ప్రేమ అంటే భయం ఎక్కడ కాల్చేస్తుందోనని
కలలంటే భయం ఎక్కడ భగ్నమవుతాయోనని
అన్నింటికంటే ఎక్కువ భయం
నన్ను నువ్వెక్కడ మరిచి పోతావేమోనని
దూరంగా ఉన్నా ఎల్లప్పుడూ నిన్ను కోరుకుంటాను
స్నేహితున్నై దగ్గరకు రాకున్నా
నా స్నేహ పరిమళం
నిన్ను చుట్టుముడుతూనే ఉంటుంది
ఆ భగవంతుడు
అప్పుడప్పుడు నిన్ను ఒంటరిని చేసినా
ఆ ఒంటరి తనంలో నేనొక తుంటరి
కలనై నిన్ను వెంటాడుతూనే ఉంటా
చలి రాత్రుల్లలో నీకు
కంబలి దొరక్కుండా పోతే
అగ్ని శిఖలా నిన్ను అల్లుకుని
నును వెచ్చని నిట్టూర్పునవుతా
నిన్ను మరిచి పోతాననే భయమే వద్దు
మరిచి పోవడం అనేది
మనసు చేసే పని కదా!
నా దగ్గర మనసనేదే లేదు కదా!
అదెప్పుడో నీకిచ్చేసా కదా!
నన్ను నమ్ముతావుకదూ
నమ్మాలి నమంక తప్పదు
ఎందుకంటే నీఓ నేను లేనిప్పుడు
నాలో అంతా నీవే ఉన్నవూ ఎల్లప్పుడూ
కలలంటే భయం ఎక్కడ భగ్నమవుతాయోనని
అన్నింటికంటే ఎక్కువ భయం
నన్ను నువ్వెక్కడ మరిచి పోతావేమోనని
దూరంగా ఉన్నా ఎల్లప్పుడూ నిన్ను కోరుకుంటాను
స్నేహితున్నై దగ్గరకు రాకున్నా
నా స్నేహ పరిమళం
నిన్ను చుట్టుముడుతూనే ఉంటుంది
ఆ భగవంతుడు
అప్పుడప్పుడు నిన్ను ఒంటరిని చేసినా
ఆ ఒంటరి తనంలో నేనొక తుంటరి
కలనై నిన్ను వెంటాడుతూనే ఉంటా
చలి రాత్రుల్లలో నీకు
కంబలి దొరక్కుండా పోతే
అగ్ని శిఖలా నిన్ను అల్లుకుని
నును వెచ్చని నిట్టూర్పునవుతా
నిన్ను మరిచి పోతాననే భయమే వద్దు
మరిచి పోవడం అనేది
మనసు చేసే పని కదా!
నా దగ్గర మనసనేదే లేదు కదా!
అదెప్పుడో నీకిచ్చేసా కదా!
నన్ను నమ్ముతావుకదూ
నమ్మాలి నమంక తప్పదు
ఎందుకంటే నీఓ నేను లేనిప్పుడు
నాలో అంతా నీవే ఉన్నవూ ఎల్లప్పుడూ