నాలో నేను ఒంటరితనాన్ని
ఆయుధంగా ధరించిన నేను
నాకు నేను గా కాకుండా
నీవు నాకు ఇచ్చిన
ఏకాంతం కదా ఇది
నా యదలో నీవు రేపిన గాయాలే
సాక్ష్యాలుగా నిలిచాయి
నీవు కాదన్న గతం మిగిల్చిన
గాయాలు చెప్పే నిజాలు ఇవి
చిటికేసి నక్షత్రాలని తనలో దాచుకొని
నీ చిర్నవ్వుతో చెట్లని చిగురేయించి
ఓర చూపుతో వంద జన్మల మన అనుబందాన్ని
గుర్తుకు తెస్తూనే నవ్వి నన్ను నమ్మించి
కల్లు తెరిచి చూస్తే కనిపించకుండా పోతావు
నీవు నడిచిన ఇసుక ఎడారుల్లో
నన్ను ఒంటరిగా వదలి పెట్టి
నాలో ని ఆనంద సాగరాల్ని
తరలించుకు పోయి చుట్టూ చీకట్లను వదలి
వెలుగును మరొకరికోసం తీసుకొనివెల్లావు
తనలో ప్రపంచాన్ని దాచుకొని
మనసుదోచుకున్న మాయావివి
నవ్వనూ గలవూ..
నవ్వి నట్టు నటించి
ఏడ్పించనూ గలవు
ఎమీ ఎరగనట్టు
మౌనంగా ఉండనూ గలవు
ఏదినా చేయగలవు
అన్నీ చేసి నేనేం చేసానని
తప్పంతా నామీద నెట్టి
తప్పించుకొని పోనూగలవు
ఆయుధంగా ధరించిన నేను
నాకు నేను గా కాకుండా
నీవు నాకు ఇచ్చిన
ఏకాంతం కదా ఇది
నా యదలో నీవు రేపిన గాయాలే
సాక్ష్యాలుగా నిలిచాయి
నీవు కాదన్న గతం మిగిల్చిన
గాయాలు చెప్పే నిజాలు ఇవి
నీ చిర్నవ్వుతో చెట్లని చిగురేయించి
ఓర చూపుతో వంద జన్మల మన అనుబందాన్ని
గుర్తుకు తెస్తూనే నవ్వి నన్ను నమ్మించి
కల్లు తెరిచి చూస్తే కనిపించకుండా పోతావు
నీవు నడిచిన ఇసుక ఎడారుల్లో
నన్ను ఒంటరిగా వదలి పెట్టి
నాలో ని ఆనంద సాగరాల్ని
తరలించుకు పోయి చుట్టూ చీకట్లను వదలి
వెలుగును మరొకరికోసం తీసుకొనివెల్లావు
తనలో ప్రపంచాన్ని దాచుకొని
మనసుదోచుకున్న మాయావివి
నవ్వనూ గలవూ..
నవ్వి నట్టు నటించి
ఏడ్పించనూ గలవు
ఎమీ ఎరగనట్టు
మౌనంగా ఉండనూ గలవు
ఏదినా చేయగలవు
అన్నీ చేసి నేనేం చేసానని
తప్పంతా నామీద నెట్టి
తప్పించుకొని పోనూగలవు