ఏదో ఆరాటం మొదలౌతుంది. ఎక్కడా తిన్నగా ఉండనీదు, చేస్తున్న పనేంటో అర్థం కాదు. అప్పుడొకటే దారి. వీలు చేసుకుని ఎక్కడోచోట కూర్చుని ఉన్న ఫళాన రాసెయ్యాలి. హమ్మయ్య! రాసేస్తానా, అప్పుడు కాస్త ఊపిరాడటం మొదలౌతుంది.” ఎందుకో తెలియదు కాని మనసు మూలల్లో ఎదో అలజడి ...నిర్వేదం నిరాశ ..గతం చేసిన మాయలో ఇంకా బ్రతుకుతున్న ప్రస్తుతం ....ఆ గతంలో నాతో వున్న ప్రానులు అన్నీ మర్చిపోయి కొత్త జీవితంలో పడి ఆనందంగానే వున్నారు మరి నేనెందుకు ఇలా ఆలోచిస్తూ సంత్సరాలు గా భాద పడుతూనే వున్నా ...ఎందుకని ఎవ్వరిని అడగాలి నేనెందూ అన్నీ మర్చిపోలేక పోతున్నా ..నేనెందుకు అందరిలా ఆనందంగా వుండలేక పోతున్నా ..“ఏదైనా కష్టమొస్తుంది కదా. చాలా పెద్ద విషాదం ఒక్కోసారి. బాగా బాధేస్తుంది. ఏడ్చినా, ఎవరితో చెప్పుకున్నా తీరదు. ఆ తీవ్రత, విషాదపు లోతు ఉన్నదున్నట్టు బయటికి పంపాలంటే రాసుకోడం తప్ప వేరే దారి లేదు.” దాచుకున్న జ్ఞాపకాలు నాలో నిలబడలేక మనసు మూలల్లోనుండీ కలం వుండీ కాగితాల్లో జారిపడే రోజులు పోయి కంఫ్యూటర్ కీబోర్డు ఇంగ్లేషు కీబోర్డు పై తెలుగు అక్షరాలు అవలోలకంగా ..ల్యాప్ టాప్ స్త్రీన్ పై పడి నాలోని భాదను మైపరపించి నన్ను దహించి వేస్తున్న నాలోని గుండెల్లోనుంచి రగిలిన గతం వువ్వెత్తున అగ్నిలావాలా ..నాలో జివ్వుమన్న శక్తినంతా కూడాదీచుకొని కీబోర్డులపై నాలోని ఆందొలనాంటా ఎండవేడికి కిరనజన్య సమ్యోగ క్రీయ జరిగినట్టు ..కీబోర్డు పై నుండి ఒక్కోపదం ..కంప్యూటర్ స్క్రీన్ పై కనిపించగానే ఆవేశంగా రాసుకొన్న పదాలు ...గతం జ్ఞాపకాల మటల్లోనుంచి రాలిపడిన నిప్పుకనికల్లా కనిపిస్తూ నాలోని ఆవేశాన్ని కాస్త తగ్గిస్తాయి అవి ఈ బ్లాగులో కవితలై మెరుస్తున్నప్పుడు నాలో తెలియని శాడిష్టు ఆనందంగా కెవ్వుమని కేక వేస్తాడు ..ఆది ఆనందమో విషాదమో తెలియని ఒక తియ్యని అనుబూతి ఏదో సాదించానన్న తృప్తి అంతలోనే ఏదో గుర్తుకొచ్చి వెంటనే కంటి చివరన నీటి చెమ్మ బొట్లు బొట్లు గా మారి జారిపొటున్న క్షనాన మల్లీ ఏదో తలియని భాద నన్ను కమ్మేస్తూ ఉంటుంది వేళ్ల మెటికలు విరుచుకుంటూ, అప్పటిదాకా మోస్తున్న టన్నుల బరువుని దింపుకున్నవాడిలా నిట్టూర్చి రాస్తునే ఉంటాను “నేనూ ఆలోచించాను. నేనురాసేది చాలామందికి, అసలెవరికీ అర్థం కాకపోవచ్చేమో అని రూఢీగా అనిపించింది కూడా ఒకసారి. కానీ రాశాను. లోకం సంగతేమో కానీ, రాసుకున్న ప్రతిసారీ బహుశా, నాకు నేను ఏమైనా అర్థమౌతానేమో తెలుసుకోడానికి రాస్తాను.” ఎవ్వరో చదువుతారని కాదు చదివిన వాల్లు నన్ను అర్దం చేసుకుటారనీ కాదు నాలోని అవేశం అక్షరాలైతే ఇలా ఉంటుంది అని ఏదో చెప్పాలని ఏదో రాసేస్తుంటాను