నిజం మనల్ని కలిపింది
కన్నీరు మనల్ని విదేసింది
ఎన్నో పంచుకోవాలని కలలు కన్నాను
కలలన్నీ కల్లలు అయ్యాయి
నేను దగ్గరయ్యేకొద్దీ
కొద్దీ దూరమయ్యావు
మనసును ముక్కలు చేస్తూ ఆడుకొంటున్నావు
మనసుల మనసులతో ఆడుకోవడమన్
నీ హాబీ అని తెలియక
నీకోసం ఆరాటపడ్డాను
తప్పు చేసాను కదూ
నీకోసం పలవరించిన
ఏకాంతపు రాత్రులు
కలవమని చేసిన అభ్యర్ధనలు..ప్రార్ధనలు
నా మానాన నన్నొదిలేశావు..
స్థితిగతులు మారి,
నా నిస్సత్తువ గెలిచినప్పుడు
నిస్సహాయుడనై.. పిలచిన పిలుపులు
ప్రతిధ్వనులై వెక్కిరించాయి.
నాతోనే ఉన్నావంటావా .. సాక్ష్యమేదీ ?
నా బ్రతుకంతా నువ్వు తప్పిన జ్నాపకాలే...
నువ్వెంతమందిని పిలిచావు?
ఎంతమందిని కలిశావు ?
ఏం నేచేసిన తప్పిదమేమిటి ?
నీ రాక.. నీకది ఇష్టంలేదేమో
నే రావడం.. అదీ కష్టమే ?
అసలాంతర్యమేమో ?
ఈ ఎడబాటెందుకో ?
నన్ను మోసం చేసిన కాలం
నామీద నుండే జారిపోతుంది
నన్ను కాదని ఒప్పుకోని జీవన విదానంలో
నావన్ని తప్పులు చేసి ..
నీవో నిజంగా నన్ను అబద్దం చేసి
విధిని నమ్మిన వాడిని
నీ విధానాన్ని ప్రశ్నించాను..క్షమించు
కాలం జారుతుందిగా..
మన మధ్య దూరమూ..కరుగుతుంది. !
ఎప్పటికైనా మన కలయిక తధ్యమే !
కానీ తొందరలో చూడగలనన్న ఆశతో.
చావలేక బ్రతుకుతూ మోసపోయిన మనసుని
కన్నీరు మనల్ని విదేసింది
ఎన్నో పంచుకోవాలని కలలు కన్నాను
కలలన్నీ కల్లలు అయ్యాయి
నేను దగ్గరయ్యేకొద్దీ
కొద్దీ దూరమయ్యావు
మనసును ముక్కలు చేస్తూ ఆడుకొంటున్నావు
మనసుల మనసులతో ఆడుకోవడమన్
నీ హాబీ అని తెలియక
నీకోసం ఆరాటపడ్డాను
తప్పు చేసాను కదూ
నీకోసం పలవరించిన
ఏకాంతపు రాత్రులు
కలవమని చేసిన అభ్యర్ధనలు..ప్రార్ధనలు
నా మానాన నన్నొదిలేశావు..
స్థితిగతులు మారి,
నా నిస్సత్తువ గెలిచినప్పుడు
నిస్సహాయుడనై.. పిలచిన పిలుపులు
ప్రతిధ్వనులై వెక్కిరించాయి.
నాతోనే ఉన్నావంటావా .. సాక్ష్యమేదీ ?
నా బ్రతుకంతా నువ్వు తప్పిన జ్నాపకాలే...
నువ్వెంతమందిని పిలిచావు?
ఎంతమందిని కలిశావు ?
ఏం నేచేసిన తప్పిదమేమిటి ?
నీ రాక.. నీకది ఇష్టంలేదేమో
నే రావడం.. అదీ కష్టమే ?
అసలాంతర్యమేమో ?
ఈ ఎడబాటెందుకో ?
నన్ను మోసం చేసిన కాలం
నామీద నుండే జారిపోతుంది
నన్ను కాదని ఒప్పుకోని జీవన విదానంలో
నావన్ని తప్పులు చేసి ..
నీవో నిజంగా నన్ను అబద్దం చేసి
విధిని నమ్మిన వాడిని
నీ విధానాన్ని ప్రశ్నించాను..క్షమించు
కాలం జారుతుందిగా..
మన మధ్య దూరమూ..కరుగుతుంది. !
ఎప్పటికైనా మన కలయిక తధ్యమే !
కానీ తొందరలో చూడగలనన్న ఆశతో.
చావలేక బ్రతుకుతూ మోసపోయిన మనసుని