దు:ఖాన్ని దాచుకోలేక మనసంతా
మనసునిండా నాటి జ్ఞాపకాల అల్లకల్లోలమే
భావాలకై నాలో నేను తడుముకుంటూ
నాలోని గతాన్ని శోధిస్తూ
మనసు లోతుల్ని తవ్వుకుంటూ
అక్షరాల ప్రపంచాన్ని హత్తుకుంటాను
ఆ అక్షరాలనే నాలో నుండి
నీలోకి ప్రవహించాలని
తపన పడుతుంటాను
అక్షరాలుగా మారిపోయాయి
అవకాశాలు జారిపోయాయి
తడిసిన కనులు అలసిపోయి
అవమానాన్ని దిగమింగుకొని
బాధను ప్రకటిస్తుంటాయి
నన్ను నేను నాలో నిన్ను తడుముకొంటూ
నిజాణ్ని దాచుకొని
నాలో ని అజ్ఞానం
సహజత్వాన్ని కోల్పోతుంది
ముడుచుకున్న కాగితంలో
ఇంకిన కన్నీళ్ళు
అక్షరాలై కనిపిస్తూ
ఆవేశమో ఆక్రోశిస్తూ
ఆవిరైనట్లు అనిపిస్తూ..
నాలోని భాద నన్ను నిలవనీయడం లేదు
మనసునిండా నాటి జ్ఞాపకాల అల్లకల్లోలమే
భావాలకై నాలో నేను తడుముకుంటూ
నాలోని గతాన్ని శోధిస్తూ
మనసు లోతుల్ని తవ్వుకుంటూ
అక్షరాల ప్రపంచాన్ని హత్తుకుంటాను
ఆ అక్షరాలనే నాలో నుండి
నీలోకి ప్రవహించాలని
తపన పడుతుంటాను
అక్షరాలుగా మారిపోయాయి
అవకాశాలు జారిపోయాయి
తడిసిన కనులు అలసిపోయి
అవమానాన్ని దిగమింగుకొని
బాధను ప్రకటిస్తుంటాయి
నన్ను నేను నాలో నిన్ను తడుముకొంటూ
నిజాణ్ని దాచుకొని
నాలో ని అజ్ఞానం
సహజత్వాన్ని కోల్పోతుంది
ముడుచుకున్న కాగితంలో
ఇంకిన కన్నీళ్ళు
అక్షరాలై కనిపిస్తూ
ఆవేశమో ఆక్రోశిస్తూ
ఆవిరైనట్లు అనిపిస్తూ..
నాలోని భాద నన్ను నిలవనీయడం లేదు