. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, March 23, 2014

నాలో రగిలి నన్ను నిలువునా కాల్చేస్తున్న నిజాలు

ఎన్నో నిజాలు నీకు 
చెప్పాలని చూస్తున్నా
అవి నిజాలు కదా 

అందుకే నిన్ను చేరడంలేదు
నాలో రగిలి అగ్నికనాలై 

నన్నే కాల్చేస్తున్నాయి 

నీవు లేని నేను 
లేనని తెలుసు నీకెపుడో
తెలిసి నేను నిన్ను చేరినా
తెలియక నే పడిన వెతలెన్నో
తెలియని అఙ్ఞానాంధకారంలో
అలసి సొలసి నేను తిరుగుతుంటే
తెలిసీ తెలియనట్లు 

వెన్నంటే ఉంటూ
జాడ తెలియనీకుండా..
బ్రతుకు సమిధలో 

ఆజ్యం పోస్తున్నావు
నీ ఊహలు నా మది 

నిండా నింపుకుని
నీ సందిట చేరాలని 

కలలు కంటూ వచ్చాను
నీవు కనిపించలేదని 

విలపించానే గాని
నింగి నీ సదనమని, 

వెన్నెల నీ వదనమని
కళ్ళుండీ చూడలేక పోయాను
నీ చేతిలో చెయ్యేసి
పున్నమి వెన్నెల వెలుగుల్లో
కృష్ణా తీరపు ఇసుక 

తిన్నెల్లో అడుగులెయ్యాలని
పొంగి పోయనేగాని
పొంగి పొరలే తరంగాలు
నీ మేని పొంగులని
తెలివుండీ 

తెలుసుకోలేక పోయాను
నీ పలుకు కోసం, 

నీ చల్లని చూపు కోసం
వీనులను వినువీధిలో పరిచాను
నీ పలుకు కోసం 

నా గుండె చప్పుడాపుకున్నాను
నీ రాకకై నేలనై పచ్చని 

తివాసీ పరిచాను
దారి చూపేందుకు 

నే వెన్నెలనౌదామనుకుంటే
నెల సగమే వెలిగే వెన్నెల 

కావొద్దని మనసొకటే గోల!
సముద్రమంత సంబరంతో
నీ చంద్ర వదన శోభకు
తరువుల పచ్చదనాన్ని

వెన్నెల చల్లదనాన్ని
పారిజాత పరిమళాలతో రంగరించి
మదిలోని భావ తరంగాల్ని
అనురాగ రసాల్లో కలిపి ముద్ద చేసి
నీ సుతి మెత్తని పాదాలకు పారాణి పూయాలని
నీ పలకరింపుతో పులకరించాలని
నీ ఎద సందిట పరవశించాలని
నా తనువంతా కళ్ళుగా నిరీక్షిస్తున్నా…
ఎదురు చూపుల్లో…
ఎంతో ఆనందం ఉంటుందంటారు
నీ ఎదురు చూపుల్లో నాకెందుకింత విషాదం
పదే పదే…
నీవు సంచరిచే దారుల్లో వేచి ఉంటానా!
అక్కడేమున్నాయని?
నువ్వు లేవు నవ్వుల్లేవు
మనసు లేదు మమతల్లేవు
చూపుల్లేవు ప్రేమల్లేవు
అంతా విషాదమే…
అయినా నీ కోసమే నా నిరీక్షణ

వసంత కాలం లో ఆమని కోయిల
ఎంత ఆనదంగా గీతాల్నాలపిస్తోంది
నా విరహాగ్నిని ఏ మాత్రం చల్లార్చలేని
అ గీతాల్ని ఎలా ఆస్వాదించను
కళ్ళన్నీ దు:ఖ జలధులై వర్శిస్తుంటే
ఓదార్పునిచ్చే తోడు లేని జీవితంతో
ఎంత కాలమీ పోరాటం?

నీ విరహంలో నేనొక సమిధను
నేనెట్లా కాల్చను…
స్వయంగా నేనే కాలిపోతుంటే!
నువు నాకంటే ముందుగా
నా దారిలోనే 

వెలుతున్నావని తెలిసింది
అయినా నిన్ను చేరలేకున్నాను
నువ్వెలా ఉంటావో చూసిరమ్మని
చందురున్ని పంపా
నీ అందం చూసి గులామై
నీ నుదుట సింధూరమయ్యాడని
తరవాత తెలిసింది
నా శరీరాన్ని ముక్కలుగా చేసి
చుక్కలుగా పంపా…
మోసం చేసి..
నీ చెక్కిట కెంపులయ్యాయి
వాయువుని పంపా..
నీ సమాచారం చెప్పమని…
సమస్త ప్రాణికి ఆహ్లాదం 

పంచుతున్నాడంట నీతో కలిసి
వరుణిన్ని పంపా నిన్ను 

ముద్దగా తడపమని
అపుడైనా చలికి వణుకుతూ…
నా బాహువుల్లో ఒదిగిపోతావని
శూన్యం నుండి 

రాలే ప్రతి చినుకునూ
నిన్ను చేరనివ్వడం 

లేదు  చీకటి 
అలుముకున్న రాత్రులు
అందుకే నిన్ను చేరాలనే తొందరలో

నేను ఆభూమిలో మట్టినై కల్సిపోతున్నా