. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, August 29, 2014

ఆశతో నేను కాల్ చేసినపుడు దయచేసి నీవు ఫోను తీయ్ ప్లీజ్

ఆశతో నేను
కాల్ చేసినపుడు
దయచేసి నీవు
ఫోను తీయ్ ప్లీజ్ 
విసుగును కొంత సహించి
ఒక్క నిమిషమైనా  మాట్లాడు!
ఒక్కసారి నిన్ను 
కల్సి మాట్లాడతానని 
ఉబలాటపడితే
రాలేనని చీవాట్లు పెట్టు!
కబుర్లు చెప్పుకోవడానికైతే
కాలం విలువ నాకు తెలీదని  
గట్టిగా బెదిరించు!
కవిత్వం వినిపించడానికి
బలవంతం చేస్తే
అబద్దాలాడి
రాకుండా తప్పించుకో!
కలుసుకొనే ఇష్టం లేకపోతే
ఎగ్గొట్టడానికి
ఎన్నైనా నాటకాలాడు!
కాని -
ఒకసారి ఫోను తీసి పలుకు!
ఏ అవసరముండి
ఫోను చేస్తానో
ఎటువంటి ఆపదలో చిక్కుకొని
నీ ఆసరా కోరుతానో
నీ స్వరం విన్న నాలో 
కలిగే  భావాల తుంపరలతో 
నా మనస్సేంత  ఆనంద 
పడుతుందో నీకేం తెల్సు 
కరుణించి కాసేపు
నా ఆర్తనాదంతో
చెలగాటమాడకు!
రాంగ్ నెంబరొస్తే
కోపమొచ్చినట్టు
అవసరం లేని వాళ్లయితే
చూసీచూడనట్టు
అర్థించే ఆత్మీయున్నైన నన్ను 
గాయం చేయకు!
తెలిసిన పిలుపుని
తేలిగ్గా కొట్టేసి -
ఈ మిత్రుణ్ణి ఇంకా
ఏకాకిని చేయకు!
నా ఫోన్ బ్లాక్ లిష్ట్ల్ లో 
ఎందుకు పెట్టావు 
నేను నా మాట నీకెప్పటికీ 
వినిపిచకూడదనేగా 
నీవు రోజూ మాట్లాదే వాల్లలో 
నేను పనికిరాని వాన్ననేగా 
అంతలా నీకేం ద్రోహం చేసాను
అందరిలో నన్నిలా అవమానిస్తున్నావు