. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, March 6, 2014

ఓ నిజం మరొ నిజాన్ని దాచి ఎవ్వరూ చూడలేరు అనుకొంటుంది

నాలో నేను మాట్లాడుతుంటా
వెన్నులో  వచ్చే అలజడిలో
నిన్ను చూడాలనే ఆరాటం 

గుండెల్లోంచి తన్నుకొస్తుంది
నీతో మాట్లాడాలనే 

ఉద్వేగం అధరాలపై
ఆత్రంగా నీపేరును పలుకుతొంది
నీ జ్ఞాపకాల ఆలోచనలు
ఉత్తుంగ తరంగమై 

ఎగసిపడుతుంటే
నేనేం కోల్పోయానో 

ఇప్పుడర్దం అవుతోంది
మనిద్దరి మధ్య జరిగిన  

మాటలన్నీ పోగేసి 
గుట్టలుగా చేసి నీ దగ్గరకొస్తే 
దగ్గరితనం దూరం అవుతోంది
నన్ను నేన్ దూరం అయ్యేలా చేస్తుంది
ఓ నిజం మరొ నిజాన్ని దాచి
ఎవ్వరూ చూడలేరు అనుకొంటుంది
అవమానంతో  తాళం 

పడిన నాలుక మౌనం దాల్చి
మడతపడిన నాలుకపై 

పన్ను దిగి రక్తం కారుతోంది
పోగేసుకొచ్చిన 

మాటలన్నీ ఎర్రగా మారాయి
రక్తాక్షరాలుగా మారాయి
కాని నాగుండెల్లో 

ఉన్న నీ చిరునవ్వులు
తెగిన దండలోని 

ముత్యాల్లా రాలిపోతున్నాయి
కాని పట్టుకుండామంటే దొరకలేదు
ఆ ముద్యాలను ఎవరో 

ఏరి నీమెడలో దండగా చేసి
నిన్ను అలంకరిస్తున్నారు 

నీవు సిగ్గుపడుతున్నావు
లిపి లేని చూపులైనా 
సూటిగా భావాన్ని
అర్దం చేసుకొవాలని 

నా మనసు పుటలు వెతికినా
అంతా చీకటిగా ఉంది 

ఏం కనిపించడంలేదు
నా మనో వేధనను కళ్ళల్లో 

నింపుకుని నీ ముందుకొస్తే
నీ చూపుల ఉప్పెనలో 

పడి నా చూపులు 
కొట్టుకు పోతే
ఒణికి తొణికిసలాడే 

మనసును ఉగ్గపట్టుకుని
గొంతు పెగల్చుకుని 

మాటలు రూపం దాల్చేలోగా
కనుమరుగై పోతావు
గుండె గొంతుకలో 

నలిగి పోయిన భావాలు
నిశ్శబ్ద గీతాలై నన్ను 

వెక్కిరిస్తున్నాయి.
ఈ నిశ్శబ్డం ఇక 

శాశ్వితమనిపిస్తుంది
అందుకే చీకటిలో 

ఒంటరిగా ఉండాలనిపిస్తోంది