ఈ రాత్రి బ్రతుకు పండినట్లుంది
తన చంద్రుని గుండెకు హత్తుకుని
తానొదిగి తమకంలో నిద్దరోతుంది
ఇటు చూడు వేదన బల్లమీద
ఓ ఆశ ఒంటరై ముఖం దాచుకుని
ఏడ్చి అలిసి బేలగా ఒదిగి కూర్చుంది మన జ్ఞాపకం
తోడు దొరకని ఆశకు ఈడు జారింది
నీ జాడ కానక తాను గోల చేసింది
నీడతోనే తన గోడు చెప్పుకుంటుంది
వింటావులే అని కాని ఏంటొ
నేను చెప్పెవి నేచెవికిచేరుతున్నాయో లేదో
కలల విత్తులు నాటుతున్న మనిషికి
కొమ్మంటు జోడీలు వెదికే మనసు,
ఊహలకి ఆలంబన తరిచే మనసుకి
అరచేత స్వర్గాల మురిసే మనిషి
మనసు అంతరంగాల్లొ అలిగిన
కరిగిన కాలాన్ని ఎప్పుడు తీసుకురను
నవ్వే కన్నులు .. మౌనపు మాటల నిశ్శబ్దంలో
నాకు కావాల్సిన మాటలు దొరుకుతాయో లేదొ
అవి ముత్యాలై నీ మెడలో చేరాక
నేణు చేసే ఈ ప్రయత్నం ఫలిచేనా
ఇంద్ర ధనుస్సుల సమూహానికీ,
నడుమ దారి తప్పిన క్షణానికీ,
ఎంతేమిటి ఎడబాటు?
మనసులో మనిషున్నంతవరకు
కలల రంగవల్లులు కోటానుకోట్లు.
జవరాలి గాజుల సవ్వడి మోహనరాగమే కదూ
కనుచూపుమేరలో కనిపించని నీ కన్నుల రెపరెపలు
మది చాటున దాగి ఉన్న మూగభాషకు అర్ధలు ఎక్కడని వెతకను
తన చంద్రుని గుండెకు హత్తుకుని
తానొదిగి తమకంలో నిద్దరోతుంది
ఇటు చూడు వేదన బల్లమీద
ఓ ఆశ ఒంటరై ముఖం దాచుకుని
ఏడ్చి అలిసి బేలగా ఒదిగి కూర్చుంది మన జ్ఞాపకం
తోడు దొరకని ఆశకు ఈడు జారింది
నీ జాడ కానక తాను గోల చేసింది
నీడతోనే తన గోడు చెప్పుకుంటుంది
వింటావులే అని కాని ఏంటొ
నేను చెప్పెవి నేచెవికిచేరుతున్నాయో లేదో
కలల విత్తులు నాటుతున్న మనిషికి
కొమ్మంటు జోడీలు వెదికే మనసు,
ఊహలకి ఆలంబన తరిచే మనసుకి
అరచేత స్వర్గాల మురిసే మనిషి
మనసు అంతరంగాల్లొ అలిగిన
కరిగిన కాలాన్ని ఎప్పుడు తీసుకురను
నవ్వే కన్నులు .. మౌనపు మాటల నిశ్శబ్దంలో
నాకు కావాల్సిన మాటలు దొరుకుతాయో లేదొ
అవి ముత్యాలై నీ మెడలో చేరాక
నేణు చేసే ఈ ప్రయత్నం ఫలిచేనా
ఇంద్ర ధనుస్సుల సమూహానికీ,
నడుమ దారి తప్పిన క్షణానికీ,
ఎంతేమిటి ఎడబాటు?
మనసులో మనిషున్నంతవరకు
కలల రంగవల్లులు కోటానుకోట్లు.
జవరాలి గాజుల సవ్వడి మోహనరాగమే కదూ
కనుచూపుమేరలో కనిపించని నీ కన్నుల రెపరెపలు
మది చాటున దాగి ఉన్న మూగభాషకు అర్ధలు ఎక్కడని వెతకను