కనిపించ వెందుకు
ఎందుకంత సిగ్గు..
మొహమాటమా..నాతో చెలగాటమా
వాలుజడ..వయ్యారాలు కనిపిస్తున్నా
చిరునవ్వుల మోను నేను చూడలేకున్నా
మెడ వంపులు .నడుము సోయగాలేనా
మనసును చివుక్కు మనిపించే ఆ చిరునవ్వు చూడనీ
వెన్నెల వెలుగుల్లో నీ మోము చూసే అవకాసం లేదా
ఏంటి యదలొ మ్రోగే గంటలు ఎవరు మ్రోగిస్తున్నారు
అన్నీ చేస్తూ ఎం చేయనట్టు ఎందుకలా మొహం దాచుకున్నావు
మొహమాటమా మమకారమా మదిలో నీవు చేస్తున్న కలవరమా
ఎంటీ అలజడీ ఎందుకీ కలవరం ..నీకెందుకు నాపై గరం గరం
అర్దం అయింది నీ నడుమును పదాలతో తడిమాననేకదా నీకోపం
నీ మెడ సొంపుల సోయగాన్ని వర్నించా ననేగా నా పై అలక..
అటు తిరిగి వాలు జడ నావైపు తిప్పి మొకాన్ని దాచుకున్నా
ఎదురుగా ఉన్న వెన్నేల్లో నీ మోమును చూస్తున్నాలే
చిరుకోపంలో చిరునవ్వు నవ్వుతూ ఎంత్ అందంగా ఉన్నావో
ఆ అందం చెప్పతరమా ..మనసు గురి తప్పిన క్షనం