అర్ధరాత్రి చెంపలపై ఆత్మీయపు తడి తగిలితే
నా కన్నీరేమో అదేంటి నాకు తెల్వ కుండా
వస్తున్నాయి అనుకున్నా
కిటికీ అవతల వర్షం కురుస్తోంది
తెల్లని పువ్వయి విచ్చుకున్న ఆ
కాశపు హృదయం నుండీ
జాల్వారినట్లు వాన కురుస్తోంది
గతాన్ని గాయం చేశావుగా
అందుకే నా కన్నీళ్ళు వానై కురుస్తోంది
నా కన్నీరేమో అదేంటి నాకు తెల్వ కుండా
వస్తున్నాయి అనుకున్నా
కిటికీ అవతల వర్షం కురుస్తోంది
తెల్లని పువ్వయి విచ్చుకున్న ఆ
కాశపు హృదయం నుండీ
జాల్వారినట్లు వాన కురుస్తోంది
గతాన్ని గాయం చేశావుగా
అందుకే నా కన్నీళ్ళు వానై కురుస్తోంది
తెలియని రసప్రపంచపు రహస్య
ద్వారమేదో తెరచుకున్నట్లుంటుంది
నీలిరంగు చీకటిలో నీడలు కదలాడినట్లు
మార్మిక ఛాయలేవో మనసును కలవరపెడతాయి
తడిసిన మట్టి వాసనతో గాలి శరీరాన్ని చుడితే
సాంద్రమూ సన్నిహితమూ అయిన స్వప్నమేదో
స్పర్శించినట్లుంటుంది మనసెప్ప్పుడు
నిన్నే తలస్తోంది
లేని నిన్ను నీ జ్ఞాపకాలు తలుస్తున్నాయి
సగం తెరిచిన కిటికీ రెక్కపై
చిత్రమైన సంగీతాన్ని ధ్వనించే చినుకులు
చిరుజల్లై నన్ను తాకి నిన్నే
గుతుకు తెస్తున్నాయి
నిద్రకూ మెలకువకూ మధ్య నిలిచి
నిద్రను దూరం చెస్తున్నాయి
మనసు ఉల్లాసంగా ఉన్నా..
ఎక్కడో ఎందుకో తెలీని భాద
మంద్రస్థాయిలో వినిపించే
జంత్రవాయిద్యపు సంగీతవిభావరిలో
తన్మయమై పోయిన మనస్సు
తెలియకుండానే పొలిమేర
దాటి నిద్రలో జోగుతుంది
తెరలు తెరలుగా దృశ్యం
అదృశ్యంలోకి మాయమయినట్లుగా
ఏంటో ఏదో తెలియని భాద
తెలియని ఆందొలన
ఎప్పుడూ నీవేం చేస్తావో
అని ఎక్కడున్నావో అని
తడబడుతున్న మనస్సు
నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక
వర్షం లో నేను కార్చే కన్నీరు
ఎవ్వరూ చూడలేరుగా
నీకు చూడాల్సిన అవసరం నీకు లేదుగా