. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, August 4, 2015

నాలో వున్న నిన్ను నీలో వున్న నన్ను క్షమించేసుకుందాం

నువ్వు నేను
విధి పన్నిన వలలో ఇరుక్కున్న గువ్వలం
గతం విసిరేసిన కాలంలో కరిగిపోయిన జ్ఞాపకాలం
గింజలు చల్లి దాక్కున్న వేటగాళ్ల వేటకు దొరికిన
అమాయకపు ప్రేమ పక్షులం
నీలోకి నేను నాలోని నేను 
రావాలనుకున్నా రాలేని 
రాతి మనుషులం 
ఏమార్చిన వారు 
ఎంతో నిబ్బరంగా వున్నా 
నిన్ను నమ్మిన నేను 
మౌనంలో దాగి నీవైపు తొంగి చూస్తూనే వున్నా 

అ గుడిలో జ్ఞాపకాలు  నాలో 
ఇంకా పదిలంగానే వున్నాయి
అందుకే అప్పుడప్పుడూ ..
విడినాడిన నిన్ను తలస్తూ 
అక్కడే అప్పుడప్పుడు తచ్చాడుతుంటా
అక్కడ  తనతో నీవు కనిపిస్తేవేమో అని
అప్పుడైనా నీ సంతోషంలో కరిగిపోతున్న 
తనతో నీవు ఎంత ఆనందంగా  
వున్నావో చూద్దాం అని 
ఏం జరుగుతుంతో తెలీక 
తెలుసుకోవలనుకున్న 
దగ్గరకు రాలేనంతదూరంగా 
మనకు మనమే ఎవ్వరికీ తెలియకుండా 

ఎవరి కన్నీళ్ళు వాళ్లమే 
తుడిపేసుకుందాం
నిద్ర లేచాక కలల్ని చివరి వాక్యాలతో 
మన కథల్ని మనమే  మొదలెడదాం
పూర్తిగా రాయబడని 
రాయలేని దీనమైన పదాల 
చేత రహస్యంగా క్షమించబడుతూ 
సిరా చుక్కల్ని విదిలించిన 
చోటల్లా వీలైతే మరకలు చెరిపేస్తూ 
నాలో  వున్న నిన్ను 
నీలో వున్న నన్ను క్షమించేసుకుందాం