిది చూసిన నీ జ్ఞాపకం
హటాత్తుగా తనలోకి లాగేసుకొని నన్ను చిత్తడి చేస్తోంది కాపాడవూ..?


71) కమ్యూనికేషన్ గ్యాప్ లో చిక్కుకుపోయి కంగారు పడుతున్నా
కన్నీటితో అక్షరాలను అలికెయ్యాలనుకున్నా కన్నీరు కరువైంది కాస్త అవువివ్వవూ


72) ఆనందం కన్నీరుగా దోసిట్లో నింపాలని చూశాను
చూస్తే చేతినిండా ఏర్రటి రక్తం వేడిగాబుసలు కొడుతోంది ఎందుకో


73) నా జ్ఞాపకాల ఘనికి కొల్లగొట్టాలని చూస్తున్నారు
అది నీవు పంపిన మనిషేనా...ఎందుకింత నీచానికి దిగజారావో చెప్పవూ...?


74) నీ నిశబ్దపు గోడలను తడుముతున్న నా మౌనభాష
చీకటి రాత్రుళ్ళు పై కదిలాడే నీలిమబ్బులచాటున దాగి రోదిస్తోంది


75) ఓర్చలేని భాదలో ఆ కవిత అక్షరాలు చుట్టుకుని
బయటపడిన క్షణం తనివిదీరా ప్రతి అక్షరాన్ని ఆత్రంగా తడుముకుంటున్నా


76) ఎన్ని నిద్రలేని రాత్రులు...ఎన్ని బరువెక్కే ఆలోచనలు
ఎన్ని అంతర్మధనాల రోదనలేన్నో నీకు ఎందుకు వినిపించడంలేదో చెప్పవూ


77) నా మనసు పొరలు చీల్చుకుని
బయటకు వచ్చే ఈ కవితకు ఏమని పేరు పెట్టను చెప్పవూ


78) ఏంటో ఎన్నాళ్ళిలా దిక్కులు చూస్తూ
చుక్కలు లెక్కెడుతూ కాలం గడపడం కాస్త చెప్పవూ


79) ప్రతిపగలూ నిరీక్షణలో క్షణాలు లెక్కెడుతూ
చీకట్లో చిరిగిపోయిన జ్ఞాపకాలను లెక్కబెట్టుకుంటున్నా


80) నా స్నేహపు గాయాల శకలాల మీద
పెట్రోతో దహించి వేసి నీవేం సాదిస్తావురా..నీకిదేం ఆనందం


81) హృదయం పగిలిల ప్రతిసారీ
అక్షరాలు ఒరిగి పోతున్నాయి నలిగిన జ్ఞాపకాల్లా


82) నాలోని శబ్దాన్నంతా బయటికి పంపేసి
నిశ్శబ్దాన్ని నింపెయ్యాలనే చూస్తున్నా నాలో నేను ఓడిన క్షనాల్లో


83) ఒంటరినైనపుడు నన్ను ఓదార్చే జ్ఞాపకాలు
జీవితపు సుడిగాలిలో చెల్లాచెదరై పదునైన కత్తులై గాయాలు చేస్తున్నాయి


84) కను రెప్ప క్రింద..గులాబీ వనంలో
రాలిపడినవీ నీటిబిందువులు కన్నీరై కనుమరుగౌతున్నాయి


85) జ్ఞాపకాల గనుల్లో..మన మాటల కోసం తవ్వకాలు మొదలెట్టాను

86) అంతులేని భాధతోఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడక చనిపోతానేమో
అనిపించినప్పుడు కనిపించకుండా మాయం అయిపోయి ఎంత త్యాగం చేశావు...?


87) చేరువైన నేస్తం నీవు నన్ను ఒంటరిగా వదలి వెల్లి
నీ ఙ్ఞాపకాలు ముసురుకుని చీకట్లో కూర్చున్నప్పుడు ఎందుకు వెక్కిరిస్తావు


88) ఏంటీ గందరగొళం ఏంటీ అవంతరాలు అవరోదాలు
దేవుడా చాలు ఈ పరీక్షలు..ఇకనైనా చెప్పు నన్ను ఎందుకు పుట్టించావ్?


89) ఒంటరి తనాన్ని కావలించుకుని చీకట్లో పడుకున్నా
అక్కడ కూడా అదే నవ్వు కలలో కూడా అదే నవ్వు అదే ఆలాపన ఎప్పుడూ


90) చీకటి కూడా వెలుగుకేసి నడుస్తుంటే,
నా నిరాశ నాకెక్కడి చుట్టమో వెలుగులోనూ చీకటే కనిపిస్తుంది


91) అడక్కుండానే మనసులోకి చొరబడి..చెప్పకుండానే గుండె చీల్చి...
గతాన్ని కెలికి వెల్లిపోయావ్ ఇంతకీ నువ్వు నాతోనే ఉన్నావా ? లేవా ?చెప్పవా ?


92) గడిచిన నిమిషంలో ఏదో ఫోన్ మాట్లాడుతూ
నిన్ను 100 సార్లే తలుచుకున్నా ఈ ఒక్కసారికి నన్ను మన్నించవా


93) నీ జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా
గుండెల్లో నిప్పులు పోసినట్టు తట్టుకోలేనంత భాద


94) చేజారిన దాని కోసం బాధ పడుతూ..ఆవేశపడుతూ
అందని దానికై ఆరాటపడుతూ...అందోళన పడితే గతంతిరిగి వస్తుందా


95) నీవు పారేసిన అక్షరాలను ఏరుకుంటున్నా
అవన్నాజ్ఞపకాలై నన్ను ఓదారుస్తాయేమో నని చిన్నిఆశ....?


96) ఏంటో సమయం జారిపోతుంది
అప్పుడే పడ్డ వాన చినుకులా నాకందకుండా


97)  నేను నేర్చుకున్న భాషలన్నీ మర్చిపోయానిప్పుడు
నీతో మాట్లాడేందుకు ఒక కొత్త భాషని సృష్టించుకున్నా అదే మౌన భాష


98) ఎన్నాళ్ళయింది లెక్క తేలని 
నక్షత్రాలలో  తప్పిపోయినట్టున్నా ఇప్పుడు 

99) జ్ఞాపకాలను కౌగలించుకుని
పరితపిస్తున్న నామనసు న నీకు చేరలేదా


100) నిద్రను వెతుక్కుంటూ
జాబిలమ్మ ఒడిలోకి చేరి నీ చెక్కిల్లను ముద్దాడుతూ 
నేను