స్థంభించిన కాలం సమక్షంలో
గుండె మంటల వేడికి
కరుగుతున్న రాత్రికి
ఏంమని సమాదానం చెప్పాలో తెలియక
కన్నుల్లో జారిపోతున్న
చీకటి రాత్రిని మనసారా తాగుతున్నా
గత్యంతరం లేక
గుండె గొంతుకలో
నలిగిపోతున్న ఆరోజుల సాక్షిగా
కరిగిపోతున్న ఈరేయి సాక్షిగా
నలుపును నా మనసుకద్ది,
చీకటి నీ కురులు వెనక్కేస్తూ,
నీ నుదుటికి మడతల్లో
నలిగిన నా మస్సాక్షి
మదిలో మౌనమై
నిజంలో నీడనైపోయానుగా
నిజం నిద్రలా నన్నొదిలి
మెల్లగా జారుకుంది
నా నిన్నటికి నేటికి మధ్య
జ్ఞాపకాల వంతెన మాయమయ్యింది
లోకానికి తెల్లారింది కాని నాకు కాదేమో
నాకు ఈ రాత్రీ కరిగి జరిగి పోయింది
చీకటిలో నన్ను నేను మాయజేస్తూ
నీకోసం రోదిస్తున్న నామనస్సాక్షిగా
గుండె మంటల వేడికి
కరుగుతున్న రాత్రికి
ఏంమని సమాదానం చెప్పాలో తెలియక
కన్నుల్లో జారిపోతున్న
చీకటి రాత్రిని మనసారా తాగుతున్నా
గత్యంతరం లేక
గుండె గొంతుకలో
నలిగిపోతున్న ఆరోజుల సాక్షిగా
కరిగిపోతున్న ఈరేయి సాక్షిగా
నలుపును నా మనసుకద్ది,
చీకటి నీ కురులు వెనక్కేస్తూ,
నీ నుదుటికి మడతల్లో
నలిగిన నా మస్సాక్షి
మదిలో మౌనమై
నిజంలో నీడనైపోయానుగా
నిజం నిద్రలా నన్నొదిలి
మెల్లగా జారుకుంది
నా నిన్నటికి నేటికి మధ్య
జ్ఞాపకాల వంతెన మాయమయ్యింది
లోకానికి తెల్లారింది కాని నాకు కాదేమో
నాకు ఈ రాత్రీ కరిగి జరిగి పోయింది
చీకటిలో నన్ను నేను మాయజేస్తూ
నీకోసం రోదిస్తున్న నామనస్సాక్షిగా