విరిగిన బంధం విలువెరిగి
కన్నీటి దరల్లో
చెంపల గీతలెన్ని తుడిచినా
గతం మారదు
పోయిన పరువు బరువెరిగి
పొగిలిన చింత ఎంత కురిసిన
బరువు తీరదు.
పగిలిన గుండె సాక్షిగా
వీడిన నిద్దుర సుఖమెరిగి
నిలచిన తనువులెంత తూలినా
తనివి తీరదు.
తానేంటొ తెల్సిన క్షనాన
జారిన మాటల పదునెరిగి
తెగిన తావుల నెంతకుట్టినా
గాయం మానదు.
గుండె లోతుల్లో
గాయాన్ని నీవు చూడలేవుగా ..?
అంతా వీడిన ఆవల
నన్ను నా జ్ఞాపకాలను
నీ కాలి ముని వేల్లతో
తన్నావు ఇప్పుడునేను
విలవిలలాడేం ఏం లాభం ?
చెల్లని చిత్తు కాగితాన్ని చేసి
నన్ను నీవు విసిరిన క్షనాల్లో
నాకు నేను మడతలు పడి
ఓడిన నేను వాడిపోయిన మనస్సుతో
నన్ను నేను ఎప్పుడో వీడిపోయాను లే
కన్నీటి దరల్లో
చెంపల గీతలెన్ని తుడిచినా
గతం మారదు
పోయిన పరువు బరువెరిగి
పొగిలిన చింత ఎంత కురిసిన
బరువు తీరదు.
పగిలిన గుండె సాక్షిగా
వీడిన నిద్దుర సుఖమెరిగి
నిలచిన తనువులెంత తూలినా
తనివి తీరదు.
తానేంటొ తెల్సిన క్షనాన
జారిన మాటల పదునెరిగి
తెగిన తావుల నెంతకుట్టినా
గాయం మానదు.
గుండె లోతుల్లో
గాయాన్ని నీవు చూడలేవుగా ..?
అంతా వీడిన ఆవల
నన్ను నా జ్ఞాపకాలను
నీ కాలి ముని వేల్లతో
తన్నావు ఇప్పుడునేను
విలవిలలాడేం ఏం లాభం ?
చెల్లని చిత్తు కాగితాన్ని చేసి
నన్ను నీవు విసిరిన క్షనాల్లో
నాకు నేను మడతలు పడి
ఓడిన నేను వాడిపోయిన మనస్సుతో
నన్ను నేను ఎప్పుడో వీడిపోయాను లే