పరిగెడుతున్న కాలం ఒక్క క్షణం అలా ఆగి నిలిచిపోయి మరలా సాగినట్టనిపించింది. రోడ్డు మీద అలానే నిల్చుని ఆ క్షణాన్ని మరలా మరలా గుర్తు చేసుకుంటు తన్మయత్వంలో ఉండిపోయాను. ఒక్కసారిగా నాకు ఎదో జరిగిన అనుభూతి, మనసులో ఒక తెలియని ఉద్వేగం. తేరుకుని తిరిగి చూసేసరికి తను దూరంగా వెళ్ళిపోయింది. ఆ అద్భుత క్షణాన్ని అలా తలుచుకుంటూ చాలారోజులు గడిపేసాను. తనని చూసిన అదే సమయానికి రోజూ వెళ్ళి ఎదురు చూసేవాడ్ని. కానీ తను మరలా కనిపించలేదు. ..
క్షరమక్షరం కూర్చి నీకోసం
పత్రాలు వ్రాసే నేను...
ప్రతి లేఖనూ చిన్నచిన్న ముక్కలు
చేసి పైకెగరేశావుగా నీవు
నా మనో భావాల మాలికలల్లి
నీకు సమర్పించే నేను
ఒక్క భావానికి కూడా
చలించని హృదయంతో నీవు...
ప్రేమ మందిరం కోసం
చలువరాళ్ళు సేకరిస్తూ నేను
ప్రేమకు సమాధి కట్టేందుకు
ఇటుకలు పేరుస్తూ నీవు...
ప్రేమ విజేతనవ్వాలనే
తపనతో నేను...
ఈ పోటీలో గెలుపు
నీదేనన్న ధీమాతో నీవు..
క్షరమక్షరం కూర్చి నీకోసం
పత్రాలు వ్రాసే నేను...
ప్రతి లేఖనూ చిన్నచిన్న ముక్కలు
చేసి పైకెగరేశావుగా నీవు
నా మనో భావాల మాలికలల్లి
నీకు సమర్పించే నేను
ఒక్క భావానికి కూడా
చలించని హృదయంతో నీవు...
ప్రేమ మందిరం కోసం
చలువరాళ్ళు సేకరిస్తూ నేను
ప్రేమకు సమాధి కట్టేందుకు
ఇటుకలు పేరుస్తూ నీవు...
ప్రేమ విజేతనవ్వాలనే
తపనతో నేను...
ఈ పోటీలో గెలుపు
నీదేనన్న ధీమాతో నీవు..
క్షణాన నా కనుల నుండి కరిగిపొతూ క్షణ క్షణాన కన్నీటి బిందువులు సిందువులుగా నేల రాలుతుండగా నా మనసు వాటితో దోబూచులాడుతూ అడిగింది ఆలోచన రహితం గా ,,అర్దాంతరంగా అడుగులు వెలుపలికి వేసారు ఎం అని వెను వెంటనే ఆ కన్నీటి బిందువులు కన్నీరు కారుస్తూ..ఎదన దుఃఖం ఎగసి పడుతున్నది..తలపులతో తనువు బరువౌతున్నది హృదయపు సవ్వడులు తక్కువై నిట్టూర్పులు ఎక్కువౌతున్నవి ప్రేమ ఓటమిని అంగీకరించనన్నది మరణం విజయ దరహాసం చేస్తున్నది పెదవి దాటని పదాలు నిన్ను కడసారి చూడాలంటున్నవి స్వప్నం కూడా నిన్ను కానలేదన్నది నా జీవితం మైనంలా కరుగుతున్నది
సరిపోదా ఈ జన్మకు నువు చేసిన మోసం
మానేదా నా ప్రేమకు నువు చేసిన గాయం
గుండె పొరల్లో దాచి ఉంచిన నీపై అభిమానం
ఒక్క దెబ్బతో పగిలి పొయిందే...నీదే ఆ నేరం.....
ఒక్కటి కాదు ముక్కలైన నా హృదయం
నా వేదనకి నువ్వే పూర్తి కారణం...