. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, March 31, 2014

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(35)

1) మనస్సు వశం తప్పిన ఆ కొద్ది ఆ మదుర క్షణాలు
చరిత్రలో కలిసిపోతున్నాయి ..ఆయువునూ తగ్గించేస్తున్నాయి


2) కొన్ని నగ్నత్వాలని ఇక్కడ ఏమార్చలేను
మనసు స్ఖలిస్తున్నప్పుడు...చెక్కిళ్ళపై కారే కన్నీరే సాక్ష్యిం


3) ఒక తియ్యటి గొంతు అంతా నిజమని నమ్మించి
ఒక రాబందు రెక్కలనుతో తన ముక్కుతో దాడిచేసి రక్తంఓడేలా చేసింది


4) కాస్త శాంతినీ.. కొంచెం ఆశనీ నుదుటి మీద దయగా అద్దుతుంటే
నిజం అనుకున్నా ..మరొక పెద్ద గాయం చేస్తుంది విది అని గుర్తించలేకపోయా


5) ఆఖరి శ్వాస తోటే అంతమయ్యే శిక్ష ఒకటి విధించబడ్డాక
తప్పించుకునేందుకు ప్రయత్నించినా .. మరోరూపంలో విది గాయం చేసి చంపేస్తుంది


6) హృదయం నిశ్శబ్దాలో రోదిస్తుంది
అది నిజమో బ్రమనో తెలియక..కట్టో కనికట్టో అర్దం కాక


7) మౌనంలో మాటలు ఏం దాగున్నాయో
ప్రశ్నలో సమాదానం ఇరికించి .. ఆడుకొంటున్నావుగా


8) గతించింపొయిన "స్వగతం"
మదిని చిలకరిస్తే రాలిపడుతున్న "జ్ఞాపకాలు"


9) నా అంతరాత్మలోకి తొంగి చూడు
నువు లేని ఆత్మ నన్ను తగలబెడుతుంది


10) నీ చిరునవ్వు కనిపిస్తుందని ఆశిస్తే
మనసు గాయపడి విషాదం అలుముకుంటుంది


11) మదిలో మెదిలే దృశ్యాల్ని ఎవరితో పంచుకోను
పగిలిన హృదయం పలికే మూగ భాధల్ని ఎవరికి వినిపించను..


12) గొంతు పెగలడం లేదు
నిప్పులు చెరిగే నా కన్నీళ్ళలో కరిపోతున్న కళ్ళు


13) ఏకాంతరంగాల్లో అలజడి తీవ్రమవుతుంది
అయినా ఆశల దిక్సూచి చక్రాలు ఎప్పుడో విరిగిపోయాయిలే...?


14) మౌనమే నీ బాష అయినపుడు
నీ ఉనికిలో ఒదిగిపోతా..కాలంలో కరిగిపోతా


15) వెలుగురేకలనుకొని..నిజం అని బ్రమపడి
కటిక చీకటి గుండా నీ గమనాన్ని సాగిస్తున్నావా నేస్తమా?


16) ఈ నిశ్శబ్దపు రాత్రిని నేనింకోసారి ఎవరికీ తెలియని
మరేవరికీ అందని దూర తీరాలకు నన్ను నేను తీసుకపోదాం అనుకొంటున్నా


17) కాలం మింగిన క్షణాలలో నన్ను నేను
నీకూ నాకూ మాత్రమే తెలిసిన జ్ఞాపకం వెక్కిరిస్తుంది


18) నీ విరహంలో నేనొక సమిధను ఇప్పుడు
నా జ్ణాపకాలను నేనెట్లా కాల్చను…అందుకే స్వయంగా నేనే కాలిపోతున్నా


19) నీ మొబైల్ తో కాల్ చేస్తావని అనుకున్నా కానీ....
ఇలా నీ మౌనంతో కాల్చేస్తావని అనుకోలేదు ప్లీజ్ అల చెయ్యకు


20) ఉదయం నుంచి అర్దరాత్రి వరకు రంగులలో నానిన మనసు చిత్రం
నన్నే నేనేనా అంటూ లోలోపల ప్రశ్నల కుంపటిలో ప్రతిక్షనం నలిగిపోతూ


21) ఒంటరి ప్రయాణం కాసింత సేదతీర్చే మనస్సుకోసం
ఎడారి గుండె గాలింపు ఎదురు చూపులో ఏమరపాటు.. ఫలించని నిజాలకోసం


22) నీలో నీవు చూడగల లోతెంత?
నిన్ను నువ్వు వెతుక్కుంటూ.నిన్ను నీవు చూసుకున్నావా ..?


23) నా ఎదనిండా ఖాళీ..భర్తీ చేయలేని శూన్యం..
నా ప్రశాంతతను ఎవరు భగ్నం చేస్తారు? అది నివ్వేకదూ..?


24) “కాలిన మనసు కాగితం లో
తగలబడిన అక్షరాల సాక్షిగా ” ఇంకా వెతుకుతున్నా నీకోసం


25) ఏక్కడో నీవు ఇక్కడ నేను
మదికలింత లెందుకు ఇంత దగ్గరగా...?


26) ఎదురుచూపు కను రెప్పల్లో దాగిన కన్నీటి బరువెంత?
తీరని దాహపు గొంతు గుటకలతో మంటెక్కిన మదితలపుల భారమెంత..?


27) ఏం జరిగిందో తెలీదు ఆ కళ్ళు కరిగిపోతున్నాయి
కలలు కల్లలైయ్యాయేమో టపా టపా కన్నీరు చెక్కిళ్ళపైనా గుండెలపైనా


28) నా మనసు రోదిస్తూ ఎడతెగక గాలితో తిరుగుతోంది
నింగిలో దూరంగా అలుముకున్న చీకటి తదేకంగా నావైపే చూస్తుంది


29) కొన్ని జ్ఞాపకాలు నా అస్థిత్వాన్ని శోధించమంటాయి
నేనేంటో తెలియని స్థితిలో నన్ను నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తాయి


30) మదిరపాత్ర ఎప్పుడు పగలగొట్టావో తెలియదు
మన జ్ఞాపకాలు ముత్యాలెలా తివాచీపై దొర్లి గుచ్చుకుంటూన్నాయిగా


31) మునివేళ్ళతో పెదవులను ముద్దాడినట్టు నాకో కల
మధువు నాపై చిమ్మినట్లుంది మ్మ్మ్...మరెవ్వరి పిలుపూ వినిపించనంతమత్తుగా ఉంది


32) వదలనివి కొన్నుంటాయి..వదల్లేనివీ కొన్నుంటాయి
వదులయ్యే కొద్దీ బిగుసుకునేవి అపురూపమైనవి..అద్బుతమైన భావలవే


33) వెలుగు నీడలు కన్నీళ్ళై నను దాటి పోతూంటాయి
గుప్పెడు జ్ఞాపకాలు వేళ్ళ సందుల్లోంచీ జారిపోతున్నాయి


34) మనసు కలంలోంచి నెత్తురు ఒలుతుతోంది
అక్షరాలా? పాండిత్యమా? కాదు ఇది సంవత్సరాల నా మూగవేదన"


35) పగలంతా ఒద్దికగా కూర్చున్న జ్ఞాపకం
ఉండుండి వీచేగాలిలా వళ్ళు విరుచుకుని రాత్రి నా మనసుపై దాడి చేస్తుంది


36) దేహపు అంచుల్ని దాటేసిన ఓ అనుబందం నిన్ను కాదని
నింపాదిగా ప్రవహించే కొత్తదనంకోసం ప్రాకులాడి..ఉప్పెనలో కొట్టుకపోతుంది


37) ప్రశ్నలను పిడికిలిలో బంధించాలను చూస్తాను
హృదయపు పునాదులలో "మౌనం" గాయమై వేదిస్తుంది


38) ఎంత కాదనుకున్నానిశ్శబ్దం వెంటాడుతూనే ఉంది..
మౌనం తప్ప మాట్లాడే భాషలేవి లేనపుడు…గుండె గింజుకుంటూనే ఉంది


39) క్షణంచాలు నీ కంటిపాపనుంటి నన్ను నెట్టెయ్యడాంకి
కాని జీవితం కూడా సరిపోదు నా వేదన వ్యక్తం చెయ్యటానికి నిజమే కదూ ..?


40) నీ అంగీకారం దొరకక పంజరంలో ఉన్న పావురంలా
ఉంది నా ప్రేమ బయటకి రావాలని నీ మనసుని చేరాలని ఎదురుచూస్తుంది..?


41) నా మనసులొ ఒక్కొకటిగా గుచ్ఛుకుంటున్నాయి ఎగసిపడే
కెరటంలా ప్రతిరోజు నిన్ను చేరుకుంటున్నాను నీరాశతో తిరిగి వెనక్కి వెళ్ళిపొతున్నాను


42) మాటల గారడీలోపెదవుల వెనక పగిలిన నిజాలనూ..
ఎదురు చూసిన చూరుల వెంట ఆవిరయిన ఆశలనూ కూల్చుతున్నావెందుకో


43) మనసు తవ్వి జ్ఞాపకాలు పూడ్చిత్యాగమనో ఫలకన్ని తగిలించి
ఆశ నీళ్ళతో అభ్యంగన గుండె పెంకుల్లో పగిలిన గతం ముక్కల్లో నీకై ఎదురు చూస్తున్నా


44) పిలిచి నాలుక పిడచకడుతున్నా..ఎదురు చూసిచూసి కళ్ళు ఎర్రబడ్డా
శ్వాస బదులు సెగలు రేపుతున్నా నీకై చూస్తూ నీవస్తవనే ఆశతో ఉన్నా ఇప్పటికీ


45) నా గుండె కరిగిపోతోంది..నీ కై నా మనసు అట్టుడికిపోతోంది..
నీకేమైనా చేయాలి ? ఏమిచెయ్యనూ ? ఏం చెయ్యలేను నీదరికి చేరలేను కదూ...?


46) కనులముందు కరిగిపోతున్న కాలం ఆనంతమే,
మనసులో నిండిపోతున్న కన్నీళ్ళు ఆనంతమే మరి నేను అంతరించిపోతున్నా తెలుసా


47) పదిమంది ఉంటే ఫ్యాషన్ కాదు
పదికాలాల పాటుంటే "స్నేహాన్ని" ఎప్పటీనీ మరువకు...


48) నీ ఎదురుగా సాత్వికుడు..బుద్దివంతుడు
మందుకొట్టిన స్నేహితుల ముందు నిన్నో "వ్యాప్" ను చేస్తున్నాడు జాగ్రత్త


49) అది నిజంకాదు .. నీడ
తోడుంది అనుకొంటున్నావు తోడేలై నీమీదకు దాడిచేస్తుంది జాగ్రత్త


50) నిన్ను నిన్నుగా గుర్తించేవాళ్ళున్నా
"నీడ" వెంటపడుతున్నావు జాగ్రత్త...నీవు నీవుగానే ఉండు ప్లీజ్


51) వీళ్ళకు నిజాలొద్దు .. పొగడ్తలు కావాలి
ఎదురుగా కాదు పక్కన మాట్లాడే వాళ్ళ మాటలు కూడా విను


52) నిన్ను పదిమందీ పొగడాలి గొప్పగా అనుకుంటా కాని
రంగుల కలలు..పొట్టి బట్టలు...చికటి లైట్లు...కొండల్లో గుట్టలో స్నేహాలా


53) జివితం అంటే అర్దనగ్న ఫొటోలా
నీ ఎదురుగా కాదు నీవు లేనప్పుడు అన్నమాటలిను చచ్చిపోతావ్


54) అన్నీ నిజమని నమ్మా
నిజం నీడల్లో దాగి ఉన్న అబద్దం అని తెల్సి నమ్మలేకున్నా


55) క్షణ కాలం మెరిసిన మెరుపుల కాంతుల మధ్య
కరిగిన కాలం మిగిల్చిన నీ తియ్యని జ్ఞాపకాలని ఎన్నని మనసుదోసిటలో దాచుకోను


56) తనివితీరని తీయని నా తలపులు నాకు మిగిల్చి నీవు
చిత్రమైన ఒక అందమైన చిరునవ్వు విసిరావు అచ్చం ఆ జాబిలిలా..నిజంకాని నిజంలా


57) కలసివున్న క్షణాలను మరిక కలవమేమోనన్న అనుమానం
అబద్దంతో నీవు ... నిజంతో నేను ...ఎప్పటికీ కలవలేని జీవన సమాంతర రేఖల్లా


58) రెప్ప వెనకాల ఉబికిన నీటి చుక్క నిజాలవేడిని తట్టుకోలేక ఆవిరయ్యింది
నీ మౌనంతో పదునెక్కిన వలపుబాకు గాయాన్ని మిగిల్చి మాయమయ్యింది


59) నిశ్శబ్దపు రాత్రిని నేనింకోసారి ఎవరికీ తెలియకూడదని
మరేవరికీ అందని సుదూర తీరాలకు లాక్కెలుతున్నాను...నిన్ను చేరకూడదని


60) నీడలు కమ్మిన ప్రపంచంలో
వెలుగును ఇముడ్చుకున్న నీకోసం ఎక్కడని వెతకను


61)  హృదయ ఫలకం మీద నీవు విస విసా
నడిచిన పాదాల గుర్తుల చిహ్నాలు ఇంకా అక్కడే ఉన్నాయి


62) ఆలోచనలో మునిగి..అర మూసిన నా కనురెప్పల
నుండి తనదారెతుక్కుంటూ ఓ కన్నీటి చుక్క అ కిందకు జారిపోతే..


63)  నేలకొరిగిన నా దేహం సాక్షిగా
కుళ్ళిపోయిన జ్ఞాపకం నన్ను ప్రశ్నిస్తోంది..


64) కాలం పేజీలు వెనక్కు తిప్పుతూ
మనగతాన్ని తవ్వుకుంటున్నా..నాకు మిగిలింది సూన్యమే


65) మళ్ళీ ప్రకృతిలోకి రావాల్సివస్తే...
అడవిగా పుడతాను పుడమితో చెలిమి చేస్తాను.


66) మనస్సు అద్దమైంది ...మౌనం బద్దలైంది

67) నీ మౌనం నా మనసును గాయం చేసినప్పుడు,
శూన్యంలో మాటలు వెతకలేక నాలో మాటలు నాకే వినిపిస్తున్నాయి


68) ధ్వని లేని ద్వారంలో
మౌనం రారమ్మని పిలిచింది..నిన్నా నన్నా ..?


69) నీవు దూరం అవ్వడం దూరమవుతావో అని
భయపడ్డ క్షనాలు దగ్గర అవ్వడం నిజంగా నరకమే కదూ...?


70) అబద్దంలో హాయిగా బ్రతుకుతున్నావ్
నిజాన్ని తాకాలని చూడకు తగలబడిపోతావ్


71) చెమ్మగిల్లిన నీ కళ్ళు చెబుతున్నాయి
నీగుండెకు నేనెంత చేరువగా వున్నానో అని


72) చీకటితెరల్ని చించుకుంటూ..పారిపోతున్న నన్ను నేను పట్టుకోవాలని
వెలుగుపొరల్ని కౌగిలించుకుంటూ..పరుగులు పెడుతున్నా గమ్యిం దొరకలేదు...?