తీరం తెలియని ప్రయాణం
అలసట తీరని మజిలీలు
దప్పికతో దహించుకుపోయా.
కనుచూపుమేరా
సాంద్రంగా పేరుకున్న ఇసుక
అయినా ఆగలేని నిస్సాహయత
సాగలేని నిరాసక్తత.
ఇంకెన్ని అవంతరాలు అవరోదాలు
చాలు భగవాన్ ఈ పరీక్షలు
ఇకనైనా చెప్పు నన్ను
ఎందుకు పుట్టించావ్?
ఆకాశం వైపే నిశ్చలంగా చూస్తున్నా
ఆశతో కాదు
ఆవేదనతో.
కాలంతో సమాంతరంగా
పరిగెడుతూనే ఉన్నా
జీవితాన్నో, ప్రపంచాన్నో
ఇంకాదేన్నో తెలుసుకోవాలని.
ఏమీ తెల్సుకోలేక
అలసట తీరని మజిలీలు
దప్పికతో దహించుకుపోయా.
కనుచూపుమేరా
సాంద్రంగా పేరుకున్న ఇసుక
అయినా ఆగలేని నిస్సాహయత
సాగలేని నిరాసక్తత.
ఇంకెన్ని అవంతరాలు అవరోదాలు
చాలు భగవాన్ ఈ పరీక్షలు
ఇకనైనా చెప్పు నన్ను
ఎందుకు పుట్టించావ్?
ఆకాశం వైపే నిశ్చలంగా చూస్తున్నా
ఆశతో కాదు
ఆవేదనతో.
కాలంతో సమాంతరంగా
పరిగెడుతూనే ఉన్నా
జీవితాన్నో, ప్రపంచాన్నో
ఇంకాదేన్నో తెలుసుకోవాలని.
ఏమీ తెల్సుకోలేక
నిర్వేదగా ఆకాశం
వైపు ఆసగా చూస్తున్నా
నిన్నటికి నేటికి తేడా తెల్సుకోలేక
నేటికి రేపటిలో ఒదిగిపోయిన
గతాన్ని తడుముకోలేక
నేనున్నానో లేనో అర్దంకాక
అవేదనగా ఆందోలనగా
నాకు నేను అర్దంకాలేక
అర్దం చేసుకునే మనుషులు
దగ్గరలేక ఎందుకిలా
ఎన్నాలిలానో ఆర్ధం కాల
అపార్దల సుడిగుందంలో
కొట్టుకపోతూనే ఉన్నా