తనలోని సుఖాన్ని తనకే తిరిగి ఇచ్చే మరో సాధనం కోసం వెర్రెక్కిన శరీరపు కేకలు, ఏ అస్థిపంజరాల్ని కప్పిన అవసరాల్నో చేరిన చోట- ఎవరివో స్త్రీ దేహాలు, స్నేహాలు, దాహాలు, మోహాలు. మొహంమొత్తుళ్ళు, విదిలింపులు, వదిలింపులు, డబ్బుల ఎరలు, ఏ చెట్టువో రాలి నీటివాలుకి కొట్టుకొచ్చిన అడివి పూలతో నిన్ను నీ మనసును అలకంరించి నన్ను ఏమార్చిన నీ జ్ఞాపకాలను ఏమని చెప్పను నేనెవరని తెలియజేయను .. నాలో నేను నలిగి అడవిలో పడీన ఎండుతాకుల్లా మనిద్దరి జ్ఞాపకాలను తొక్కుకుంటూ వెల్తున్నావుగా అప్పటిదాకా ఎక్కింది దిగితూ, అప్పుడే లోపలికి దిగింది నరాల్లోకి ఎక్కుతున్న మైకంతో, తడిపిన కొద్దీ ఎండిపోతున్న గొంతుతో- ఎక్కినమెట్లు దిగుతున్నానో, దిగవల్సిన మెట్లు ఎక్కుతున్నానో మెట్లకే తెలియాలి. నీడనుంచి నిజాన్ని విడదీసి చూపడానికి విషపుటాలోచనలు చేస్తున్న మోసపు ఉదయాన్న; నిశ్చింతగా పడుకున్న రాత్రినెవరో రాక్షసంగా నేల అడుక్కి తొక్కేస్తుంటే, ఆ ఊపుకి రోడ్డుమీద తూలిపడుతున్న ప్రతీ జ్ఞాపకాన్ని కేర్లెస్ గా చూసుకుంటూన్న నీ అభిమానానికి నేను ఎలా కృతగ్నతలు చెప్పను అదంగా ఉన్నావు .. అందంగా నవ్వుతున్నావు ... నన్నెందుకు ఇల నట్టేటీలో ముంచేసి వెల్లిపోయావు నీలాగే నీగది కూడా నేనకున్నట్టే ఉంది. నేలంతా పరుచుకున్న పుస్తకాలు, టేబుల్
మీద ఒలికిపోయిన ఇంకు మరకలు, కానీ వంటి మీద స్పృహేదీ? పక్కన సూసైడ్
నోటేదీ? డస్ట్ బిన్ లో చింపిపారేసిన డైరీ కాయితాల మధ్యలో రెస్టిల్ షీట్లు ఏ
వివరాలూ చెప్పవు. అసలెవరైనా ‘నా చావుకెవరూ కారణం కాదు ‘ అని రాసానంటే అ
కారణమైన వాళ్లని కాపాడ్దానికే అని అర్థం. మరి అసలేమీ రాయకుండా ఇలాటి పని ఏ
చివరి జ్ఞాపకాన్ని కాపాడ్డానికి?నలిగిన మనస్సుతో నేనేంటో తెలియని స్థితిలో నన్ను నేను తగలబెట్టుకుంటున్న కన్నీటినే పెట్రోల్ గా చేసుకొని ...అన్ని నీకు తెలుసు కాని ఏం తెలియనట్టు .. నేనసలు పరిచ్యమే లేనట్టూన్న నిన్ను చూస్తుంటే .. మౌనంలో నన్ను నెను ఎన్ని సార్లు తిట్టుకున్నానో...