గుండె గదుల్లోనుంచి
నేల తాకిన నిశ్శబ్దశ్శబ్దం..
విస్ఫోటనం చెంది ..
నిశ్శబ్దం మౌనంగా
విచ్చిన్నమౌతోంది
పగిలి ముక్కలైన హృదయాన్ని
ఇంకా ముక్కలు చేస్తూనే ఉంది
మది తలపులను తాకిన
జ్ఞాపకాలు విచ్చుక
కత్తులై గుచ్చుకుంటూన్నాయి
ఏవీ కాకపోడానికీ..
అంతా అయిపోడానికీ మధ్య
కనురెప్పలు ఒకట్రెండు
సార్లు కొట్టుకుంటాయంతే
నా గుండెలో అలజడి నీవు కాకపోతే
ఎవరు తెల్సుకుంటారు
నన్ను నీవు కాకపోతె
ఎవరు అర్దం చెసుకుంటారు
అయినా నా పిచ్చిగాని ..
నన్ను ఎప్పుడో మర్చిపోయావు
ఇంకా నేను గుర్తుంటానా
అని ఎందుకు నాకీ కలవరింత
నీలో నుండి నన్ను
కాదని నన్ను ఒంటరిని చేసి
విరిగిపడిన మహానమ్మకం
శకలాలన్నీ సెలయేట్లో గులకరాళ్ళల్లా
గుండె లోతుల్లో సర్దుక్కూర్చున్నాక
మిగిలేది సుదీర్ఘ మౌనం
అదీ చేతకాని క్షనాల్లొ
నాకు మిగిలేది శాశ్విత నిశ్శబ్దమేగా
నేల తాకిన నిశ్శబ్దశ్శబ్దం..
విస్ఫోటనం చెంది ..
నిశ్శబ్దం మౌనంగా
విచ్చిన్నమౌతోంది
పగిలి ముక్కలైన హృదయాన్ని
ఇంకా ముక్కలు చేస్తూనే ఉంది
మది తలపులను తాకిన
జ్ఞాపకాలు విచ్చుక
కత్తులై గుచ్చుకుంటూన్నాయి
ఏవీ కాకపోడానికీ..
అంతా అయిపోడానికీ మధ్య
కనురెప్పలు ఒకట్రెండు
సార్లు కొట్టుకుంటాయంతే
నా గుండెలో అలజడి నీవు కాకపోతే
ఎవరు తెల్సుకుంటారు
నన్ను నీవు కాకపోతె
ఎవరు అర్దం చెసుకుంటారు
అయినా నా పిచ్చిగాని ..
నన్ను ఎప్పుడో మర్చిపోయావు
ఇంకా నేను గుర్తుంటానా
అని ఎందుకు నాకీ కలవరింత
నీలో నుండి నన్ను
కాదని నన్ను ఒంటరిని చేసి
విరిగిపడిన మహానమ్మకం
శకలాలన్నీ సెలయేట్లో గులకరాళ్ళల్లా
గుండె లోతుల్లో సర్దుక్కూర్చున్నాక
మిగిలేది సుదీర్ఘ మౌనం
అదీ చేతకాని క్షనాల్లొ
నాకు మిగిలేది శాశ్విత నిశ్శబ్దమేగా