జ్ఞాపకం మనిషి కథని
తనలోనే దాచుకొని
నిజం నిర్జీవమై
మౌనం దాల్చి
పునర్జీవనమే
తెలీని దాని మల్లే
తనలో తానే ఒదిగిపోతోంది
మనిద్దరిజ్ఞాపకాలు
రక్త దీపార్చనల
జాతర జరుపుకుంకుంటున్నాయి .
కంటీకి కనిపించని దారుణాలు
కటిక చీకట్లో జరిగిపోతున్నాయి
నీవు ఎవ్వరికీ తెలియదు
అనుకుంటున్నా
చెప్పాలిసినవాల్లు చెప్పుకొంటూ
గుస గుస లాడుకుంటూనే ఉన్నారు
నీకు తెలియకుండా నమ్మక ద్రోహం
జరిగిపోతూనే ఉంది నీవు
గుడ్డీగా నమ్ముతూనే ఉన్నావు
ఇది నింగికి ,నేలకు
ఇప్పటిది కాదు వైరం
ఆత్మ మాయని
జార విడిచినప్పటి నుండి ..
నిజంస్వాపికుడి
దేహాన్ని వదలి
ఆత్మ అర్ధంతరంగా
వెళ్లి పోతుంది ఎవ్వరూ
చూడకూడదనేమో కదూ
మట్టిలో మమతలు
మయమై పోయి
మరణం లోకి ఎగిరి
పోతున్నాయి
కలలన్నీ దుఖం తో
నిండి పోయి
దూరంగ జ్ఞాపకాలను
విసిరేస్తున్నాయి
ఓ నిజాన్ని గర్భం
చీకట్లలో దాచుకుంటుంది …
గొంతు విప్పి చెప్పాలని ఉన్నా
నీవే నాగొంటు వినకూడదని
గొంతు నోక్కేసావు
మరి జరుగుతున్న
వాస్తవాలు నీకెలా చెప్పను
తనలోనే దాచుకొని
నిజం నిర్జీవమై
మౌనం దాల్చి
పునర్జీవనమే
తెలీని దాని మల్లే
తనలో తానే ఒదిగిపోతోంది
మనిద్దరిజ్ఞాపకాలు
రక్త దీపార్చనల
జాతర జరుపుకుంకుంటున్నాయి .
కంటీకి కనిపించని దారుణాలు
కటిక చీకట్లో జరిగిపోతున్నాయి
నీవు ఎవ్వరికీ తెలియదు
అనుకుంటున్నా
చెప్పాలిసినవాల్లు చెప్పుకొంటూ
గుస గుస లాడుకుంటూనే ఉన్నారు
నీకు తెలియకుండా నమ్మక ద్రోహం
జరిగిపోతూనే ఉంది నీవు
గుడ్డీగా నమ్ముతూనే ఉన్నావు
ఇది నింగికి ,నేలకు
ఇప్పటిది కాదు వైరం
ఆత్మ మాయని
జార విడిచినప్పటి నుండి ..
నిజంస్వాపికుడి
దేహాన్ని వదలి
ఆత్మ అర్ధంతరంగా
వెళ్లి పోతుంది ఎవ్వరూ
చూడకూడదనేమో కదూ
మట్టిలో మమతలు
మయమై పోయి
మరణం లోకి ఎగిరి
పోతున్నాయి
కలలన్నీ దుఖం తో
నిండి పోయి
దూరంగ జ్ఞాపకాలను
విసిరేస్తున్నాయి
ఓ నిజాన్ని గర్భం
చీకట్లలో దాచుకుంటుంది …
గొంతు విప్పి చెప్పాలని ఉన్నా
నీవే నాగొంటు వినకూడదని
గొంతు నోక్కేసావు
మరి జరుగుతున్న
వాస్తవాలు నీకెలా చెప్పను