ఇప్పటికీ నివంటే ఇష్టం
ఆన్న మాట అబద్దం కదూ
అప్పుడు చెప్పావు
అది నిజం కాదు కదూ
అప్పుడు అంత జరిగిన
ఆపదాలు నన్ను కబలించి
ఇనుప చట్రం లా నన్ను రక్షించాయి
ప్రపంచాన్ని జయించినంత దైర్యం
ఆతరువాత ఏమైందో తెలియదు
కొన్ని పదాలు నా నుండి రాలిపడి
ఓ ఎడారిని సృష్టిస్తాయి
ఆ ఎడారిలోంచి ఓ చీకటి
ఆ చీకటి లోంచి కుంభవృష్టీ
లోనుండి ఒక్కొక్కటిగా విచ్చుకొని
నన్ను కబళిస్తాయి.
నానుంచి పుట్టినదైనా
అది నీవల్లే సంబవంచింది
నన్నో పూచికపుల్లను చేసి
కొట్టుకపోయేలా చేస్తుంది నీ జ్ఞాపకం
అక్షరాల్లోకి అనువదింపబడలేని
అప్రకటిత సత్యమేదో
నీలోనుండి నాలోకి ప్రవహిస్తుంది