గతం ప్రతిక్షనం నన్ను
గాయపరుస్తూనే ఉంది
చీకటిలో నిద్రపోదామంటే
వెలుతురులో రాచుకున్న
జ్ఞాపకాలతో
నిద్ర పట్టని రాత్రులెన్నో….
నిన్నను మరచిన
నేటి సాక్షిగా
గతంచేసిన
గాయం సమక్షంలో
గుండె బరువు
తీర్చుకోవటానికి.
కనుకొన నుంచి
ఆగి ఆగి రాలుతున్న,
ఒక్కో కన్నీటి చుక్కలో
నిండుకున్న నీ తలపులతో
తడిసిన తలగడ
చెంపకు ఆని
గుండె తడిని
గుర్తుచేస్తుంది ప్రతీ రాత్రి…
అందుకే అవన్ని
నిశిరాత్రుల్లుగా మిగిపోయాయి
నిద్ర పట్టని రాత్రి
నాలో నన్ను
లేకుండా చేస్తున్నాయి
జ్ఞాపకాలు నన్ను
ముసురుకుంటాయి
నిద్రలేని తనంలో కొన్ని జ్ఞాపకాలు
పారిపోయినట్టే పోయి
మళ్లీ కమ్ముకుంటాయి….
కసిరించుకుంటాయి
కుళ్ళ బొడుస్తాయి
యనిండా గాయాలు చేస్తాయి
ఎవ్వరూ లేని ఒంటరి
అంటూ వెక్కిరిస్తాయి
నిన్నటి అనుభవం
అక్కడే ఆగిపోతుంది
నేటి భావం ఇక్కడే
నన్ను ముంచేస్తుంది
అనుభవం పాఠాలు
నేర్పినా నిజాన్ని దాచలేంగా
ఏమో..ఏంటో ..
అవును కాదుల నడుమ
ఊగిసలాడుతూనే
వుంటుంది పిచ్చి మనసు.
అది నిన్నే తలసూ
ఇంకా నిన్నే నమ్ముతొంది మరి
గాయపరుస్తూనే ఉంది
చీకటిలో నిద్రపోదామంటే
వెలుతురులో రాచుకున్న
జ్ఞాపకాలతో
నిద్ర పట్టని రాత్రులెన్నో….
నిన్నను మరచిన
నేటి సాక్షిగా
గతంచేసిన
గాయం సమక్షంలో
గుండె బరువు
తీర్చుకోవటానికి.
కనుకొన నుంచి
ఆగి ఆగి రాలుతున్న,
ఒక్కో కన్నీటి చుక్కలో
నిండుకున్న నీ తలపులతో
తడిసిన తలగడ
చెంపకు ఆని
గుండె తడిని
గుర్తుచేస్తుంది ప్రతీ రాత్రి…
అందుకే అవన్ని
నిశిరాత్రుల్లుగా మిగిపోయాయి
నిద్ర పట్టని రాత్రి
నాలో నన్ను
లేకుండా చేస్తున్నాయి
జ్ఞాపకాలు నన్ను
ముసురుకుంటాయి
నిద్రలేని తనంలో కొన్ని జ్ఞాపకాలు
పారిపోయినట్టే పోయి
మళ్లీ కమ్ముకుంటాయి….
కసిరించుకుంటాయి
కుళ్ళ బొడుస్తాయి
యనిండా గాయాలు చేస్తాయి
ఎవ్వరూ లేని ఒంటరి
అంటూ వెక్కిరిస్తాయి
నిన్నటి అనుభవం
అక్కడే ఆగిపోతుంది
నేటి భావం ఇక్కడే
నన్ను ముంచేస్తుంది
అనుభవం పాఠాలు
నేర్పినా నిజాన్ని దాచలేంగా
ఏమో..ఏంటో ..
అవును కాదుల నడుమ
ఊగిసలాడుతూనే
వుంటుంది పిచ్చి మనసు.
అది నిన్నే తలసూ
ఇంకా నిన్నే నమ్ముతొంది మరి