మనిషి జీవితం.. మంచితనం..కోరిక...ప్రేమ..ఇవన్నీ ఏంటో.. ఎందుకు మనజీవితాల్లోకి వస్తాయో ఎందుకు వెలతాయో తెలీదు..నేనేమైపోయినా నీవు బాగుండాలి అని అన్నిటికి తలవంచడ చేతకాని తనమా..చేతులారా నటించలేక నీ ఆనందంకోసం కన్నీళ్ళు త్రాగి నీవదిలిన నీ అడుగుల చారికలనే జ్ఞాపకాలుగా చేసుకొని గతాన్ని నిందించకుండా జరిగిన ప్రతి సంఘటన కు నన్ను నేను భాధ్యుడను చేసుకొంటూ నాలో నేను కుమిలిపోతున్న క్షనాలను లెక్కచేయకుండా ఎక్కడో చోట నీవు ఆనందం గా ఉంటావులే అన్న తలపులతో నాలో నేణు తన్నుక చస్తున్నా పైకి నవ్వుతూ నీకోసం నేను ఎప్పుడూ ఓడీపోతూ క్షనాలను ఎంత భారంగా గడుపుతున్నానో నా మనసుపొరలను తట్టి చూస్తే తెలుస్తుంది చూడలని ఆశలేదు అలా ఆలో చిస్తావని కోరిక లేదు ఎందుకో ఈరోజు గడబిడగా ఏవేవో ఆలోచనలు కందిరీగల్లా నన్ను చుట్టు ముట్టి కుట్టేస్తున్నాయి..ఈ రాత్రి ఎలా గడుస్తుందో నని బెంగలేదు.తెలియని ఆందోలన ఇన్నేళ్ళ ఇన్ని తడిపొడి బంధాల పెళుసు కాగితమ్ముక్కల చాటున దాగి విరిగిపోయిన అక్షరాలు ఎందుకో వెక్కిరిస్తున్నాయి..నేనేప్పుడూ ఇలా ఆలోచిస్తుంటే వెర్రివాడినని చీదరించుకుంటున్నాయి అచ్చం నీలానే సగం మాత్రమే రాసిన అక్షరాలు నాకు ఉరి కంబాల్లా కనిపిస్తున్నాయి ఈరోజూ మనసు ఇరుకు ఆ స్తంభాల మధ్య దిసమొలతో చావు ఆట ఆడుకుంటూ రాత్రిలోకి జారుకుంటూ వెళ్తున్నానని నీకు చెప్పాలని అనుకుంటా.ఎందుకో మౌనంగా రొదిస్తూ రాని నిద్రకోసం తపనపడుతూ ఆకాశం వైపు చూస్తునే తెల్లవారుతోంది దీనికి ఎర్రబడ్డ నా కళ్ళే సాక్ష్యం కాని, ఎందుకో కర్తకర్మ క్రియలన్నీ ఎంచక్కా అమరుకుంటూ వచ్చిన వాక్యం మీద చచ్చేంత ప్రాణం!దీన్నీ ఊపిరిగా చేసుకొని కొద్దిపాటి ఊపిరిని పీలుస్తున్నానేమో కదూ నేను చావు రేఖ మీద విలవిల్లాడుతూ కూడా ఆ వాక్యం క్రియాంతం అయినప్పుడు వొక ప్రాణాంతక క్రీడానంతరం లోపలి తెల్లప్రవాహం అంతా వొక్కసారిగా పెల్లుబికి మౌనపు రక్తపారంలో ఎప్పుడూ నా జ్ఞాపకాలు నానుతూనే ఉంటాయి
ఇంకా మనజీవితం ఆగిపోలేదు కాని
నీ దారిన నువ్వూ
నా దారిన నేనూ అని విడీపోయాక
మనం
కేవలం శవాలుగా నిష్క్రమించామని
మనిద్దరికీ తెలిసిపోయింది
ఇప్పటిదాకా వ్యక్తమైనదంతా
వొక అవ్యక్త ఆత్మహత్య.
కాదంటావా? కాదనే ఆత్మ సౌందర్యం నీకుండా
నీకు కావాల్సిన క్షనికానందాలే నీకు ముక్యిం
నిజాలను అబద్దలుగా చేసి
వేడి వేది పకోడీలు చేసిన వాల్లే
నీకు నిజమయిన వాళ్లు నిజాయితీ పరులు కదూ
అయినా రాసిందల్లా అంతా అబద్ధమై
తెగిపోతున్నప్పుడు ఏం రాయమంటావ్ చెప్పు
గతమంటా అబద్దమని తెలిశాక
మళ్లీ మొదటనుండీ మొదలెట్టి ఏం చేయగలను
చివర్లో నన్ను విసిరేసి
అందరిని ముందువరసలో కూర్చో బెట్టావు
నేను ఏదీ ఆశంచలేను నిన్ను శాసించలేను
ఇద్దరిలో నన్ను ఓడించి మరొకరిని గెలిపించి
గేలి చేసిన క్షనాన్నే నేను చచ్చిపోయానుగా