ఒంటరితనంలో
నిన్ను తలుచుకుని
దుఃఖిస్తూ వుంటాను
ఏకాంతంలో నీతో
ముచ్చట్లు చెపుతూ వుంటాను
నాలో నీవు బ్రతికి వున్నావు
ఓమూల నిన్ను బంధించేసాను
బాధ....బరువై
మోయలేని భారమై
నీ జ్ఞాపకాలు చేజారి ముక్కలై
మనసుని గుచ్చి గుచ్చి బాధిస్తోంది
నీ తలపులు గుండెల్లో అగ్గై
నన్ను దహించి వేస్తూనే వుంది
గుండెల్లో వ్యధ
అగ్గి శిఖలై మంటలై
ఎగిసెగిసి పడుతుంటే
నా మనసుపై గుమ్మరించిన కన్నీరు
నన్ను దహించి వేస్తుంటే
సెగపెట్టి ఎక్కిళ్ళు పెట్టిస్తోంది…నీ జ్ఞాపకం
నిన్ను తలుచుకుని
దుఃఖిస్తూ వుంటాను
ఏకాంతంలో నీతో
ముచ్చట్లు చెపుతూ వుంటాను
నాలో నీవు బ్రతికి వున్నావు
నాలో నువ్వు నీలో నేను
అంతరాత్మ…..నిన్ను గుండె గదిలో ఓమూల నిన్ను బంధించేసాను
బాధ....బరువై
మోయలేని భారమై
నీ జ్ఞాపకాలు చేజారి ముక్కలై
మనసుని గుచ్చి గుచ్చి బాధిస్తోంది
నీ తలపులు గుండెల్లో అగ్గై
నన్ను దహించి వేస్తూనే వుంది
గుండెల్లో వ్యధ
అగ్గి శిఖలై మంటలై
ఎగిసెగిసి పడుతుంటే
నా మనసుపై గుమ్మరించిన కన్నీరు
నన్ను దహించి వేస్తుంటే
సెగపెట్టి ఎక్కిళ్ళు పెట్టిస్తోంది…నీ జ్ఞాపకం