ఎంత పాతబడిన గాయమైనా
మళ్ళీ మళ్ళీ ముళ్ళకంప ముల్లుల్లో
కొత్తగా రేగి రేగి జ్ఞాపకాల సుడుల్లో
పోగొట్టుకున్న అమూల్యాలను
కలల్లోనూ వెతుక్కున్నట్టు
వెక్కిళ్ళు పెడుతూనే ఉంది నా గతం ..
ఎంటో అందరూ ఆనందగా ఉన్నారు నేను తప్ప
అంటే అన్నీ మర్చిపోయి
అందరూ అబద్దంలో బ్రతికేస్తున్నారు
నేను మాత్రమే నిజం లో నిర్వేదంతో బ్రతికేస్తున్నా
ఎన్ని వెలుగులను మింగేసిన
చీకటిలా అనేక నిజాలను
దాచుకొని నిబ్బరంగా ఉండలేక
కంటీమీద కునుకు లేక
ఇలా జీవచ్చవంలా ఎందుకునా
నన్ను నేను ప్రశ్నించుకుంటే
నాకు నేను అర్దం కాక
నాలో నేను నిలువలేక
నిన్ను నాదగ్గర లేనప్పుడు
ఏక్కడో ఒకచోట
చిరునవూలు చిందిస్తున్న నిన్ను
చేరలేక చేరుకోలేక
నేను పడుతున్న మరణ యాతన
మళ్ళీ మళ్ళీ ముళ్ళకంప ముల్లుల్లో
కొత్తగా రేగి రేగి జ్ఞాపకాల సుడుల్లో
పోగొట్టుకున్న అమూల్యాలను
కలల్లోనూ వెతుక్కున్నట్టు
వెక్కిళ్ళు పెడుతూనే ఉంది నా గతం ..
ఎంటో అందరూ ఆనందగా ఉన్నారు నేను తప్ప
అంటే అన్నీ మర్చిపోయి
అందరూ అబద్దంలో బ్రతికేస్తున్నారు
నేను మాత్రమే నిజం లో నిర్వేదంతో బ్రతికేస్తున్నా
ఎన్ని వెలుగులను మింగేసిన
చీకటిలా అనేక నిజాలను
దాచుకొని నిబ్బరంగా ఉండలేక
కంటీమీద కునుకు లేక
ఇలా జీవచ్చవంలా ఎందుకునా
నన్ను నేను ప్రశ్నించుకుంటే
నాకు నేను అర్దం కాక
నాలో నేను నిలువలేక
నిన్ను నాదగ్గర లేనప్పుడు
ఏక్కడో ఒకచోట
చిరునవూలు చిందిస్తున్న నిన్ను
చేరలేక చేరుకోలేక
నేను పడుతున్న మరణ యాతన