. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, August 29, 2014

ఆమె అడుగుల కింద నా "ప్రేమ" వాక్యం నిశబ్దంగా ముక్కలయ్యింది

నిద్ర ఒలికిన ఆ రాత్రంతా
ఆమె జ్ఞాపకాల్లో ఇటూ అటూ దొర్లుతుంటే
నాకు విరహపు మరకలు అంటుకొని
నా మనసంతా గాయాల పాలై
నన్ను వేదిస్తున్నాయి
నీవు నాలోనే వున్నావు
నీలో నేనున్నానో లేదో
అస్సలు ఓ మనిషిగా
నన్నెందుకు అర్దం చేసుకోవో తెలీదు
అపార్దంలో నన్ను ముక్కలు చేసి
నీవేం సాదిచావో
నాకిప్పటి సమాదానం లేని ప్రశ్నలే
నీ మనస్సులో లేత ప్రాయపు చిగుర్లు
ఉచ్ఛ్వాస నిశ్వాసాలను
అందుకునే నా ప్రయత్నానికి
ఆమెదేహాన్ని దేవాలయం
అనుకొని నా మనసింకా తనకోసం
ప్రదక్షిణలు చేస్తూనే ఉంది
నాకు అవమానాల గాయాలను 
బహుమతిగా ఇచ్చింది
అందరిలో నన్ను దోషిని చేసి
శిదిలం అయిన నా మనసనే
ఆలయంలో తడబడుతున్న నా జ్ఞాపకాలు
ఆమె అడుగుల కింద
నా "ప్రేమ" వాక్యం నిశబ్దంగా ముక్కలయ్యింది
సున్నిత రూపం లేతగా
సున్నిత మనసు మరింత లేతగా
నేను అక్కున చేర్చుకుందామంటే
అపస్వరాలు వినిపిస్తున్నాయి
వేసవి కాలపు వేడి గాలి
ఆమె ముంగురుల చివరి
చెమట చుక్కను మోసుకొచ్చి
నా పెదాలపై చిలకరించింది
ఆమె అందాల పుష్పగుచ్చమై
పుప్పొడిని నా హృదయంపై చల్లి
నిష్క్రమించింది
ఒంటి స్తంబపు ఆలయపు జేగంటలకు
నా జ్ఞాపకాలను అతికించి
వెనె్నల చెరువులాంటి ఆమెలోకి
నాకు నేను తొంగి చూసుకుంటున్నాను
నా హృదయం ద్రవించీ ద్రవించీ
చంద్రవంకలా మారిపోయింది
మాటలు రాని మనసు
ఆమె ఆలోచనల పంజరంలో
పెనుగులాడి పెనుగులాడి
యవ్వనపు తోటలో మొలకెత్తాలని
తొలకరి వానకై కలగంటున్నది
ఆశగా, ఆర్ద్రతగా
ఎన్నాల్లని వేచి చూడను
తను రాదని తెల్సి
నా మనస్సు ఇంకా ఇంకా
తనకోసం తపన పడుతూనే ఉంది