నీకు దగ్గరవ్వాలని
నా అనుకునే ప్రపంచాన్ని వదిలేసాను
అపుడు తెలీలేదు
నీకు దగ్గరయ్యే పయనంలో
నాకు నేనెంత దూరమయ్యానో అని
నీకోసం ప్రపంచాన్ని నేను మర్చిపోతే
ప్రపంచాన్ని నమ్మి నువు నన్ను మర్చిపోతున్నావు
ఇపుడు నువు నాకు దూరమైతే
నా లోకం శూన్యం
నీకూ నాకూ మధ్య అడ్డుగా ఓ చీకటి తెర
అపార్ధాల ఊపిరి పోసుకున్న నిశ్శబ్దం
నా మాటలు వినే తీరిక
మనసు పంచుకునే ఓపిక
నీకు లేదు
అందుకే.....
వేదనతో రగిలే మనసుని
కన్నీటితో చల్లారుస్తూ
నా ఊపిరిని గాలిలో కలిపి
నీ వైపు పంపుతున్నాను
నువ్వొద్దన్నా నిను తాకొచ్చనే స్వార్ధంతో..