. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, August 6, 2015

నీ జ్ఞాపకాలు మౌనంగా వున్న మనసులో రక్తపాతం చేస్తున్నాయి

నీకోసం ఎదురుచూసిన రాత్రులన్నీ 
దేహం పేజీల్లో దాక్కుని ఉన్నాయి 
నీకోసం ఎదురు చూసిన ప్రతి 
కల చెదిరి నేను  
కన్ను తెరిచిన ప్రతిసారి 
చీకటిలో  విషమేదో 
నరాలలోకి ఇంకుతున్నట్టు 
నా మనస్సు లోదిగబడిన 
జ్ఞాపకాల సాక్షిగా
దుఃఖం ఎన్నిసార్లు మనసు 
పై దాడి చేసి గాయం చేసిందో 
కారనాలే కత్తుల్లా నీ అలోచనలు 
మనసుపై దాడి చేసి 
మౌనంగా వున్న మనసులో
 రక్తపాతం సృష్టిస్తున్నాయి 

మనసు పునాదులపై 
నేను వేసుకున్న
ఊహా ప్రపంచాన్ని 
కూల్చేసిన వాడి కసి తీరింది
వాడిని నమ్మిన 
నీవు బానే వున్నావు 
మరి నిన్నే నమ్మిన 
నేనెందుకు ఇలా ఉన్నాను 
ఏమైపోతున్నా అర్దంకాక 
వ్యర్దం అవుతున్న కాలం అనే 
కాలువలో కొట్టుక పోతున్నా

నవ్వాలని వున్న నవ్వలేని 
నా నిరశక్తతను ..నన్ను నేను 
ఓదార్చలేని నా చేతగాని తనాన్ని చూసి 
కాలం వెక్కిరిస్తుంది 
నీవైపు తొంగి చూసినప్పుడల్లా  
నవ్వుతూ తుల్లుతూ ..
గతంలో ఏం జరగనట్టు 
ఉన్న నిన్ను చూస్తే 
నిజంగా ముచ్చటేస్తుంది 
ఇలా ఉండటం నీ ఒక్కదాని వల్లే సాధ్యం