ఆక్రోశం. ఆవేదనై
అక్కరకు రాని అక్షరాలుగా
మారుతున్నాయి
కదిలే భావాలతో గతమంతా
కవితలో ఉప్పొంగుతుంది
ఆరాటమా పదాల్లో నుండి తొణుకుతుంది.
ఆ రెప్పల అలికిడి నా అధరాలనొణికిస్తుంది..
అక్కరకు రాని అక్షరాలుగా
మారుతున్నాయి
కదిలే భావాలతో గతమంతా
కవితలో ఉప్పొంగుతుంది
ఆరాటమా పదాల్లో నుండి తొణుకుతుంది.
ఆ రెప్పల అలికిడి నా అధరాలనొణికిస్తుంది..
చేదు జ్ఞాపకాల
అనుభవాలు ఆ ముళ్ళు.
మనసు నిండిన
ముళ్ళు నా లోనేపెట్టుకొని
మధురంగా ..నీకోసం..
తలయెత్తి పూసిన
నా ఆశ గులాబీలవి..
నా రుధిర జ్ఞాపికలవి
అవును కేవలం నీకోసం..
విధినేమనను ?
నీది కానప్పుడు ..
వినలేని తీరిక నీకు లేనప్పుడు
నిచెవికి చేరి నీమనస్సుకు చేరలేని
అవన్నీ నీజ్ఞాంపకాలుగా మారి
గులాబి ముళ్ళై నన్నే గుచ్చేస్తున్నాయి
నీ నా ల బేధాలున్నాయని
ఇంకా మన మధ్య ఉంటాయని అనుకోలేదు
నీ నవ్వులు, ఆ మధుర భావాలు, ఊసులు
నా మది గాయాలకు నవనీతాలు గామారాయి
నీవన్నీ నావనుకున్నా..
నేనే నీవాడనుకున్నా
నేనే నీవాడనుకున్నా
ఆ నవ్వులు నీవంటావా ...
కాదని తేల్చేకదా
కనికరంలేకుండా వెల్లిపోయావు
ఇప్పుడే మల్లీ
నా మనసు మీద మరో ముల్లు
మొలిచింది..
నాగుండెకు గుచ్చుకుంది..
చూశావా.. నీకోసం.
మన జ్ఞాపకం మరో
ఎర్ర గులాబై పూసింది
నాలో ఇంకా
రక్తం మిగిలి ఉండేమో అని
గుండెలో ఉందేమొనని
రక్తాని తోడుతోంది
నిర్దయగా
జాలనేది లేదుకదా నీకు
జాలనేది లేదుకదా నీకు
నిన్ను నా ఊహల్లో
నింపుకుంటూ..
గుండె గాయాలు
పూడ్చుకుంటూ..
నీ బాటన గులాబీలు
పరుచుకుంటూ..
విధి వెల్లువలో
కొట్టుకు పోతున్న నేను...
నీ చెలిమి కోసం ఎదురు చూస్తున్న
ఆశచావని నిరాశను మిగుల్చుకున్న
చకోరాన్ని నేను..
నా కంటి స్వాతి చినుకులు గుండెల్లో
దాచుకుని.. నీకోసం ముత్య మవుతున్న
ఆలు చిప్పను నేను.
నీకై గులాబీలు పూయిస్తున్నా
నా గత జ్ఞాపకాల కంపను నేను
ఎప్పటికి నన్ను నన్నుగా గుర్తిస్తావో ఏమో